విజన్ చెప్పాం...చెప్పి చూపించాం.

 మండపేటలో భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రర్యటనసభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,

మండపేట (ప్రజా అమరావతి);

మండపేట తెలుగు దేశం పార్టీకి కంచుకోట.

తాపేశ్వరం కాజా అంత తియ్యని మనసున్నవాళ్లు ఇక్కడి ప్రజలు

వరుసగా మూడు సార్లు మండపేటలో తెలుగు దేశం జెండా ఎగిరింది.

అదీ మండపేటలో పార్టీకి ఉండే బలం.

నేను ఈ రోజు భవిష్యత్ కు గ్యారెంటీ....అదే బాబు గ్యారెంటీ అని చెప్పడానికి వచ్చాను

భవిష్యత్ తరాలకు ఏం కావాలో ఆలోచించి విజన్ ఇచ్చే వ్యక్తిని నేను.

నా విజన్ ను 420 అన్నవాళ్లు 420గా మిగిలిపోయారు. విజన్ చెప్పాం...చెప్పి చూపించాం.


2014లో విభజన కష్టాలు ఉన్నా....పెన్షన్ పెంచాను....సాగునీటి ప్రాజెక్టులు కట్టాను....రోడ్లు వేశాను....ఉద్యోగాలు ఇచ్చాను.

మరి ఇప్పుడు ఉద్యోగాలు లేవు...ఖర్చులు పెరిగాయి...ప్రభుత్వం బాదుడే బాదుడు.

ఇసుక మాఫియా మీ ఊళ్లో కూడా ఉంది. నెలకు ఇసుక ద్వారా రూ. 300 కోట్లు దోచేస్తున్నారు. ఈ ఇసుక కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చావు. గుట్టలు గుట్టలుగా ఉన్న ఇసుక ఎటువెళుతుంది.

ఇసుక మాఫియాతో భవననిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు.

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్య పాననిషేదం అన్నాడు...చేశాడా మద్యపాన నిషేదం. రేట్లు పెంచి తాగుడు తగ్గిస్తాను అన్నాడు. నిజంగా తగ్గిందా...మద్యం అమ్మకాలు పెరిగాయా చెప్పాలి

చిన్న చిన్న షాపుల్లో కూడా గూగుల్ పే ద్వారా సొమ్ము చెల్లిస్తున్నాం. మరి మద్యం షాపుల్లో ఎందుకు ఆన్ లైన్ పేమెంట్లు తీసుకోవడం లేదు.

ఇంత టెక్నాలజీ పెరిగితే ఆన్ లైన్ పేమెంట్ ఎందుకు లేదు. అంటే జగన్ దొంగ అని అర్థం అయ్యింది. ఆ దొంగను జైల్లో పెట్టాల్సిందే

మద్యం అక్రమ అమ్మకాల వల్ల ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష తప్పదు.

మద్యం అమ్మకాలు  తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు చేస్తున్నాడు.

జగన్ 10 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఆ సొమ్ము ఎటుపోయింది. కాలువలు తవ్వాడా...బిల్డింగ్ లు కట్టాడా....రోడ్లు వేశాడా.

కాలువల్లో పూడిక తీత కూడా ఎందుకు తీయలేకపోతున్నాడు. నాడు లేని ఈ పరిస్థితి ఇప్పుడే ఎందుకు ఉంది.

నాడు కరెంట్ చార్జీలు పెరగలేదు..మరి  ఇప్పుడు కరెంట్ చార్జీలు ఎందుకు పెరిగాయి. 

రాబోయే రోజుల్లో కరెంట్ చార్జీలు పెంచను...పైగా కరెంట్ చార్జీలు తగ్గిస్తా.

మీ ఊళ్లోనే కరెంట్ ఉత్పత్తి చేసి మీ దగ్గరే పంపిణీ చేసే వ్యవస్థను తీసుకువస్తా.

జగన్ రూ.10 ఇచ్చి...100 దోచేస్తున్నాడు. మళ్లీ పైగా పేదలు పెత్తందారులు అంటూ జగన్ పెద్ద పెద్ద మాటలు చెపుతున్నాడు.

పేదరికం పోయేవరకు నేను పనిచేస్తా...సంపద సృష్టిస్తా...సంపద పేదలకు పంచుతా

జగన్ కు దోపిడీ చేయడం దాచుకోవడమే...పేదల పొట్టకొట్టడం...తన పొట్టనింపుకోవడమే ముఖ్యం

జగన్ అవినీతితో పేదల రక్తం తాగుతున్నాడు. అవినీతి పోతే పేదరికం పోతుంది... అభివృద్ది జరుగుతుంది.

రాష్ట్రంలో రవాణా రంగం ప్రభుత్వ పన్నులకు కుదేలు అయ్యింది.

లారీలపై గతంలో రూ. 200 ఉండే గ్రీన్ టాక్స్ ను జగన్ రూ. 30 వేలు చేశాడు.

దేశంలో ఎక్కువ పెట్రో ధరలు ఉండే రాష్ట్రం మన రాష్ట్రం.

తెలుగు దేశం సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రకటించింది. దానిలో భాగంగా పలు పథకాలు అమలు చేస్తాం

మహిళలను మహాశక్తిగా మార్చే పథకమే మహాశక్తి

ఆడబిడ్డ నిధి:-18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. 

తల్లికి వందనం:- బిడ్డల చదువుకు ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. 

దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 

ఉచిత ప్రయాణం:- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 

యువగళం:- 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు,నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తాం.

