సీమలో రైతులు కష్టపడే తత్వం కలవారు.

 పులివెందుల (ప్రజా అమరావతి);


*సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పులివెందులలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు రోడ్ షో, మీటింగ్*


*పులివెందుల పూల అంగళ్ల సెంటర్ లో సిఎం జగన్ పై, ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబునాయుడు*




నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా సార్లు పులివెందుల వచ్చాను. అయితే ఈ రోజు ప్రజల స్పందన చూస్తే ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు కనిపిస్తోంది.

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం యద్ధభేరీ కి నేడు పులివెందులకు వచ్చాను. నా పర్యటనలో పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చారు.

పులివెందుల మీటింగ్ తీరును తాడేపల్లిలో ఉంటున్న జగన్ చూడాల్సిన అవసరం ఉంది. పులివెందుల ప్రజలు ఏమనుకుంటున్నారో అప్పుడైన జగన్ కు తెలిస్తుంది.

అయినా పోయిరావలె హస్తినకు అన్నట్లు....జగన్ లో మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి.

వచ్చే ఎన్నికల్లో ఎందుకు పులివెందుల గెలవాలో ఈ మీటింగ్ ద్వారా మీకు వివరిస్తాను.

రాయలు ఏలిన సీమ...రత్నాలసీమ...తరువాత రాళ్ల సీమగా మారిపోయింది. అయితే అన్న ఎన్టీఆర్ రాకతో రాయల సీమలో పరిస్థితి మారింది.

ఎన్టీఆర్ సీమ ఆశా జ్యోతి.....సీమకు ఎన్టీఆర్ తెలుగు గంగ ద్వారా నీరు ఇచ్చారు.

రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తరువాతనే చెన్నైకి నీళ్లు వెళ్లాలి అని సంకల్పం చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్

గాలేరు నగరి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులు తలపెట్టింది కూడా అన్న ఎన్టీఆర్

నేను అధికారంలోకి వచ్చిన తరువాత ముచ్చుమర్రి లిఫ్ట్ పనులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చాను.

పులివెందులలో 2015లో చీని పంటలకు నేను నీళ్లు ఇచ్చాను. నేడు ఆ రైతులు నా మెడలో చీనిపంటతో నాకు దండ వేశారు.

నాడు ఇక్కడ నాయకులు అడిగితే రెండు టిఎంసిల నీరు ఇచ్చి పులివెందుల పంటలు కాపాడాను.

అవుకు టన్నెల్ ద్వారా నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి నీరు ఇచ్చాను.

గండికోట నిర్వాసితులకు రూ.660 కోట్లు ఇచ్చి ప్రాజెక్టులో నీటిని నింపాను.

ఒక్కో కుటుంబానికి రూ. 6.75 లక్షలు ఆనాడే ఇచ్చాను. పనులు పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీరు ఇచ్చాను.

రాయల సీమకు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలు ఆలోచించాలి. నాడు పట్టిసీమ తెస్తే నన్ను ఈ జగన్ ఎగతాళి చేశాడు. కృష్ణా డెల్టాకు పట్టిసీమ  నుంచి నీళ్లు ఇచ్చి...పైనా శ్రీశైలం నీటిని రాయల సీమకు ఇచ్చాను.

సీమలో రైతులు కష్టపడే తత్వం కలవారు.


కొంచెం నీళ్లు ఇస్తే బంగారం పండిస్తారు.

రైతులకు నీరు ఇస్తే ఇక్కడి రైతులు సిరులు పండిస్తారు.

శ్రీకృష్ణదేవరాయలు ఏలిన సీమ.....రాయల సీమ. అందుకే గండికోట వద్ద శ్రీకృష్ణ దేవారాయల విగ్రహం పెడతాను.

గోదావరి నీరు బనకచర్లకు తెచ్చి సీమను సస్యశ్యామలం చేయడం నా జీవిత లక్ష్యం. బనక చర్ల నుంచి తెలుగు గంగకు, గాలేరు-నగరి, హంద్రీ నీవాకు నీరు వెళుతోంది. 

