*మౌలిక సదుపాయాల కల్పనతోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
*
తిరుపతి, జూలై 13 (ప్రజా అమరావతి): శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టం, ప్రపంచ ప్రసిద్ది గాంచిన చారిత్రాత్మక ప్రదేశం తిరుపతికి దేశ విదేశాలనుండి భక్తులు వస్తుంటారు, అంతర్జాతీయ ప్రమాణాలు గల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత నివ్వడం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. గురువారం ఉదయం స్థానిక ఎస్ వి యునివర్సిటీ స్టేడియంలో రాష్ట్రంలో కొత్తగా 3 జాతీయ రహదారులకు శంఖుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కృష్ణ పట్నం పోర్టు కు కనెక్టివిటీ ప్యాకేజ్ 2,3,4 జాతీయ రహదారుల నిర్మాణానికి డిజిటల్ విధానంలో శంఖుస్థాపన చేసి ప్రసంగించారు. 2014 లో మంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటికి ఆంద్ర ప్రదేశ్ లో 4193 కిమీ జాతీయ రహదారులు వుంటే, అది నేడు 2023 నాటికీ 8744 కిమీ లకు చేరి దాదాపు రెండింతల నిర్మాణాలు జరిగాయని అన్నారు. మౌలిక సదుపాయలతోనే నిరుద్యోగ నిర్మూలన చేయగలం అని నమ్మిన మన ప్రధాని నరేంద్ర మోడీ నీరు, విద్యుత్, రహదారులు, కమ్యునికేషన్ వంటి వాటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. ప్రరిశ్రమల స్థాపనకు ఈ మౌలిక సదుపాయాలు లేకుంటే పారిశ్రామిక పెట్టుబడులు రాక నిరుద్యోగ సమస్యను తీర్చలేమని అన్నారు. పోర్ట్ లకు ప్రాముఖ్యత కలిగిన ఆంద్ర ప్రదేశ్ కు దేశంలోనే ప్రముఖ పోర్ట్ గా ప్రసిద్ది గాంచిన విశాఖపట్నం వుందని అన్నారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 3 పోర్ట్ ల ఏర్పాటుకు ఆసక్తి కనబరిచిందని సంతోషం అని అన్నారు. పోర్ట్ లు దేశాభివృద్ధికి తోడ్పతాయని అన్నారు. 2023 నాటికి 91 వివిధ ప్రాజెక్టులు 3240 కిమీ రూ.50 వేల కోట్లతో పూర్తీ చేస్తున్నామని మరో రూ.75 వేల కోట్లతో 190 ప్రాజెక్టులు పలు దశల్లో వున్నాయని, త్వరలో పూర్తి కానున్నాయని అన్నారు. రూ 20 వేల కోట్లతో 25 ప్రాజెక్టులు 800 కిమీ , రూ.50 వేల కోట్లతో 45 ప్రాజెక్టులు 1800 కిమీ ఏర్పాటు కానున్నాయని అన్నారు. ప్రత్యేకంగా 19 వేల కోట్లతో 430 కిమీ పోర్ట్ ల అనుసంధాన పనులు జరుగుతున్నాయని అన్నారు. ఆంద్రప్రదేశ్ లో దాదాపు రూ. 2 లక్షల కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని విదేశీ , దేశీయ పెట్టుబడులతో ప్రరిశ్రమల స్థాపనకు మొగ్గు చూపుతున్నారని దీనికి రవాణా సౌకర్యం కారణమని అన్నారు. ఒక్క తిరుపతి జిల్లాలోనే రూ. 17 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని 2024 నాటికీ పూర్తీ కానున్నాయని, జిల్లా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. ఇప్పటికే రూ.4 వేల కోట్లతో పనులు పూర్తీ అయ్యాయని, మరో రూ.13 వేల కోట్లతో జరుగుతున్న కడప – రేణిగుంట , తిరుపతి – మదనపల్లి , రేణిగుంట – నాయుడుపేట 6 లేన్ వంటి రహదారులు 2025 నాటికి పూర్తీ కానున్నాయని అన్నారు. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో నాయుడుపేట - తూర్పు కనుపూరు 6 లేన్ల రహదారి 35 కి.మీ రూ.1399 కోట్లు, చిల్లకారు క్రాస్ నుండి తూర్పు కాన్పూర్ వరకు 4 లేన్ల రహదారి మరియు తూర్పు కాన్పూర్ నుండి కృష్ణపట్నం పోర్ట్ సౌత్ గేట్ 6 లేన్ల రహదారి 36 కి.మీ రూ. 909 కోట్లు, తమ్మినపట్నం నుంచి నారికెళ్లపల్లెను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 4 లేన్లు, పోర్ట్ రోడ్డు పొడిగింపు 6 లేన్ల రహదారి 16 కి.