గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదాం : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.

 


*గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదాం : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ


*


రేణిగుంట , తిరుపతి జూలై 12 (ప్రజా అమరావతి): భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ  సామాజిక బాధ్యత తో  పర్యావరణ సుస్థిరత పట్ల నిబద్ధతతో పర్యావరణం మరియు ఇంధన సంరక్షణ పట్ల  ప్రత్యక్ష్యంగా , పరోక్షంగా కాలుష్య నియంత్రణ  కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని మనం అందరం గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదాం అని రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల  కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. 


బుధవారం సాయంత్రం జాతీయ రహదారుల వెంబడి దేశవ్యాప్తంగా  మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల మంత్రి రేణిగుంట మండలం కొత్తపాలెం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటి ప్రారంభించి, రేణిగుంట నుండి NH-71లోని నాయుడుపేట వరకు 1000 మొక్కలు  నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


పర్యావరణానికి హితమైన బయో ఇథనాల్ ఇంధనం వాడకం లోకి తీసుకు వస్తున్నాం, దీనివల్ల కాలుష్యం తగ్గడం, పెట్రోల్ , డీజల్ ధరలు తగ్గతాయి అన్నారు. 


కేంద్ర మంత్రి మాట్లాడుతూ 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ డైనమిక్ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా  గుర్తింపు పొందుతోందని అన్నారు. ప్రధానమంత్రి ఆలోచనతో  నైపుణ్యంతో కూడిన విధానం దేశంలో జాతీయ రహదారుల ఏర్పాటు విస్తరణ జరిగిందని అన్నారు .2014 నుంచి 2023 వరకు కేవలం 9 ఏళ్ల స్వల్ప వ్యవధిలో జాతీయ రహదారుల పొడవు దాదాపు రెట్టింపు అయిందని వివరించారు. NHAI తన సామాజిక బాధ్యత కార్యక్రమాల అమలుతో మరియు పర్యావరణ సుస్థిరత పట్ల నిబద్ధతతో పర్యావరణం మరియు ఇంధన సంరక్షణ, ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్గారాలను మరియు కార్బన్ పాదముద్రలను తగ్గించడం కోసం సమర్థవంతంగా పని చేస్తున్నదని, జాతీయ రోడ్డు ప్రాజెక్టులో నరికివేయబడిన ప్రతి చెట్టుకు రెట్టింపు సంఖ్యలో చెట్లను నాటడం ద్వారా పరిహారంగా పూర్తిగా పెరిగిన మరియు పెద్ద సైజు చెట్లు విజయవంతంగా నాటడం జరుగుతున్నదని అన్నారు.

NHAI పర్యావరణ అనుకూల జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి ప్లాంటేషన్ డ్రైవ్‌లను చేపట్టిందని, 2016-17 నుండి 2021-22 వరకు నాటిన మొక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. వాహనాల నుంచి వెలువడే ప్రత్యక్ష కాలుష్యం తగ్గించేందుకు 2016-17 నుంచి 2021-22 వరకు దాదాపు 2.74 కోట్ల మొక్కలు నాటి , అన్ని చెట్లు మరియు మొక్కలు 'హరిత్ పాత్' మొబైల్ యాప్ ద్వారా జియో-ట్యాగ్ చేయడం జరుగుతున్నదని తెలిపారు. నేడు NHAI 300 కంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లలో దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తోందని మరియు ప్రతి ప్రాజెక్ట్‌లో కనీసం 1000 మొక్కలు నాటి నేటి ప్లాంటేషన్ డ్రైవ్‌లో దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా నాటనున్నామని తెలిపారు. వాతావరణ మార్పు" యొక్క సవాళ్లకు భారత ప్రభుత్వం యొక్క ఖచ్చితమైన ప్రతిస్పందనలలో రండి మనం అందరం కలిసి చేతులు కలపండి మరియు గ్రీన్ ఇండియాలో భాగమవుతాము అని పిలుపునిచ్చారు. పర్యావరణానికి బయో ఇథనాల్ ఇంధనం వాడకం లోకి తీసుకు వస్తున్నాం, దీనివల్ల కాలుష్యం తగ్గడం, పెట్రోల్ , డీజల్ ధరలు తగ్గతాయి అన్నారు.


తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ జాతీయ రహదారుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17వేల కోట్లు మంజూరు చేసి అభివృద్ధిలో భాగస్వాములైన మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుపతి పార్లమెంటు సభ్యునిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అని, తిరుపతి నగరానికి మల్టీ ఫెసిలిటీ బస్ స్టేషన్ మంజూరు అంశంపై పరిశీలించాలని కోరారు.


శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఆయుష్  ఆయుర్వేద సంబంధిత మొక్కలు  నాటితే రాబోవు తరాలకు మంచి కలుగుతుందని అన్నారు. ఇక్కడ రహదారి నిర్మాణం వేగవంతం చూస్తే అధికారులను అభినందించకుండా ఉండలేం అన్నారు. గడ్కరీ గారు మనం ఏది అడిగినా వెంటనే వంద శాతం మంజూరు చేసే గుణం వుంది అని , మన సిఎం జగనన్న కు ఆయనపై అపార అభిమానం వుందన్నారు.


ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయ్యారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు , తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఆం.ప్ర రోడ్లు భవనాలు శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి,  ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జెసి డి కె బాలాజీ, శ్రీ కాళహస్తి  ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఎన్హేచ్ఏఐ ఆర్. ఓ, విజయవాడ రాకేష్ కుమార్ సింగ్, ఎన్హేచ్ఏఐ అడ్వైసర్ ప్లాంటేషన్ ఏకే జైన్, ఎన్హెచ్  పిడి వెంకటేశ్వర్లు, సిఈ ఎన్హెచ్ రామచంద్ర, మోర్త్ ఆర్ఓ బెహ్రా, జిల్లా ఆర్ అండ్ బి అధికారి సుధాకర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 


Comments