విజయవాడ నగర ప్రజలను ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన.


 విజయవాడ (ప్రజా అమరావతి);


 *విజయవాడ నగర ప్రజలను ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన** శకటాల ప్రదర్శనను ఫోన్లో చిత్రీకరించి ఆనందించిన నగర ప్రజలు*


* శకటాలను ఆసక్తిగా తిలకించిన ప్రజలు*


  

 రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ప్రదర్శితమైన శకటాలను విజయవాడ

నగర ప్రజలు వీక్షించేలా రూట్ మ్యాప్ నిర్ణయించి శకటాల ప్రదర్శన వాహనాలను సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన సందర్శకుల్ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శితమైన 13 శకటాలను విజయవాడ నగర వీధుల్లోకి వెళ్లగానే ప్రజలు ఆసక్తిగా తిలకించారు. రాష్ట్ర ప్రగతికి అద్దం పట్టిన శకటాలను పలువురు తమ ఫోన్ లలో చిత్రీకరించారు. చాలామంది పౌరులు శకటాల వద్దకు వచ్చి ఆసక్తిగా ఫోటోలు దిగారు. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమైన శకటాల ప్రదర్శన బెంజ్ సర్కిల్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, రామవరప్పాడు రింగ్ రోడ్, గుణదల, ఏలూరు రోడ్డు మీదుగా తిరిగి ఇందిరాగాంధీ స్టేడియం వరకు కొనసాగింది.    Comments