నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అధికారులు దృష్టి సారించాలి !! మచిలీపట్నం: జులై 18 (ప్రజా అమరావతి);


*నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అధికారులు దృష్టి సారించాలి  !!* 


        

    *--- జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు*


మచిలీపట్నం నియోజకవర్గ సమస్యలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 


మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌ లో మచిలీపట్నం నియోజకవర్గ సమస్యలపై కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రితో బుధవారం జరగబోయే సమావేశానికి ముందుగా సిద్ధపడే విషయాలకు సంబంధించి స్థానిక శాసనసభ్యులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 


తొలుత మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తన నియోజక వర్గంలో వివిధ ప్రజా సమస్యల పరిష్కరించాలని జిల్లా కలెక్టరును కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని అధికారులతో మాట్లాడుతూ,  జగనన్న ఇళ్లకు సంబంధించిన లేఔట్లు, కాలనీలకు సంబంధించిన వివిధ సమస్యలు, నియోజకవర్గంలో భూ సేకరణకు సంబంధించిన విషయాలు, మచిలీపట్నం పోర్టుకు సంబంధించిన భూ సేకరణ అంశాలు, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్‌ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా తక్షణ చర్యలు తీసుకో వాలని కోరారు. 


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, ఆర్డీవో ఐ. కిషోర్‌, తహశీల్ధార్‌ శ్రీవిద్య, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు


Comments