కౌలు రైతులకు “వైఎస్సార్ రైతు భరోసా.

 

అమరావతి (ప్రజా అమరావతి);


*దేశంలో ఎక్కడా లేనివిధంగా కౌలు రైతులు, అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ శాఖ భూములను సాగు చేసుకునే రైతులకు కూడా 'రైతు భరోసా సాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే..*


*వరుసగా ఐదో ఏడాది.. మొదటి విడతగా..*


*కౌలు రైతులకు “వైఎస్సార్ రైతు భరోసా


'*


*రాష్ట్రవ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు (సీసీఆర్సీలు) పొందినవారిలో అర్హులైన 1,46,324 మందిఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా సాయంగా రూ. 109.74 కోట్లు... ....పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ. 11.01 కోట్లతో కలిపి మొత్తం రూ. 120.75 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే (01.09.2023) బటన్ నొక్కినేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..*


ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తామన్న మాట మరోసారి నిలబెట్టుకుంటూ..


నేడు జమ చేస్తున్న లబ్ధితో కలిపి వైఎస్సార్ రైతు భరోసా-PM KISAN ద్వారా సొంత భూమి సాగు చేసుకుంటున్న అర్హులైన రైతన్నలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, RoFR (అటవీ), దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న మొత్తం 52,57,263 మంది రైతన్నలకు కేవలం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 3,943 కోట్లను అందించిన జగనన్న ప్రభుత్వం.. ఈ 50 నెలల్లో వైఎస్సార్ రైతు భరోసా -PM KISAN ద్వారా అందించిన సాయం రూ. 31,005 కోట్లు..


2023 మే - ఆగష్టు వరకు సంభవించిన అకాల వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 11,373 మంది రైతన్నలకు రూ. 11,01,54,077 ఇన్పుట్ సబ్సిడీ సాయం కూడా నేడు వారి ఖాతాల్లో జమ.. ఇటీవల గోదావరి వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం కింద ఇప్పటికే రూ. 38 కోట్లు అందించిన జగనన్న ప్రభుత్వం...


రైతన్నలకు ఏటా 3 విడతల్లో రూ. 13,500..

ఖరీఫ్ పంట వేసే సమయంలో రూ.7,500. ఖరీఫ్ పంట కోత సమయంలో మరియు రబీ అవసరాల కోసం రూ. 4,000, పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి/ఫిబ్రవరి నెలలో రూ.2,000..


చెప్పిన దాని కన్నా ముందుగా.. మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు సాయం.. మ్యానిఫెస్టోలో చెప్పింది - ఏటా రూ. 12,500 × 4సం॥ - రూ.50,000 జగనన్న ప్రభుత్వం ఇస్తున్నది - ఏటా రూ. 13,500 × 5సం|| = రూ.67,500

మ్యానిఫెస్టోలో చెప్పినదానికన్నా రైతన్నకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ.17,500


నేడు జమ చేస్తున్న రూ. 11.01 కోట్ల తో కలిపి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు ఏ సీజన్ లో నష్టపోతే అదే సీజన్లో పరిహారం అందిస్తూ 22.85 లక్షల మంది రైతన్నలకు ఇచ్చిన మొత్తం ఇన్పుట్ సబ్సిడీ రూ. 1,977 కోట్లు..


మన జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు 5.28 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు మరియు దేవాదాయ రైతులకు, 3.99 లక్షల RoFR రైతులకు వైఎస్సార్ రైతు భరోసా ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 1,122 కోట్లు..


ఇది కేవలం రైతన్నల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో చేసిన వ్యయం..


వైఎస్సార్ రైతు భరోసా - PM KISAN లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో 52.57, అందించిన మొత్తం రూ. కోట్లలో 31,005

గత ప్రభుత్వంలో లేదు.. రైతన్నకు సకాలంలో సాయం అందించాలన్న ఆలోచనే లేదు.. రూ. 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని 2014లో మాటిచ్చి దిగిపోయే నాటికి రూ.15 వేల కోట్లు మాత్రమే విదిలించిన వైనం...

డా|| వైఎస్సార్ ఉచిత వంటల బీమా లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో 54.48, అందించిన మొత్తం రూ. కోట్లలో 7,802

గత ప్రభుత్వంలో బీమా క్లెయిమ్లు ఎప్పుడొస్తాయో, ఎంతొస్తాయో తెలియని పరిస్థితి..!! ప్రీమియం సైతం రైతులే చెల్లించాల్సిన దుస్థితి..

రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో 22.85, అందించిన మొత్తం రూ. కోట్లలో 1,977

గత ప్రభుత్వంలో ఈ క్రాప్ లేదు.. అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా.. రైతన్నలు ఆఫీసులు, మధ్య దళారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి

కల్లం వద్దే ధాన్యం కొనుగోలు లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో 32.78, అందించిన మొత్తం రూ. కోట్లలో 58,773, రైతులకు ఉచితంగా ఇస్తున్న గన్నీ బ్యాగులు, లేబర్, ట్రాన్స్పోర్ట్(జీఎల్టీ) వ్యయం రూ. 82 కోట్లు

గతంలో ఏ రోజూ MSP దక్కలేదు.. ఏడాదికి సగటున కొనుగోలు చేసింది కేవలం రూ.8,000 కోట్ల ధాన్యమే.. కొనుగోలు చేసిన వాటికి చెల్లింపులు ఎప్పుడొస్తాయో, ఎంతొస్తాయో తెలియని అయోమయ పరిస్థితి..

లేబర్ ట్రాన్స్పోర్ట్ సంగతి దేవుడెరుగు.. గన్నీ బ్యాగులకు కూడా దిక్కులేని దుస్థితి.. మిల్లర్ల దళారుల చేతులు తడపాల్సిన వైనం..

ఇతర పంటల కొనుగోలు లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో 61.67, అందించిన మొత్తం రూ. కోట్లలో 7,751

మనం చెల్లించిన గత ప్రభుత్వ ధాన్యం సేకరణ బకాయిలు అందించిన మొత్తం రూ. కోట్లలో 960

ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ అందించిన మొత్తం రూ. కోట్లలో 41,266

ఫీడర్లు, సబ్ స్టేషన్ల ఆధునీకరణ అందించిన మొత్తం రూ. కోట్లలో 1,700

గత ప్రభుత్వ కరెంటు బకాయిలు అందించిన మొత్తం రూ. కోట్లలో 8,845

గతంలో వేళాపాళా లేకుండా రైతులకు విద్యుత్ సరఫరా..

నాణ్యత లోపం కారణంగా మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన దయనీయ స్థితి..

ఉచిత విద్యుత్ను నీరుగారుస్తూ రూ. 8,845 కోట్లు బకాయి పెట్టిన పరిస్థితి..

ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించిన మొత్తం రూ. కోట్లలో 3,093

గత ప్రభుత్వంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు సబ్సిడీయే లేదు.. ఆ తర్వాత కూడా రూ. 2 లకే యూనిట్ విద్యుత్ ఇస్తామని చెప్పి రూ. 451.77 కోట్లు ఎగ్గొట్టిన దుస్థితి..

శనగ రైతులకు బోనస్ అందించిన మొత్తం రూ. కోట్లలో 300

గత ప్రభుత్వంలో లేదు

సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ది లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో 5.66, అందించిన మొత్తం రూ. కోట్లలో 2,639

గత ప్రభుత్వంలో తమవారికి, తమ వర్గానికే మేలు కలిగేలా చర్యలు..

ఆయిల్ పామ్ రైతులకు సబ్సిడీ లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో 0.37 అందించిన మొత్తం రూ. కోట్లలో 172, గత ప్రభుత్వంలో ఇచ్చింది అరకొర

వైఎస్సార్ యంత్రసేవా పథకం అందించిన మొత్తం రూ. కోట్లలో 1,052, గత ప్రభుత్వంలో ఇచ్చింది అరకొర, గతంలో అరకొర ట్రాక్టర్లు పంపిణీ.. ప్రజాప్రతినిధులు ట్రాక్టర్ల డీలర్లతో కుమ్ముక్కై స్కీమ్ ల పేరుతో స్కామ్లు..

విత్తన సబ్సిడీ లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో 70.88 అందించిన మొత్తం రూ. కోట్లలో 1,209, గత ప్రభుత్వంలో సమయానికి విత్తనాలు అందించింది ఏనాడూ లేదు.. నాసిరకం విత్తనాలు.. చేంతాడంత క్యూలలో మండల కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురు చూపులు..

వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో 73.88 అందించిన మొత్తం రూ. కోట్లలో 1,835 గత ప్రభుత్వంలో రైతులకు రూ. 1.180 కోట్ల వడ్డీ బకాయిలు పెట్టి సున్నా వడ్డీ పథకాన్ని నిర్వీర్యం చేసిన దుస్థితి..

మనం చెల్లించిన గత ప్రభుత్వ విత్తన బకాయిలు అందించిన మొత్తం రూ. కోట్లలో 384 గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిన వైనం.. నాసిరకం విత్తనాలు, కల్తీ పురుగు మందులు, ఫెర్టిలైజర్లు.. తమకు అనుకూలంగా ఉన్న కంపెనీలకే లబ్ది కలిగేలా చర్యలు..

ఇది కేవలం రైతన్నల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో చేసిన వ్యయం మొత్తం రూ. 1,70,845 కోట్లు.

Comments