టీడీపీ హయాంలో రూ.68 వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ ఖర్చు పెట్టింది రూ. 22 వేల కోట్లు

సీమకు నేను రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే....జగన్ కేవలం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేశాడు.

జగన్ నాకు వయసు అయిపోయింది అంటున్నాడు.....నా విషయంలో వయసు అనేది కేవలం ఒక నంబరే. సింహం ఎప్పటికీ సింహమే.

ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో నా పాత్ర ఉంది అనే తృప్తి నాకు ఉంది. ఈ రోజు పులివెందులకు హైవే వస్తుంది అంటే నాడు ఉమ్మడి రాష్ట్ర సిఎంగా నేను కేంద్రానికి ఇచ్చిన ప్రతిపాదనలే కారణం. 

నాడు నేషనల్ హైవేలపై మా కమిటీ ఇచ్చిన నివేదికతో దేశంలో హైవేలు వచ్చాయి.

హైదరాబాద్ ను నేను అభివృద్ది చేస్తే తరువాత సిఎంలు దాన్ని కొనసాగించారు.

అదే ఆలోచనతో అమరావతిని తలపెట్టాను. అయితే ఈ సైకో సిఎం దాన్ని నాశనం చేశాడు.

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వారిని ఏమనాలి?

రాష్ట్రానికి రాజధాని అమరావతి అని పులివెందుల ప్రజల నినాదాలు. చంద్రబాబు రాజధానిపై అడిగిన ప్రశ్నకు తమ స్పందన తెలిపిన ప్రజలు

పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి. రివర్స్ టెండరింగ్ అని దాన్ని నాశనం చేశాడు.

జాతీయ ప్రాజెక్టును ఈ దుర్మార్గపు సిఎం నాశనం చేశాడు. గోదావరి నీటిని బనకచర్లకు తీసుకువచ్చి ఉంటే రాయలసీమ రతనాలసీమ అవుతుంది.

రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రి పేరు ఆంబోతు రాంబాబు. నేను ఇరిగేషన్ గురించి  ప్రశ్నిస్తుంటూ ..ఇరిగేషన్ మంత్రి పవన్ కళ్యాన్ బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నాడు.

రాష్ట్రంలో వ్యవసాయాన్ని దారుణంగా దెబ్బతీశారు. వ్యవసాయ సబ్సిడీలు అన్నీ ఆపేశారు. ఇక్కడ రైతులు కోరినట్లు వ్యవసాయ బీమాలో పాత పద్దతినే తీసుకువస్తా.

మైక్రొ ఇరిగేషన్ లో రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తాను. 

ఈ జగన్ అన్నా క్యాంటీన్ రద్దు చేసి పెద్ద తప్పు చేశాడు. అధికారంలోకి వచ్చిన తరువాత మండలానికి ఒక అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు భోజనం పెడతా.

మనం అన్నం పెట్టే వాళ్లం...వీళ్లు సున్నం పెట్టేవాళ్లు.

కడప ఎయిర్ పోర్టు మనం తెస్తే.. దానిలో ఇప్పుడు సిఎం దిగుతున్నాడు.

ముస్లింల కోసం హజ్ హౌస్ కట్టాను. ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ది చేశాను.

జగన్ రెడ్డి పెద్దిరెడ్డికి 5 వేల కోట్లు దోచిపెట్టడానికి కొత్త ప్రణాళిక ను సిద్దం చేశాడు. దాని కోసం అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేశాడు.

మందుబాబుల బలహీనత జగన్ కు అర్థం అయ్యింది. అందుకే రేట్లు పెంచాడు.. నాసిరకం మద్యం అమ్ముతున్నాడు.

తోపుడు బండి వద్ద కూడా ఫోన్ పే ఉంది...మరి మద్యం షాపులో ఎందుకు ఫోన్ పే లేదు.

మరి మద్యం షాపుల్లో డబ్బు అంతా ఎటుపోతుంది.

పులివెందులలో 8 వేల ఇళ్లతో కాలనీ అన్నాడు.....ఎన్ని ఇళ్లు కట్టాడో జగన్ చెప్పాలి.

