జగనన్నకు చెబుదాం కార్య క్రమం లో ప్రజలు నుండి వచ్చిన ఆర్జీలకు శాశ్వత పరిష్కారం చూపించాలి.


నెల్లూరు: జూలై 17 (ప్రజా అమరావతి);

జగనన్నకు చెబుదాం కార్య క్రమం లో ప్రజలు నుండి వచ్చిన ఆర్జీలకు శాశ్వత పరిష్కారం చూపించాల


ని జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని తిక్కన సమావేశపు హాలులో జగనన్నకు చెబుదాం కార్య క్రమం లో జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ ఆర్ .కూర్మనాథ్,DRO వెంకట నారాయణమ్మ, ZP సి ఇ ఒ   

బి. చిరంజీవి  సోమవారము ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సంభందిత అధికారులకు ఇచ్చి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై ఇచ్చే ఆర్జీలను చదివి అర్థం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అవసరమైతే అర్జీ దారుల వద్దకు వెళ్లి 

మాట్లాడి నాణ్యమైన పరిష్కారం చేయాలన్నారు. సమస్యలు సక్రమంగా పరిష్కరించకపోతే రీఓపెన్ అవుతాయని, రీ ఓపెన్ కాకుండా చూడాలన్నారు.సమస్యల పరిష్కారంలో జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల అన్నారు.

ఈకార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుస్మితా,DEO గంగాభవాని, సర్వే AD హనుమాన్ ప్రసాద్, పిడి. హౌసింగ్ నాగరాజు,DD సోషల్ వెల్ఫేర్ రమేష్,బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, సంక్షేమ అధికారులు నిర్మలాదేవి,పరిమళ రెసిడెన్షియల్ స్కూల్స్ కో ఆర్డినేటర్ హేమలత,జిల్లా రిజస్ట్రార్ బాలాంజనేయులు, ఐసీడీఎస్ 

పి డి.,SE ఇరిగేషన్, DSO,వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments