రాష్ట్ర గవర్నర్ గంగూరు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి



మచిలీపట్నం జూలై 20 (ప్రజా అమరావతి);


ఈనెల 26వ తేదీన రాష్ట్ర గవర్నర్ గంగూరు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాల


ని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సి హరికిరణ్ అధికారులను ఆదేశించారు.


రాష్ట్ర గవర్నర్ గౌరవ ఎస్ అబ్దుల్ నజీర్ పర్యటన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర వ్యవసాయ కమిషనర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శేఖర్ బాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తో కలిసి  పెనమలూరు మండలం గంగూరు గ్రామం లోని రైతు భరోసా కేంద్రాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన రాష్ట్ర గవర్నర్ గౌరవ  ఎస్ అబ్దుల్ నజీర్ పెనమలూరు మండలం గంగూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి

 అక్కడ రైతుల సంక్షేమం కోసం జరుగుతున్న వివిధ కార్యకలాపాలను పరిశీలిస్తారని, వ్యవసాయ అనుబంధ శాఖల ప్రదర్శనశాలలు తిలకిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడతారన్నారు. 


ఇందుకోసం రైతులు నమోదు చేసుకునే కియోస్కును, సామాజిక తనిఖీ ప్రదర్శన, డిజిటల్ లైబ్రరీ రికార్డులు రిజిస్టర్లు వ్యవసాయ సలహా మండలి సభ్యుల జాబితా ఈ- పంట నమోదు , బ్యాంకింగ్ కరస్పాండెంట్ కార్యకలాపాలు మార్క్ఫెడ్ సేకరణ, మందులు  మట్టి విత్తనాల పరీక్ష పరికరాలు వంటివన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.


అలాగే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ కేంద్రాల డ్రోన్ ప్రదర్శన, ఉద్యాన , పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖల ఆధ్వర్యంలో వివిధ ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలన్నారు.


రైతులతో ముఖాముఖి మాట్లాడేందుకు వీలుగా సభ వేదిక, ప్రదర్శనశాలలు ఏర్పాటుకు స్థలం పరిశీలించి ఆ స్థలాలను చదును చేసి మెరక చేయాలని సూచిస్తూ వర్షం వచ్చిన సజావుగా జరిగేలా రైన్ ప్రూఫ్ తో ఏర్పాటు చేయాలన్నారు.


జిల్లా కలెక్టర్ పి రాజాబాబు  ఎంపిక చేసిన స్థలాలను వెంటనే చదును చేసే పనులు మొదలు పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.


ఈ పర్యటనలో కమిషనర్, కలెక్టర్ వెంట ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీతా బాయి, ఏడి సునీల్, డిఎల్డిఓ లు సుబ్బారావు, నాంచారావు,   తహసిల్దారు శివయ్య, ఎంపీడీవో సునీత శర్మ, గ్రామ వ్యవసాయ సహాయకులు షేక్ జమీల అంజుమ్ తదితర అధికారులు పాల్గొన్నారు. 


Comments