గ్రీవెన్స్ లను మరింత ఎక్కువ నాణ్యతగా పరిష్కరించాలి.

 *గ్రీవెన్స్ లను మరింత ఎక్కువ నాణ్యతగా పరిష్కరించాలి


*


*: జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో అధికారులంతా పరిశీలించాలి*


*: వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు జగనన్న సురక్ష సర్వేలో పూర్తిగా పాల్గొనేలా చూడాలి*


*: జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ ల పరిష్కారంలో రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిన శ్రీ సత్యసాయి జిల్లా*


*: ఇందుకు జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక అభినందనలు*


*: జగనన్నను చెబుదాం జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు, ఐఏఎస్ (ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్)*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జూలై 18 (ప్రజా అమరావతి):


జగనన్నను చెబుదాం కింద వస్తున్న గ్రీవెన్స్ లను మరింత ఎక్కువ నాణ్యతగా పరిష్కరించాలని జగనన్నను చెబుదాం జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు, ఐఏఎస్ (ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్) ఆదేశించారు.


మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష అమలు పై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబుతో కలిసి జగనన్నను చెబుదాం జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జగనన్నను చెబుదాం జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేవీఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాలు జిల్లాలో చక్కగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రస్థాయిలో కూడా జిల్లా పనితీరు మంచి స్థానంలో ఉండడం హర్షనీయమన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులంతా గ్రామాల్లోనూ, హౌస్ హోల్డ్ స్థాయిలో ఈ కార్యక్రమాల అమలు తీరు ఎలా ఉంది అనేది పరిశీలించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలు ఎలా అమలు అవుతున్నాయో ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు. ఆయా శాఖల పరిధిలో ఇప్పుడున్న సీజన్ కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. జగనన్న సురక్ష కింద సంతృప్తి స్థాయిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయా లేదా అనేది పరిశీలన చేయడం జరుగుతోందని, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఈ సర్వేలో పూర్తిగా పాల్గొనేలా చూడాలన్నారు. ఆయా మండల పరిధిలోని అన్ని సచివాలయాల్లోనూ నాణ్యతగా గ్రీవెన్స్ పరిష్కారం జరగాలన్నారు. గ్రీవెన్స్ పరిష్కారంలో ప్రాధాన్యత ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో సీజన్ ను అనుగుణంగా సమస్యలు వస్తుంటాయని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల పరిధిలో సర్వేని ఉపయోగించుకుని డిపార్ట్మెంటల్ యాక్టివిటీలను చేపట్టాలని, ప్రతి శాఖకి ఏదో ఒక అంశం ఈ సర్వేలో తెలుస్తుందని, ఆయా శాఖల పరిధిలో సర్వే లో వచ్చిన అంశాలు జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలన్నారు. సాధారణంగా నిర్వహించే కార్యక్రమం కాకుండా సర్వేలో మన దృష్టికి వచ్చిన వివిధ సర్వీసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. టెక్నాలజీ వల్ల చాలా విషయాలు వేగంగా జరుగుతున్నాయని, ఈ విషయాలపై ప్రజలకు క్యాంపెయిన్ మోడ్ లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాధారణంగా జరిగే కార్యక్రమాలతో పాటు మరికొంత వినూత్నంగా ఏం చేయొచ్చని ఆలోచించాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న గ్రామసభలు పూర్తి కావచ్చాయని, గ్రామ సభల నుంచి వచ్చిన సమాచారాన్ని పూర్తిగా ఆయా శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటిని సర్వే చేసి సమాచారాన్ని సేకరిస్తున్నామని, వచ్చే ఏడాది పాటు ఏం చేయాలి, ఏ శాఖ పరిధిలో ఎలాంటి యాక్టివిటీలు చేపట్టొచ్చు, ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి, గ్రామాల వారిగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక సిద్ధం అయితే వచ్చే 5 నుంచి 10 ఏళ్ల వరకు అది ఉపయోగపడుతుందని, శ్రీ సత్య సాయి జిల్లా కొత్తగా ఏర్పడిందని, ఎక్కడ ఏ అవసరం ఉంది అనేది ఇంటింటికి తిరిగినప్పుడు తెలుస్తుందని, ఆ ప్రాంతం, హౌస్ హోల్డ్ అవసరాలు ఏంటి అనేది తెలుసుకుంటే మంచి పరిపాలన అందించవచ్చన్నారు. అన్ని శాఖల పరిధిలోను ఇలాంటి యాక్టివిటీలు జరగాలన్నారు.


జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ ల పరిష్కారంలో రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో శ్రీ సత్యసాయి జిల్లా :


జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద జిల్లాకు సంబంధించి 2,578 గ్రీవెన్స్ లు రాగా,  2,280 గ్రీవెన్స్ లు పరిష్కరించడం జరిగిందన్నారు. జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ ల పరిష్కారంలో శ్రీ సత్యసాయి జిల్లా రాష్ట్రస్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమం కింద 88 శాతం గ్రీవెన్స్ లకు పరిష్కారం చూపడం జరిగిందని, ఇందుకు జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం కింద గ్రీవెన్స్ లను మరింత ఎక్కువ నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలా గ్రీవెన్స్ లను పరిష్కరించాలని, ఇందులో మరింత పురోగతి చూపించాలన్నారు. ఏ గ్రీవెన్స్ లలో సంతృప్తి స్థాయి తక్కువగా ఉంది అనేది గమనించాలని, సంతృప్తి స్థాయి పెంచేలా మండల ప్రత్యేక అధికారులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కువ గ్రీవెన్స్లు వస్తున్న శాఖలు గ్రీవెన్స్ ల పరిష్కారం పై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, దానిద్వారా ప్రజల్లో సంతృప్తి స్థాయి మరింత పెంచవచ్చన్నారు. గ్రీవెన్స్ లు ఎక్కడ రిజెక్ట్ అయ్యాయి, కరెక్ట్ గా రిజెక్ట్ అయిందా లేదా, ప్రత్యేక దృష్టితో పరిశీలించాలని, ప్రభుత్వంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లినా తన సమస్య పరిష్కారం కాలేదని దరఖాస్తుదారుడు భావించరాదని, ప్రతి గ్రీవెన్స్ పరిష్కారం పై శ్రద్ధ ఉండాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు రిజెక్ట్ అయిన కేసులను ప్రతి ఒక్కటి వ్యక్తిగతంగా పరిశీలన చేసి రిపోర్ట్ అందించాలన్నారు. ప్రతి గ్రీవెన్స్ కు నాణ్యతగా పరిష్కారం చూపించేలా చూడాలన్నారు. గడువులోపే గ్రీవెన్స్లను పరిష్కరించాలని, ఎలాంటి పెండింగ్ ఉంచారదన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని, ప్రతిరోజు అధికారులు వారి లాగిన్లను చెక్ చేసుకోవాలని, గ్రీవెన్స్ పెండింగ్ ఉంచకుండా పరిశీలన చేసి పరిష్కరించాలన్నారు. ప్రతి గ్రీవెన్స్ కి ఒక ప్రత్యేక గడువు ఇచ్చారని, గడువులోపు ఖచ్చితంగా గ్రీవెన్స్ ని పరిష్కరించాలని, ఇందులో మరింత పురోగతి సాధించాలన్నారు. జిల్లాను ముందంజలో నిలిపేలా అధికారులు పనిచేయాలన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద జిల్లాకు సంబంధించి 2,578 గ్రీవెన్స్ లు రావడం జరిగిందని, అందులో 2,280 గ్రీవెన్స్ లు పరిష్కరించడం జరిగిందని, 88 శాతం గ్రీవెన్స్ లకు పరిష్కారం చూపడం జరిగిందన్నారు. గ్రీవెన్స్ లకు నాణ్యతగా పరిష్కారం చూపిస్తున్నామన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా గడుపులోపే పరిష్కారం చూపేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో అన్ని సచివాలయంలో పరిధిలో షెడ్యూలింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 3.08 టోకెన్లను రైజ్ చేసి 90 శాతానికి పైగా సర్వీస్ రిక్వెస్ట్ కింద నమోదు చేయడం జరిగిందన్నారు. సర్వీస్ రిక్వెస్ట్ లకు గడువులోపే పరిష్కారం చూపిస్తున్నామన్నారు. సర్వీస్ లను నాణ్యతగా పరిష్కరించడం పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నుండి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం 36 సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 70 శాతం పైగా జగనన్న సురక్ష కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మిగిలిన సచివాలయాల పరిధిలో పక్కాగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు.


ఈ సమావేశంలో సిపిఓ విజయ్ కుమార్, ఆర్డీఓలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, డ్వామా పిడి రామాంజనేయులు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ మోసెస్, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డిఎఫ్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, ఇంచార్జి డిఈఓ రంగస్వామి, సివిల్ సప్లై డిఎం అశ్వర్థ నారాయణ నాయక్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, డిసిఓ కృష్ణ నాయక్, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, జిల్లా వాటర్ సప్లయి ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి శుభదాస్, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.Comments