మీ రూ. 610 కోట్లు తో నేడు శంఖుస్థాపనలు చేయడం జరిగిందని అన్నారు. కృష్ణపట్నం పోర్టుకు వేగవంతమైన కనెక్టివిటీ కోసం నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NICDC) నేషనల్ మాస్టర్ ప్లాన్ నోడ్స్. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (CBIC) మరియు నెల్లూరు వద్ద SEZ పారిశ్రామిక నోడ్‌ల వల్ల అందుబాటులోకి రానున్నదని తెలిపారు. తిరుపతి ఇంటర్ మాడల్ సెంట్రల్ బస్ టర్మినల్ కు 2022 ఆగష్టు 18 లో ఎపిఎస్ ఆర్టిసి తో ఎం.ఓ.యు జరిగిందని టెండర్ ఈ జూలై లో పూర్తి కానున్నదని అన్నారు. దీనితో మంచి డిజైన్ తో నిర్మాణం జరగనున్నదని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హై వే నిర్మాణం పై దృష్టి పెట్టామని , ఎపి లో 7 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని బెంగళూరు – చెన్నై , బెతమంగల – గుడిపాల , చిత్తూరు – తచ్చురు ప్రధానంగా వున్నాయని ప్రస్తుత ప్రముఖ పట్టణాలు బెంగళూరు – చెన్నై ప్రయాణ సమయం 6 నుండి 7 గంటలు వుందని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హై వే పూర్తి అయితే 2.30 గంటల సమయం పడుతుందని తెలిపారు. దేశంలో కాశ్మీర్ – కన్యాకుమారి వరకు సూరత్ – చెన్నై , మనాలి , శ్రీనగర్ –జమ్ము వంటి ప్రాజెక్టులు వివిధ దశల్లో వున్నాయని అన్నారు. అన్ని దక్షిణ ప్రాంత రాజధాని నగరాలను అనుసందానం చేయనున్నామని అన్నారు. బెంగళూరు – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హై వే ఎపి లో 5 జిల్లాల మీదుగా వెల్లనున్నదని తెలిపారు. అత్యధికంగా పారిశ్రామిక అభివృద్ధికి ఈ రహదారులు దోహదం కానున్నాయని అన్నారు. ఎపి లో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాల సౌకర్యం వుందని అన్నారు.
తిరుపతి పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో రూ 17 వేల కోట్ల తో జాతీయ రహదారుల అభివృద్ది చేయడం సంతోషమని , అడిగిన వెంటనే కాదనకుండా సహృదయంతో మంజూరు చేస్తారన్న కేంద్రమంత్రిగా మంచి పేరు వున్న వారని అన్నారు. గౌ. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన పనులకు నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అమృత హస్తాల మీదుగా రూ. 2900 కోట్లతో కృష్ణపట్నం పోర్ట్ అనుసందాన రహదారులకు శంఖు స్థాపన, తిరుపతి బస్ టర్మినల్ , మరికొన్ని రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా మార్పు కోరిన వాటిని సహృదయంతో స్వీకరించిన మంత్రి వర్యులకు ధన్యవాదాలని అన్నారు.
ఆర్ అండ్ బి కార్యదర్శి ప్రద్యుమ్న సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని జాతీయ రహదారులు వాటి నిర్మాణాల వివిధ దశల ఫోటో ఎగ్జిబిషన్ కేంద్ర మంత్రికి వివరించి, స్వాగతోపన్యాసం లో వివరిస్తూ రాష్ట్ర అభివృద్ది కి సహాయపడుతూ దేశంలో ఉత్తర ప్రదేశ్ తరువాత ఆంధ్రప్రదేశ్ కు అధిక నిధులు మంజూరు చేసారని రాష్ట్రం తరుపున ధన్యవాదాలని అన్నారు. మీరు మంజూరు చేసిన ప్రాజెక్టులను రాష్ట్ర మంత్రి సహకారంతో వేగవంతంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జెసి డి కె బాలాజీ, ఎం ఎల్సి బల్లి కళ్యాణ చక్రవర్తి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు,తిరుపతి ఆర్దిఒ కనకనరసా రెడ్డి , ఎన్ హెచ్ ఏఐ అడ్వైజర్ /ప్లాంటేషన్ ఏకే జైన్, ఎన్హెచ్ పిడి వెంకటేశ్వర్లు, స్మార్ట్ సిటీ ఎం.డి. చంద్రమౌళి , జిల్లా అధికారులు , మహిళలు , స్థానికులు పేద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment