ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.నెల్లూరు, జూలై 24 (ప్రజా అమరావతి): 

 స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2023 వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామాల ను కేంద్ర బృందాలు సందర్శించి, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మరుగుదొడ్లు, తడి చెత్త, పొడి చెత్త, మురుగు నీటి నిర్వహణ మొదలైన అంశాలను పరిశీలించి పాయింట్లు కేటాయిస్తారన్నారు. ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించి పరిశుభ్రంగా ఉండేలా చూడాల


ని అధికారులకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం గ్రామాల్లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, చెత్త సేకరణ అంశాల పట్ల ప్రత్యేక దృష్టి సారించి, అన్ని గ్రామాలు కూడా కేంద్ర బృందాల సర్వేలో మంచి పాయింట్లు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ తిరుమలేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీ వికాస్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, డిపిఓ శ్రీమతి సుస్మిత పాల్గొన్నారు.


Comments