మొక్క‌లు నాటిన జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి.



మొక్క‌లు నాటిన జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి



డెంకాడ‌, (విజ‌య‌న‌గ‌రం) జులై 28 (ప్రజా ఃఅమరావతి );

                  ఐఏఎస్‌ల సామాజిక‌ సేవా కార్య‌క్ర‌మంలో భాగంగా, జిల్లా క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి స్థానిక బేత‌నాప‌ల్లి వ‌ద్ద రిజ‌ర్వు ఫారెస్టు స్థ‌లంలో మొక్క‌లు నాటారు. జిల్లా అట‌వీశాఖ‌, జిల్లా నీటి యాజ‌మాన్య సంస్థ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.  వేప‌, ఎర్ర చంద‌నం, ఫిక‌స్‌, టెర్మినాలియా త‌దిత‌ర‌ ర‌కాలకు చెందిన సుమారు 1000 మొక్క‌ల‌ను నాటారు.

                  ఈ సంద‌ర్భంగా బేత‌నాప‌ల్లి గ్రామ‌స్తులు, త‌మ‌కు ఇళ్ల స్థ‌లాలు మంజూరు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అట‌వీభూమిలో ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని, ఇత‌ర ప్ర‌త్యామ్నాయ స్థ‌లాల‌ను చూస్తామ‌ని క‌లెక్ట‌ర్ హామీ ఇచ్చారు. న‌గ‌ర‌వ‌నం ప‌థ‌కంలో భాగంగా చేప‌ట్టిన ఈ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో జిల్లా అట‌వీశాఖాధికారి ఎస్‌.వెంక‌టేష్‌, డ్వామా పిడి జి.ఉమాప‌ర‌మేశ్వ‌రి, తాశిల్దార్ ఆదిల‌క్ష్మి, ఎఫ్ఆర్ఓలు బి.అప్ప‌ల‌రాజు, ఆర్‌.రాజాబాబు, వివిఎస్ఎన్ రాజు, పివి సింధు, ఉపాధిహ‌మీ ఏపిఓ వెంక‌ట‌ర‌మ‌ణ‌,  ఎఫ్ఎస్ఓలు, బీట్ అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది, వేత‌న‌దారులు పాల్గొన్నారు.


Comments