వెన్ననపూడి గ్రామంలో ప్రతి ఇంటికీ వెనిగండ్ల కూరగాయల పంపిణీ.

 *వెన్ననపూడి గ్రామంలో ప్రతి ఇంటికీ వెనిగండ్ల కూరగాయల పంపిణీ*


- *వరద బీభత్సంతో మోకాలి లోతు నీటిలోనే మగ్గుతున్న గ్రామస్తులు*

- *గ్రామంలో ఇంటింటికి మంచినీటినీ సరఫరా చేస్తున్న వెనిగండ్ల*

 *- గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు*

 *- వెన్ననపూడి గ్రామస్తులకు అన్ని విధాలా అండగా ఉంటా*

 *- తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము*గుడివాడ, జులై 29 (ప్రజా అమరావతి): ఇళ్ల చుట్టూ మోకాలి లోతు వరద నీటిలో మగ్గుతున్న నందివాడ మండలం వెన్ననపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము సమకూర్చిన నిత్యవసర సరుకులను ఆయన సోదరుడు వెనిగండ్ల రామకృష్ణ  శనివారం పంపిణీ చేశారు. మోకాలి లోతు నీటిలో ఇంటింటికి వెళ్లి వివిధ రకాల కూరగాయలతో ఉన్న ఐదు కేజీల బ్యాగులను గ్రామస్తులందరికీ అందజేయడం జరిగింది. అకాల వర్షాలకు వెన్ననపూడి, శివారు కాలనీలు నీట మునిగాయి. తమను ఆదుకోవాలంటూ గ్రామస్తులు శుక్రవారం వెనిగండ్ల రామును కోరడంతో వెంటనే ఆయన గ్రామంలో పర్యటించారు. మోకాలి లోతుకుపైగా ఉన్న నీటిలోనే వెనిగండ్ల ఇంటింటికి వెళ్లి  గ్రామస్తులందరినీ కలుసుకున్నారు. అదే నీటిలో వెనిగండ్ల మూడు గంటల పాటు నిలబడి ఉండి గ్రామస్తులతో కష్ట సుఖాలను పంచుకున్నారు.

వెన్నెనపూడి, శివారు కాలనీ దుస్థితిని మండల తహసీల్దార్ దృష్టికి కూడా తీసుకువచ్చారు.

మండల తాసిల్దార్ కూడా గ్రామానికి రావడంతో ఆయనతో కలిసి వెనిగండ్ల గ్రామంలో మునిగిపోయిన రోడ్లు, ఇళ్ల చుట్టూ చేరిన వరద నీరు, ఇళ్లలోని పశువులు, కోళ్ల పరిస్థితిని  పరిశీలించారు. గ్రామంలో ప్రతి ఇంటికి బ్రెడ్, పాలు, బియ్యం ఇస్తామని మండల తహసీల్దార్ చెప్పారు. నూనె, పప్పు కూడా ఇచ్చేందుకు వెనిగండ్ల మండల తాసిల్దార్ తో మాట్లాడి ఆయనను ఒప్పించారు. ఆ సందర్భంగానే ప్రతి ఇంటికి కూరగాయలు, మంచినీటిని సరఫరా చేస్తానని వెనిగండ్ల చెప్పారు. అన్నట్టుగానే గ్రామంలోని ప్రతి ఇంటికి వెనిగండ్ల రాము సోదరుడు రామకృష్ణ వెళ్లి  కూరగాయలను పంపిణీ చేశారు. అలాగే ప్రతి ఇంటికి 20 లీటర్ల చొప్పున మంచినీటిని కూడా వెనిగండ్ల సరఫరా చేస్తున్నారు. ముంపు భయంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న వెన్ననపూడి గ్రామస్తులకు వెనిగండ్ల భరోసా నింపుతూ వస్తున్నారు. గ్రామస్తులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటానని వెనిగండ్ల చెప్పారు. కష్టకాలంలో తమ వెన్ననపూడి గ్రామాన్ని వెనిగండ్ల ఆదుకున్నారంటూ ఆయనకు గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments