పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మొక్కలు నాటి పెంచాలి.
మచిలీపట్నం జులై 28 (ప్రజా అమరావతి);


పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మొక్కలు నాటి పెంచాల


ని  జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గారి సతీమణి పి సుజాత పిలుపునిచ్చారుప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టబడింది.


ఇందులో భాగంగా ఉదయం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్  సతీమణి సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, మహిళా జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సతీమణి మాట్లాడుతూ

మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున 5 లక్షల 21,850 పైగా మొక్కలను నాటే కార్యక్రమం జరుగుతోందన్నారు. మొక్కలే జీవనాధారం అన్నారు.

మొక్కల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. 

ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తద్వారా భావితరాల వారికి మంచి బహుమతి అందించిన వారమవుతామన్నారు.


అనంతరం సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ మాట్లాడుతూ జిల్లాలో కలెక్టరేట్ తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, లేఅవుట్లలో 30 వేల మొక్కలను పెద్ద ఎత్తున నాటడం జరుగుతుందన్నారు. కేవలం మొక్కలు నాటడంతోనే సరిపెట్టకుండా పిల్లలను పెంచే విధంగా వాటిని సంరక్షించాలని  శపథం తీసుకోవాలన్నారు. మహిళా సాధికారత లో భాగంగా మహిళా అధికారులు ఉద్యోగులచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని మహిళా అధికారులు ఉద్యోగులు అందరూ కూడా ముందుకు వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరడం  జరిగిందన్నారు. ఆ ప్రకారం మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క మహిళ ముందుకు వచ్చి ఒక మొక్క తీసుకుని వెళ్లి తమ ఇంటిలో నాటి కాపాడాలన్నారు. జిల్లాలో అటవీశాఖ భాగస్వామ్యంతో పచ్చదనం  పెంపుదలకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారుతదుపరి వారు మహిళా అధికారులు ఉద్యోగులు అందరితో కలిసి పచ్చని చెట్లు- ప్రగతికి మెట్లు, వృక్షో రక్షతి రక్షితః,చెట్లను పెంచు-ప్రగతిని పంచు వంటి పలు నినాదాలు చేశారు.


తదనంతరం వారు నగరంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం-2 లో చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాలలో కూడా మొక్కలు నాటారు. అక్కడి విద్యార్థులతో మొక్కల వలన కలిగే ప్రయోజనాలను వివరింపజేశారు. విద్యార్థులతో కలిసి మొక్కలను పరిరక్షించాలని నినాదాలు చేయించారు.

విద్యార్థులు బాగా చదువుకోవడంతో పాటు ప్రతి ఇంట మొక్కలు నాటి కాపాడుకోవాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో  జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి ముడా విసి రాజ్యలక్ష్మి, డిఎస్ఓ పార్వతి, డీఈవో తెహరా సుల్తానా, ఏపీఎంఐపీ పిడి విజయలక్ష్మి, డి ఎస్ డి ఓ ఝాన్సీ ,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చంద్ర లీల, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, డి ఆర్ డి ఎ పి ఎస్ ఆర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డిటిసి సీతాపతి అటవీ అధికారులు సుజాత,అరుణకుమారి పలువురు కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు బ్రహ్మకుమారీలు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments