భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ.

 *భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ


వరంగల్ జిల్లా :జూలై 08 (ప్రజా అమరావతి);

వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ పర్యటన నేపథ్యంలో మామునూరు చేరుకుని భద్రకాళి ఆలయాన్ని సందర్శించేందకు వచ్చిన ప్రధాని మోడీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రధాని ప్రదక్షిణ చేశారు. తర్వాత ఆలయ ఆవరణలో గోశాలలో నిర్వహించిన గో సేవలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు...

Comments