ప్రపంచస్థాయిలో విద్యాబోధనే లక్ష్యంగా అడుగులు.


అమరావతి (ప్రజా అమరావతి);


*విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


- ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ విద్యలో ఐబీ సిలబస్‌పై సమావేశంలో చర్చ.

- ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులకు

ఆదేశాలు.

– ప్రపంచస్థాయిలో విద్యాబోధనే లక్ష్యంగా అడుగులు. 


– దీనికి ముందుగా విస్తృతంగా అధ్యయనం, కసరత్తు చేయాలన్న సీఎం.

– విద్యార్థుల ప్రయోజనాలు నెరవేర్చేలా, మన విద్యావ్యవస్థ అవసరాలను, విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యయనం చేయాలన్న సీఎం. 

– దీనికోసం ఉపాధ్యాయుల సమర్థతను పెంచడం, సజావుగా వారు బోధనచేసేలా ఏంచేయాలి? అన్నదానిపై ఆలోచనలు చేయాలన్న సీఎం.

ఉన్నత విద్య టీచింగ్, లెర్నింగ్‌లో ఏఐ వినియోగం:


*సీఎం ఆదేశాల మేరకు ఉన్నత విద్యలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వినియోగంపై కార్యాచరణను సీఎంకు వివరించిన అధికారులు.*


– ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు కోర్సు చివరభాగంలో ఏఐలో ప్రాథమిక అంశాలపై బోధించేలా ఏర్పట్లు చేస్తున్నామన్న అధికారులు.

– ఏఐపై పరిశోధనకోసం యూనివర్శిటీల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్టుగా వెల్లడి. 

– బోధన, పరిశోధన, అసస్మెంట్‌ల్లో ఏఐ టూల్స్‌ వినియోగంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐని ఒక కోర్సుగా ప్రమోట్‌ చేస్తామని పేర్కొన్న అధికారులు.


– దీనికోసం తీసుకుంటున్న చర్యలనూ వెల్లడించిన అధికారులు. ఏఐ ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించేలా సమగ్రమైన ఫౌండేషన్‌ కోర్సును  అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడి.

– బైలింగువల్, డిజిటల్‌ కంటెంట్‌ రూపంలో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరణ.

– ప్రపంచస్థాయి సంస్థలతో మమేకం అయ్యి ఏఆర్, వీఆర్‌ కంటెంట్‌ను, డిజిటల్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయడంతోపాటు, పరిశోధనలో బోధనా పద్ధతులను, క్లాస్‌ రూం మేనేజ్‌మెంట్, వ్యక్తిగతంగా నేర్చుకునే విధానాలకోసం ఏఐని వినియోగించుకునే దిశగా అడుగులువేస్తున్నామని వెల్లడి. 

– ఏఐ మరియు దాని అప్లికేషన్ల వినియోగంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామన్న అధికారులు.

– యూనివర్శిటీలో మూడు రకాల జోన్లను అభివృద్ధిచేస్తామని వెల్లడించిన అధికారులు. 

కంప్యూటర్‌ విజన్‌ జోన్, ఇమేజ్‌ ప్రాససింగ్‌ జోన్‌ మెటావర్స్‌ లెర్నింగ్‌ జోన్‌లను యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. 


– ఉన్నత విద్యలో మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సుల్లో (ఎంఓఓసీ) విద్యార్ధులకు శిక్షణపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు.

– ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా విభాగంలో మొత్తం 1,17,012 మంది మూక్‌ కోర్సుల్లో అభ్యసించారని వెల్లడి.

– 1.5 లక్షల కోర్సులను విద్యార్థులు నేర్చుకున్నారని, తద్వారా 5.09 లక్షల క్రెడిట్స్‌ సాధించారని వెల్లడి.


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..:*

– ఏఐలో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్‌ అకడమిక్‌ కమ్యూనిటీలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

– పైలట్‌ పద్ధతిలో వివిధ సంస్థల కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం.

 ఆ తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం. 


– ఏఐలో క్రియేటర్లుగా మారడం ఎలా అన్నది మరొక ప్రధాన అంశమన్న సీఎం. 

– అందుబాటులో ఉన్న ఏఐని వాడుకుని దాన్ని బోధనలో, సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో వినియోగించుకోవాలన్న సీఎం.

– ఉన్న సబ్జెక్టులను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి కూడా ఏఐని వినియోగించుకోవాలన్న సీఎం. 

– కొత్త తరహా సబ్జెక్టులను నేర్చుకునేందుకూ ఏఐని వినియోగించుకోవాలన్న సీఎం.

– అధ్యాపకుల కొరత, కంటెంట్ల కొరతను నివారించడానికి ఏఐ వినియోగపడుతుందన్న సీఎం. దీనిపైన కూడా ప్రధానంగా దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశం. 


– పాఠశాల విద్యలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలన్న సీఎం. 

– దీనిపై పరిశీలన, అధ్యయనం చేయాలన్న సీఎం. 

– విద్యార్థుల ప్రయోజనాలు నెరవేర్చేలా, మన విద్యావ్యవస్థ అవసరాలను, విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యయనం చేయాలన్న సీఎం. 

–  ఏపీలో ఒక విద్యార్థి పదోతరగతి సర్టిఫికెట్‌ తీసుకున్నా, ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్‌ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా.. విలువైనదిగా ఉండాలన్నదే లక్ష్యమన్న సీఎం. 

– శాస్త్రసాంకేతిక, ఆర్థిక, వ్యాపారం మరియు ఇతర రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా ఉండాలన్న ముఖ్యమంత్రి. 

– గతంలో నాకన్నా ముందు ఒక ప్రభుత్వం ఉండేది కాని, ప్రభుత్వ స్కూళ్లను, విద్యార్థులను గాలికొదిలేసిందన్న సీఎం. 

– మనం వచ్చాక అనేక మార్పులు తీసుకొచ్చి, ప్రపంచంలో అన్ని అవకాశాలు పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం:

– సాధారణ ఆలోచనలతో కాకుండా మెరుగైన ఆలోచనలతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే ప్రక్రియ కొనసాగాలన్న సీఎం.

– నాయకులుగా ఉండే వ్యక్తులు మార్పులను స్వాగతిస్తూ, పేద విద్యార్థులకు మంచి జీవితాన్ని అందించాలన్న సీఎం.

– సులభంగా నేర్చుకునే విధనాన్ని, విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా, వారిలో సృజనాత్మకత పెంచేందుకు నిరంతరం కృషిచేస్తున్నామన్న సీఎం. 


విద్యావిధానం జాబ్‌ఓరియెంటెడ్‌గా ఉండాలన్న సీఎం.

విద్యార్ధులు తాము నేర్చుకున్న థియరీ జీవితంలో ఏ మేరకు ప్రాక్టికల్‌గా ఉపయోగపడుతుందో ప్రశ్నించేదిగా ప్రశ్నాపత్రాలు ఉండాలన్న సీఎం. 

విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులకూ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్గించాలన్న సీఎం.

Comments