జగనన్నకు చెబుదాం (స్పందన) అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, సత్వరమే పరిష్కరించాలనలి.



నెల్లూరు, జూలై 24 (ప్రజా అమరావతి ): 

 జగనన్నకు చెబుదాం (స్పందన) అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, సత్వరమే పరిష్కరించాలని


జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. 


సోమవారం ఉదయం  కలెక్టరేట్  తిక్కన ప్రాంగణంలో   డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ, జడ్పీ సీఈవో శ్రీ చిరంజీవి, డిపివో శ్రీమతి సుస్మిత తో కలిసి జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను కలెక్టర్ స్వీకరించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకి చెబుదాం (స్పందన) కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.   ప్రజల నుండి విజ్ఞప్తులు వచ్చినపుడు సకాలంలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్నకి చెబుదాం (స్పందన) కార్యక్రమం లో వచ్చే ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అవసరమైతే వ్యక్తిగతంగా తనిఖీ చేసి సంతృప్తికరంగా పరిష్కార మార్గం చూపించాలన్నారు. ప్రతి అర్జీ పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉందని, అర్జీదారులు కూడా ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలన్నారు. 

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ, ఐసిడిఎస్ పిడిలు కె. సాంబశివారెడ్డి, హేనా సుజన్ , డిఎంహెచ్వో పెంచలయ్య,  ఇరిగేషన్ ఎస్ ఈ కృష్ణమోహన్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, డిఇవో గంగా భవాని, బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నిర్మలాదేవి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

 


Comments