ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు రోజువారి లక్ష్యాలతో చర్యలు తీసుకుంటున్నాం !!



మచిలీపట్నం : ఆగస్ట్ 05, (ప్రజా అమరావతి);


*ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు రోజువారి లక్ష్యాలతో చర్యలు తీసుకుంటున్నాం !!*



   *---- జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు*


వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమీక్ష సమావేశం


 కృష్ణాజిల్లాలో ప్రాధాన్యత భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు రోజువారి లక్ష్యాలతో చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు


శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో హౌసింగ్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, హ్యాండ్లూమ్ డే, స్వమిత్వ, వ్యవసాయ అనుబంధ, జగనన్న సురక్ష, జేకేసి , ఆడుదాం ఆంధ్రా లపై సమీక్ష నిర్వహించారు.


ఈ కార్యక్రమనికి కలెక్టరేట్ చాంబర్  నుండి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుతో పాటు జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ , డిఆర్వో  ఎం. వెంకటేశ్వర్లు పలు శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు.


సమీక్షలో పాల్గొన్న  కలెక్టర్‌ పి. రాజాబాబు మాట్లాడుతూ, కృష్ణాజిల్లాలో ప్రాధాన్యత భవనాల నిర్మాణాలకు సంబంధించి 378 రైతు భరోసా భవనాల్లో 103 భవనాలు పూర్తి అయ్యాయని తెలిపారు, 268   వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలలో 70 పూర్తి కాబడి మిగిలినవి పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న ప్రాధాన్యత భవనాలను సెప్టెంబర్ లోపల పూర్తి చేస్తామని తెలిపారు.బి.ఎం.సి.యు , డిజిటల్ లాబరీస్ భవన నిర్మాణాలు జాప్యం లేకుండా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీర్లకు రోజువారి లక్ష్యాలను నిర్దేశించి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.యు.పి.హెచ్.సీ బిల్డింగ్స్ అన్ని పూర్తి అయ్యాయని పెండింగ్ లో ఉన్న మూడు వచ్చే నెల చివరినాటికి పూర్తి చేస్తామన్నారు.


 వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, నేషనల్ డి వార్మింగ్ లో భాగంగా నులి  పురుగుల నివారణకు జిల్లాలోని అన్ని స్కూళ్లలో ఆగస్టు 10 తేదీన పంపిణీ చేయనున్న నేపథ్యంలో  అల్బెంజాల్  మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.వాటర్ టెస్టింగ్ కోసం ఐసీడీఎస్,వైద్య శాఖ, ఆర్ డ్బ్యు ఎస్ సమన్వయంతో శాంపుల్ టెస్ట్ చేయాలన్నారు.ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో  డ్రాప్ ఔట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని గుర్తించాలని జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.

 

Comments