బస్ స్టాండ్ కట్టలేని వాడు మూడు రాజధానులు కడతాడా అని నేను ప్రశ్నిస్తే...పులివెందుల లో బస్ స్టాండ్ కట్టాడు.

రూ650 కోట్లతో పులివెందలు సుందరీకరణ అన్నాడు..అంత డబ్బు అవసరమా...ఆ డబ్బు రైతుల కోసం, మైక్రో ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టవచ్చు కదా.

జగన్ పులివెందులకు పెద్ద సంస్థ తెచ్చాడు....అదే ఫిష్ మార్ట్. ఇదే జగన్ తెచ్చిన కంపెనీ.

విశాఖలో షాపింగ్ మాల్ కడితే ఉత్తరాంధ్ర అభివృద్ది అని చెపుతున్నాడు. షాపింగ్ మాల్ తో అభివృద్ది జరిగిపోతుందా.

మెడికల్ కాలేజ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే కనీస సాయం చేయని సిఎంను ఏమనాలి?

కడపకు ఉక్కు పరిశ్రమ వచ్చిందా....ఒక్క ఉద్యోగం వచ్చిందా? మళ్లీ జాబు రావాలి అంటే బాబు రావాలి. మనం వచ్చాక కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇద్దాం.

ఉద్యోగం వచ్చే వరకు యువతకు యువగళం కింద రూ.3 వేలు సాయం చేస్తా.

అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీలు తగ్గిస్తాను. ఇప్పటికి 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచాడు....మళ్లీ ఇంకో సారిపెంచడానికి సిద్దం అయ్యాడు.

రాబోయే 5 ఏళ్లలో కరెంట్ చార్జీలు పెంచను. ప్రజలే ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకువస్తాను.

నేను రాజశేఖర్ రెడ్డి 1978లో ఎమ్మెల్యేలు అయ్యాం. రాజశేఖర్ రెడ్డి ఒక్క మాట చెపితే వివేకా మారు మాట్లాడకుండా అమలు చేసేశాడు.

వివేకా హత్య కేసులో రోజుకో డ్రామా ఆడారు. ముందు సిబిఐ దర్యాప్తు కావాలి అన్నారు...తరువాత వద్దు అన్నారు.

వివేకా కూతురు సునీత పులివెందుల పులి. తండ్రి హత్యపై ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతుంది. ఆమెకు మద్దతుగా అండగా ఉండాలి.

జగన్ వివేకా హత్యపై కమల్ హాసన్ ను మించి నటిస్తున్నాడు.

ఆస్తిలో ఆడబిడ్డకు సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్. జగన్ తన చెల్లికి మాత్రం ఆస్తిలో వాటా ఇవ్వలేదు.

ఎన్నికల సమయంలో షర్మిలను ప్రచారానికి వాడుకుని తరువాత దూరం పెట్టాడు. 

జగన్ విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో కొడికత్తి డ్రామా ఆడాడు. తనపై హత్యాయత్నం అని డ్రామా తో రాజకీయ లబ్ది పొందాడు.

కోడికత్తి డ్రామా ఆడేవాడు మనకు ఎమ్మెల్యేగా....సిఎంగా అవసరమా...ఇక్కడి ప్రజలు ఆలోచించాలి.

మనం సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం. తల్లికివందనం కింద రూ.15 వేలు, ఆడబిడ్డ పధకం కింద మహిళలకు రూ.1500, యువగళం కింద రూ.3 వేలు, మూడు ఉచిత సిలిండర్లు ఇస్తా.

రైతుకు అన్నదాత పథకం కింద ఏడాదికి రూ. 20 వేలు ఇస్తాను. బిసిలకు రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం చేస్తాం.

సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ.....మళ్లీ సంపద సృష్టిస్తా...పేదలకు ఆ సంపదను పంచుతా.

అందుకే ప్రజలను కోరుతున్నా....వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీని గెలిపించండి.

ఇక్కడ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. టీడీపీకి ఆదరణ పెరుగుతుంది. వచ్చేఅసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలి. 

టీడీపీ నేత బిటెక్ రవి బుల్లెట్ లా దూసుకుపోతున్నాడు. పులివెందులలో టీడీపీ గెలుపు నా చిరకాల వాంఛ.

Comments