భక్తులకు నాణ్యమైన ఆహారమందించే దిశగా ఎఫ్ఎస్ఎస్ఎఐ చర్యలు.*భక్తులకు నాణ్యమైన ఆహారమందించే దిశగా ఎఫ్ఎస్ఎస్ఎఐ చర్యలు


*


*తిరుపతిలో అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు*


*హోటల్ నిర్వాహకులకు ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ ఆధ్వర్యంలో శిక్షణ*


తిరుపతి, ఆగస్టు24 (ప్రజా అమరావతి);

తిరుమలకు వచ్చే  భక్తులకు నాణ్యమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించే దిశగా  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ) పలు చర్యలు తీసుకోనుంది. ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ  ఆధ్వర్యంలో తిరుపతిలోని తాజ్ హోటల్ లో గురువారం నాడు  41వ  సెంట్రల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది.  తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఈవో ధర్మారెడ్డి పిలుపు మేరకు ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ అధికారులు తిరుమలను సందర్శించారు. తిరుమల లో  ఆహార నాణ్యత, అన్న ప్రసాదం , లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రం, నీటి సరఫరా తదితర అంశాల నిర్వహణను మరింత మెరుగు పర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై  ఎఫ్ ఎస్ ఎస్ ఐ సిఇవో జి.కమలవర్దనరావు , ఏపీ ఫుడ్ సేప్టీ  కమీషనర్ జె.నివాస్ , ఇతర అధికారులు టిటిడి ఈవోతో చర్చించారు.   తిరుపతి లో అత్యాధునిక ఆహార నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు సుముఖత ను వ్యక్తం చేశారు. అలాగే భక్తులకు ఆరోగ్యవంతమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు టిటిడి సహకారంతో  హోటళ్ల నిర్వాహకులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, టిటిడి కలిసికట్టుగా పని చేసి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా  చర్యలు తీసుకోనున్నారు. తిరుపతి వేదికగా నిర్వహించిన ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ  సెంట్రల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం సందర్భంగా ఆ దిశగా అడుగులు వేయనున్నారు.


Comments