ఆగస్ట్ 25 శుక్రవారం రోజున ఉద్యోగుల ఫిర్యాదుల స్వీకార దినోత్సవం .రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): ఆగస్ట్  25 శుక్రవారం రోజున ఉద్యోగుల ఫిర్యాదుల స్వీకార దినోత్సవం 

** జిల్లా కలెక్టరేట్ స్పందన హల్ లో ఉ.11.00 నుంచి అర్జీల స్వీకరణ 


- జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ 


జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమం   నాలగవ శుక్రవారం ఆగస్ట్  25 శుక్రవారం నిర్వహిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో జిల్లా  జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.


ప్రతి నెల మూడో శుక్రవారం నిర్వహించాల్సి ఉండగా ఆగస్ట్ నెలలో 18 వ తేదీకి బదులు 25 వ తేదీన నిర్వహిస్తున్నమన్నారు. 


కావున ఉద్యోగులు ఈ మార్పును గమనించి ఆగస్ట్ 25 ఉద్యోగుల గ్రేవియాన్స్ డే రోజున ప్రభుత్వ ఉద్యోగులు వారికి చెందిన అర్జీలను స్వీకరించేందుకు కలెక్టరేట్ లోని స్పందన హల్ నందు ఉదయం11.00  గంటల నుంచి అందుబాటులో ఉండడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఉద్యోగులు వారికి చెందిన వ్యక్తిగత, తదితర అర్జీలను వ్రాత పూర్వకంగా అందచేయాలని కలెక్టర్ తెలియ చేశారు. జిల్లాకు చెందిన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత జిల్లా అధికారులు ఈ విషయం పై ఉద్యోగులకు  అవగాహన కలుగ చేయాల్సిందిగా ఆదేశించారు.

Comments