రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో భేటి.

 రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో భేటి


అమరావతి,31 జూలై (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టు రిక్రూట్మెంట్)కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 కు సవరణ ప్రతిపాదనపై సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ అధ్యక్షతన వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది.రాష్ట్ర విభజన నేపధ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన దృష్ట్యా జిల్లాల స్థానికత,జోనల్ వ్యవస్థ పునర్వవస్థీకరణ చేస్తున్నందున అందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 కు సవరణ ప్రతిపాదనపై ఈసమావేశంలో ఉద్యోగ సంఘాలతో చర్చించడం జరిగింది.ఈసందర్భంగా సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలకు తెలియజేసి వారి నుండి పలు సూచనలు,సలహాలను స్వీకరించారు.ఈసలహాలు,సూచనలను తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీకి సమర్పించనున్నట్టు కార్యదర్శి భాస్కర్ తెలిపారు. 

ఈసమావేశంలో ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి,ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్,జెఎసి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి,ఎస్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్,పిఆర్టియు అధ్యక్షులు యం.కృష్ణయ్య, యం.గిరి ప్రసాద్,యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు,ఎపి ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎస్.శ్రీనివాస రావు,ఎపిటిఎఫ్ అధ్యక్షులు జి.హృదయరాజు,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షురాలు బి.సుగుణ,ఆల్ ఆంధ్రప్రదేశ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లేశ్వరరావు,ఎపి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సిహెచ్.శ్రావణ కుమార్,ఎపి ఎనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రజినీస్ బాబు,ఎపి జూనియర్ వెటర్నరీ ఆఫీసర్స్ అండ్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు బి.సేవానాయక్ తోపాటు ఆయా సంఘాల జనరల్ సెక్రటరీలు తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments