సకాలంలో అర్జీదారుల సమస్యలను పరిష్కరించండి.

 సకాలంలో అర్జీదారుల సమస్యలను   పరిష్కరించండి** *జిల్లా కలెక్టర్  పి అరుణ్ బాబుపుట్టపర్తి, ఆగస్టు 07 (ప్రజా అమరావతి):  ప్రజా సమస్యల పరిష్కారార్థం ఏర్పాటు చేసిన   "స్పందన"   కార్యక్రమం ద్వారా స్వీకరించిన  అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అన్ని శాఖల  అధికారులను  జిల్లా కలెక్టర్  పి అరుణ్ బాబు ఆదేశించారు.

పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను 226స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి 226 అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, డి ఆర్ డి  ఏ పి డి నరసయ్య, గ్రామ సచివాలయ మరియు వార్డు  సచివాలయాల  నోడల్ అధికారి  శివారెడ్డి వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి    అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై  కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

ప్రజలలో సంతృప్తి స్థాయి పెంచే విధంగా స్పందన జగనన్నకు చెబుదాం అర్జీలకు పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఎలాంటి పెండింగ్ ఉంచకుండా అర్జీలకు పరిష్కారం చూపించడం అత్యంత ముఖ్యమన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీలను పరిష్కరించాని, అర్జీలు వచ్చిన వెంటనే పరిశీలించి సత్వర పరిష్కారం చూపించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. చిలమత్తూరు  ఎంపీడీవో,  గోరంట్ల  ఎంపీడీవో, బుక్కపట్నం ఎంపీడీవో, బియ్యండి ఎస్ఎల్ఎలో  త్వరితగతిన పురోగతి సాధించాలని ఆదేశించారు. 


*ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమంలో కొన్ని వినతలు*.


* రామగిరి మండలం పేరూరు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు ఆయ కట్టుకింద ఉన్న తూములకు వెళ్లే దారి నిర్మాణం సరిగా లేదని దీనివల్ల రైతుల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నందున ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు అర్జీని  సమర్పించారు.


*  నల్లమాడ మండలం మసక వంకపల్లి గ్రామానికి చెందిన రామచంద్ర కు అర్హత ఉన్నప్పటికీ వృద్ధాప్య పింఛన్. మంజూరు కాలేదంటూ వినతి ని సమర్పించారు.

" గోరంట్ల మండలం నరసింహ పల్లి గ్రామానికి చెందిన సరోజమ్మ నిరుపేద వికలాంగురాలు  తనకున్న పాత ఇంటి షెడ్డు  మరమ్మతులు పనులకు కొందరు కావాలని అడ్డుపడుతున్నారని ఈ విషయంలో తనకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించింది.

. హిందూపురం మండలం చెర్లో  పల్లి గ్రామానికి చెందిన సంజీవప్పకు తన పిత్రార్జి రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా పలువురు సమస్యలు సృష్టిస్తున్నారని అందువల్ల రెవెన్యూ శాఖ అధికారులు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఆర్జి సమర్పించారు.


ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్  కుమార్ హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి,జిల్లాడిపిఓ విజయకుమార్, డి ఎం అండ్ హెచ్ ఓ  ఎస్వీ కృష్ణారెడ్డి,డిసిహెచ్ఎస్ .డా.ఎం.టి.నాయక్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డ్వామా పిడి రామాంజనేయులు, సోషల్ వెల్ఫేర్ శివరంగ ప్రసాద్,  ఏపీఎంఐపీ పిడి సుదర్శన్,  సంబంధిత  శాఖాధికారులు  తదితరులు పాల్గొన్నారుComments