కియా ఇండియాకు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నాం..

 *సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏడాదికి సగటున రూ.13 వేల కోట్లు పెట్టబడులు*


*: కియా ఇండియాకు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నాం..*



*: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్*


*: రెండేళ్లపాటు కోవిడ్ పరిస్థితుల్లో  కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కియా ఇండియాకు కావలసిన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందించాం*


*: కియా ఇండియాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున శుభాకాంక్షలు*


*: రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం మరియు చేనేత & జౌళి శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్*


పెనుకొండ (శ్రీ సత్యసాయి జిల్లా), జూలై 13 (ప్రజా అమరావతి):


పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్దనున్న 'కియా మోటార్స్' కంపెనీ గత నాలుగేళ్లలో 10 లక్షల కార్ల ఉత్పత్తిని పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం మరియు చేనేత & జౌళి శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ మంత్రి & పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, కియా మోటార్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ పెనుకొండ వద్దనున్న కియా ఇండియా పరిశ్రమలో 10 లక్షల కార్లు ఉత్పత్తి కావడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం అత్యంత వెనుకబడినదని, పెనుకొండ వద్ద 15 వేల కోట్ల పెట్టుబడితో దాదాపు 20 వేల మందికి ఉపాధి కల్పిస్తూ, అందులో 85 శాతం మందికిపైగా స్థానికులకు ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు. 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇక్కడ ఏ పరిశ్రమ ఏర్పాటు చేసిన 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించాలని చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. 2023 నాటికి కియా ఇండియాలో 10 లక్షల కార్లు ఉత్పత్తి కావడం జరిగిందన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పరిశ్రమలకు సంబంధించి ఏడాదికి సగటున 13 వేల కోట్లు పెట్టబడులు వచ్చాయన్నారు. ఈ ప్రభుత్వంలో ఏడాదికి సగటున 13వేల కోట్లు పెట్టబడులు రాగా, గత ప్రభుత్వంలో ఏడాదికి 11 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చాలా నిదానంగా ఉన్నాయని, వ్యాపార పరంగా తగ్గుముఖం పట్టాయని, రెండు సంవత్సరాల పాటు కోవిడ్ వల్ల వెనుకబడ్డామని, ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురైనా గత ప్రభుత్వానికన్నా అధికంగా సగటున 13 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్న విషయం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కియా ఇండియాకు సంబంధించి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామని, అవసరమైన భరోసాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న పరిశ్రమలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు గాని చిత్తశుద్ధితో ముందుకు వెళ్లడం జరుగుతోందన్నారు.


ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి & వాణిజ్యం మరియు చేనేత & జౌళి శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కియా ఇండియా 2019 డిసెంబర్ నుంచి ఉత్పత్తి మొదలుపెట్టిన తర్వాత 10 లక్షల కార్లు ప్రొడక్షన్ పూర్తి చేసుకుందన్నారు. కేవలం 47 నెలల కాలంలోనే అత్యంత వేగవంతంగా 10 లక్షల కార్లను తయారుచేసిన కియా సంస్థను అభినందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున కూడా కియా సంస్థకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో దాదాపు రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కియా ఇండియాకు కావలసిన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందించామన్నారు. విశాఖపట్నం వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో కూడా సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కియా ఇండియా ప్రతినిధులు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. కియా ఇండియాకి, అనుబంధ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరిశ్రమకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా అందించేలా తోడ్పాటు అందిస్తామన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట ప్రకారం స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చట్టం ఉండగా, 86 శాతం స్థానికులకు పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని కియా కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, హైదరాబాద్ - బెంగళూరు కేరిడార్ లో ఓర్వకల్లు వద్ద 10 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అక్కడ అవసరమైన నీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్నామని, 400 కోట్ల రూపాయలకుపైగా ఖర్చుతో నీటి సరఫరా కోసం అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని, తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో పరిశ్రమలు ఏర్పాటు సంబంధించి 30 వేల కోట్ల రూపాయల క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందన్నారు. కియా ఇండియా ఎక్కడికి తరలి వెళ్లదని, ఇలాంటివి అవాస్తవమని, ఇక్కడ అతి తక్కువ సమయంలో 10 లక్షల కార్ల ఉత్పత్తి ఇందుకు నిదర్శనమని, ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు పరిశ్రమకు అందిస్తామన్నారు.


ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కియా ఇండియాలో 10 లక్షల కార్లను ఉత్పత్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. అతి తక్కువ వ్యవధిలో 10 లక్షల కార్ల ఉత్పత్తి అనేది ఎంతో గొప్ప విషయమన్నారు. కియా పరిశ్రమకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవసరమైన సహకారాలు అందిస్తున్నారు. పరిశ్రమ కోసం అవసరమైన భూమి, నీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా మాజీ మంత్రి & పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ మాట్లాడుతూ కియా ఇండియాలో పది లక్షల కార్ల ఉత్పత్తి అనేది గర్వించదగ్గ విషయమన్నారు. పెనుకొండ నియోజకవర్గం ప్రాంతంలో కియా ఏర్పాటు గొప్ప వరమన్నారు. పరిశ్రమ పరిధిలో సి ఎస్ ఆర్ యాక్టివిటీ కింద మరింత నిధులు ఖర్చు చేసి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.


ఈ కార్యక్రమంలో కియా ఇండియా ఎండి & సిఈఓ టె జిన్ పార్క్, చీఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ చోయ్ మూన్‌హీ, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ, ప్రొడక్షన్ సీనియర్ జనరల్ మేనేజర్ వెంకదేశన్, కియా భారతదేశ విజన్ అంబాసిడర్ సోనమ్, పిఆర్ఓ తేజస్వి బండారి, తదితరులు పాల్గొన్నారు.



Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image