రాయలసీమలో ప్రతి అంగుళం భూమికి నీళ్లిచ్చే బాధ్యత నాది.

 *రాయలసీమలో ప్రతి అంగుళం భూమికి నీళ్లిచ్చే బాధ్యత నాది**-టీడీపీ అధినేత చంద్రబాబు*

నంద్యాల జిల్లా బనకచర్ల ప్రాజెక్టును సందర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు : 

*ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ...*


*గోదావరిని బనకచర్లకు తీసుకెళ్లడమే నా లక్ష్యం*

అమరావతి (ప్రజా అమరావతి);

సముద్రంలోకి కలిసే గోదావరి నీళ్లపై పూర్తి హక్కు మనదేనని.. ఆ నీటిని సద్వినియోగం చేసుకుని, గోదావరి నీటిని బనకచర్లకు తీసుకెళ్లి  రాయలసీమను సస్యశ్యామలం చేయటం తన జీవిత లక్ష్యమని చంద్రబాబు అన్నారు.  నవ్యాంధ్రకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు చాలా సున్నితమైందని, దీని విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి జగన్ రెడ్డి ప్రభుత్వం పోలవరాన్ని అగమ్యగోచరం చేసిందని.. తమ కృషిని నిర్వీర్యం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులపై కూలంకుశంగా వివరిస్తూ...


*నదుల అనుసంధానం చేస్తే ఏపీకి కరువు రాదు*


 69 నదులను అనుసంధానం చేస్తే ఏపీకి కరువు రాదు. రాయలసీమ పేరు ఎత్తడానికి కూడా జగన్‌కు అర్హత లేదు.  టీడీపీ హయాంలో 12,441 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ ఖర్చు పెట్టింది 2,011 కోట్లు మాత్రమే.  జగన్ రాయలసీమ ద్రోహి. రాయలసీమకు నీళ్లు తెచ్చిన ఘనత టీడీపీదే. ఎస్ఆర్‌బీసీని మొదట ఎన్టీఆర్ ప్రారంభించారు. రాయలసీమకు నీరు ఇచ్చాకే తెలుగుగంగకు నీళ్లు ఇస్తామని ఎన్టీఆర్ చెప్పారు. నేను సీఎంగా ఉన్నప్పుడు ముచ్చుమర్రిలో 16 మిషన్లు పెట్టాం. కేసీ కెనాల్, తెలుగుగంగ, నగరి-గాలేరు ప్రాజెక్టులను మా పార్టీయే ప్రారంభించింది. గతంలో పలు ప్రాజెక్టుల వద్ద రాత్రి బస చేశా. అవుకు, మదనపల్లె కెనాల్, తోటపల్లి రిజర్వాయర్ వద్ద నిద్రించాను. పనులు వేగవంతం అవుతాయనే ఉద్ధేశంతోనే రాత్రి బస చేశాను.  పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఇచ్చిన ఘనత మాదే.


*అన్నింటికి అడ్డంకులు సృష్టించిన వైసీపీ ప్రభుత్వం*


గోదావరి నుంచి నీరు తెచ్చి వైకుంఠపురంలో నిల్వ చేద్దామనుకున్నాం.  నల్లమల అడవిలో 32 కి.మీ. టన్నెల్‌తో బనకచర్లకు నీళ్లు వస్తాయి. మేం అనుకున్నట్లు జరిగితే రాయలసీమకు 280 టీఎంసీలు నీరు వచ్చే అవకాశం వుంది. తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టు పెంచేందుకు చర్యలు తీసుకోలేదు. తెలుగుగంగ ప్రాజెక్టులో లైనింగ్ పనులేమీ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ఖర్చు పెట్టాం. ఎస్ఆర్‌బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను తీవ్రంగా  నిర్లక్ష్యం చేసింది. గతంలో గోరుకల్లు రిజర్వాయర్‌కు మరమ్మతులు చేసి నీరు నిల్వ చేసిన ఘనత మాకే దక్కుతుంది. వెలిగోడు ప్రాజెక్టుకు నాలుగేళ్లుగా కాల్వలు కూడా తవ్వలేదు. సిద్ధాపురం ప్రాజెక్టును 2018లో నేనే ప్రారంభించాం. సిద్ధాపురం ప్రాజెక్టుకు ఈ నాలుగేళ్లలో కాల్వలు కూడా తవ్వలేదు. వేదవతి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం నిలిపేశారు.  మడ్డువలసను పట్టుబట్టి పూర్తి చేయడంతో  ఆ ప్రాంతం సస్యశ్యామలమైంది. గుండ్రేవుల ప్రాజెక్టును నాలుగేళ్లుగా పట్టించుకోలేదు.  టీడీపీకి పేరు వస్తుందని గురురాఘవేంద్ర కుడి కాలువను పక్కనపెట్టారు. పులకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టులో పూడిక కూడా తీయలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆర్‌డీఎస్ కుడి కాలువ పనులు నిలిపేశారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వవచ్చు. గోదావరి నీటిని బనకచర్లకు తేవడమే నా జీవిత లక్ష్యం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 198 ప్రాజెక్టులను పక్కన పెట్టింది. మా హయాంలో గుత్తేదారులతో మాట్లాడి పనులు కొనసాగించాము. రివర్స్ టెండర్ల పేరుతో రాయలసీమ ప్రాజెక్టులను నాశనం చేసింది జగనే. గోదావరి నీటిని రెండు రాష్ట్రాలూ వాడుకునే అవకాశం మెండుగా వుంది. రెండు రాష్ట్రాలు వాడుకున్న తర్వాత కూడా గోదావరి నీళ్లు మిగుల్తాయి. ప్రాజెక్టులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టాము.


*రోజుకో జిల్లాలో పర్యటించి అక్కడి ప్రాజెక్టుల గురించి వివరిస్తాను*


 రోజుకో జిల్లాలో పర్యటించి అక్కడి ప్రాజెక్టుల గురించి వివరిస్తాను. పోలవరాన్ని చూస్తే చాలా బాధేస్తుంది. ముంపు మండలాలను కలిపితేనే ప్రమాణం చేస్తానని చెప్పాను. ఆ ఏడు మండలాలు రాకపోయి ఉంటే ప్రాజెక్టు ముందుకు వెళ్లేదే కాదు. పోలవరం ప్రాజెక్టుపై సీఎంగా 80 సార్లు సమీక్ష జరిపాను. పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పనులు పూర్తి చేశాం. వైసీపీ సర్కారు నిర్లక్ష్యం వల్ల డయాఫ్రమ్‌వాల్ పాడైంది. పోలవరం ప్రాజెక్టు చాలా సున్నితమైన ప్రాజెక్టు. కీలక ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం వహించారు.

Comments