కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి.

 


*కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి


*

సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు 

నైపుణ్య శిక్షణకు హాజరైన సైన్స్ అధికారులకు అభినందన

అమరావతి (ప్రజా అమరావతి);

పూణెలో విజ్ఞానాశ్రమ్ లో ఈ నెల 10 నుంచి 13 వరకు జరిగిన ‘నైపుణ్య శిక్షణ’కు సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో మన రాష్ట్రం నుంచి 26 జిల్లాల సైన్స్ అధికారులు హాజరయ్యారని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో సైన్స్ నవ ఆవిష్కరణలకు విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించడం, అటల్ టింకరింగ్ ల్యాబ్ లను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రభుత్వ పాఠశాలలను సైన్స్ ప్రయోగాలకు కేంద్రంగా తీర్చిదిద్దడం, వినూత్న ఆలోచనలకు ఆవిష్కరణల కేంద్రంగా ల్యాబ్ లను వినియోగించడం వంటి అంశాలపై శిక్షణ పొందారని తెలిపారు. 


పూణెలోని ప్రతిష్ఠాత్మక సైన్స్ శిక్షణా కేంద్రాలైన విజ్ఞానాశ్రమ్, ఐఐఎస్ఈఆర్, lend a hand India kharighar తదిత సంస్థలతో జిల్లా సైన్స్ అధికారులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ వర్క్ షాపును ప్రత్యేకంగా ఎస్సీఈఆర్టీ, యూనిసెఫ్, సమగ్ర శిక్షా అధికారుల పర్యవేక్షణలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం  ఎస్సీఈఆర్టీ  స్టేట్ నోడల్ ఆఫీసర్ ఆర్.భాగ్యశ్రీ, కో ఆర్డినేటర్లు, అరుణ, కల్పన, 26 జిల్లాల సైన్స్ అధికారులు పాల్గొన్నారు. పాల్గొన్న అధికారులను పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ , సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు  అభినందించారు.  శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని తెలిపారు.


*విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించాలి.*  

ఈ సదస్సులో డీఎస్ఓలు, పాల్ ల్యాబ్స్, స్టెమ్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పట్ల పూర్తి శిక్షణ పొందారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్స్ ను ఆధునీకరించీ విద్యార్థులకు ప్రయోగాత్మక పాఠ్యాంశాలను బోధించి విద్యార్థులతోనే ప్రయోగాలు నిర్వహించేలా తయారు చేయాలి. తద్వారా విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకుని, సమాజానికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు కనుక్కునేలా లక్ష్యం పెట్టుకోవాలి.
Comments