అన్నదాత:- అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు. సబ్సిడీలు కొనసాగిస్తాం

ఇంటింటికి మంచినీరు - బిసిలకు రక్షణ చట్టం- పూర్ టు రిచ్@P4

జాబు రావాలి అంటే బాబు రావాలి. జగన్ ఇచ్చిన ఉద్యోగాలు రూ. 5వేల జీతం వచ్చే ఉద్యోగం

రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతిన్నది. అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతను ఆదుకుంటాం. దేశానికి అన్నం పెట్టే రైతుకు మంచి చేస్తా

దెబ్బతిన్న ఆక్వారంగాన్ని ఆదుకుంటాం.

చేనేత కార్మికులకు గత ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.

50 ఏళ్ల కే చేనేతలకు పెన్షన్ ఇచ్చాం. 1.11 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాం.

సొంత మగ్గాలపై 40 శాతం సబ్సిడీ ఇచ్చాం.

మగ్గాల ఆధునీకరణతో పాటు అనేక అంశాలపై సబ్సిడీలు ఇచ్చాం. చనిపోయిన చేనేత కార్మికులకు చంద్రన్న భీమా కింద సాయం చేశాం.

ఏడది గ్రామంలో 250 మగ్గాలు ఉంటే 35 మందికి మాత్రమే చేనేత నేస్తం అందించారు.

రానున్న రోజుల్లో చేనేతల కోసం ప్రత్యేక విధానాలు ప్రకటిస్తాం.

పోలీసులు రాత్రిoబవళ్లు పనిచేస్తారు...ప్రజలకు రక్షణగా నిలుస్తారు. నేను పోలీసులను ఎంతో గౌరవించాను.

ఈ పోలీసులే ముఠా కక్షలను, ఉగ్రవాదాన్ని అణిచివేశారు. కానీ నేడు ఈ సైకో పాలకుల వల్ల కొందరు పోలీసులు గాడి తప్పారు.

అయితే ఆ పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవుల సొమ్ము ఇవ్వడం లేదు....డిఎలు ఇవ్వడం లేదు...వాళ్లకు రావల్సిన నిధులు ఇవ్వడం లేదు.

మళ్లీ టీడీపీ వచ్చిన తరువాతనే పోలీసులకు న్యాయం చేస్తాం.

ప్రభుత్వం ఒత్తిడి చేసినా తప్పు చేయను అని పోలీసులు ఖరాకండిగా చెప్పాలి

మండపేటలో 400 కోట్లు ఖర్చు పెట్టి 6 వేల టిడ్కొ ఇళ్లు నిర్మించాం. కానీ ఈ ప్రభుత్వం మనం కట్టిన ఇళ్లకు పెయింట్ వేసుకున్నారు. కానీ ఇళ్లు పేదలకు ఇవ్వలేదు

పెయింట్ పై ఉండే ప్రేమ పేదలపై లేని ప్రభుత్వం ఇది

రూరల్ లో 3 వేల ఇళ్లు కట్టాం..మరి జగన్ నేడు ఎన్ని ఇళ్లు కట్టాడో చెప్పాలి.

పక్క నియోజకవర్గంనుంచి వైసీపీకి ఒక నాయకుడు వచ్చాడు. ఆయన అంతా దోపిడీనే.

ఇతని మనుషుల దోపిడీకి ఏకంగా రూ.10 కోట్లు జరిమానా వేశారు.

ద్వారపూడిలో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. దీనిపై ప్రజలు ప్రశ్నించాలి కదా.

మండపేట టౌన్ కు మన హయాంలో మాస్టర్ ప్లాన్ ఇచ్చాం. అయితే ఇప్పుడు తాము చెప్పిన రేటుకు అమ్మకపోతే మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసి భూములు లాక్కుంటా అని బెదిరిస్తున్నారు.

మిడిల్ ఇన్ కం గ్రూప్ కు భూసేకరణ అని బెదిరించి 22 ఎకరాలు తక్కవ రేటుకే కొట్టేసి 60 కోట్లు అక్రమంగా సంపాదించారు

వాలంటీర్లు వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. వాలంటీర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతున్నా

మనం అధికారంలోకి వచ్చిన తరవాత అన్నా క్యాంటీన్ వస్తుంది

పిల్లలకు విదేశీ విద్య వస్తుంది...చంద్రన్న భీమా వస్తుంది..పెళ్లి కానుక కూడా వస్తుంది

ఇప్పుడు జరుగుతుంది క్యాస్ట్ వార్ కాదు...క్యాష్ వార్. జగన్ అవినీతిపై, నేరాలపై పోరాటం జరగబోతుంది.

మహిళలపై నేరాల్లో ఈ సైకో సిఎం ఒక్క సారి అయినా రివ్యూ చేశాడా

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా.....ఒక ఎమ్మెల్సీ కారు డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశారు. వీళ్లు నాయకులా....

అంగల్లు గ్రామంలో నాపై దాడి చేసి....నాపైనే హత్యాయత్నం పెట్టారు.

నాడు ఎన్ఎస్జి కమాండోలు నన్ను కాపాడారు.

బాబాయి హత్య చేసి నాపై నెట్టారు. రేపు కోడికత్తి నిందితుడిని జైల్లో చంపేసి అది కూడా నేను చేశాను అంటారు.

మండపేట నుంచి చెపుతున్నా భవిష్యత్ కు గ్యారెంటీ నాది. ఎన్నికల్లో పనిచేయాల్సిన బాధ్యత మీది

ఒక్క చాన్స్ మన పాలిట శాపంగా మారింది. మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ వల్ల రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది

యుద్దభేరి కార్యక్రమంపై నేను ప్రశ్నిస్తే...ఒక్కమంత్రి కూడా సమాధానం చెప్పలేదు.

సైకోను, మతిస్థిమితం లేని వ్యక్తిని ఎవరైనా సర్పంచ్ గా పెట్టుకుంటారా...మరి సిఎంగా జగన్ ను ఎలా పెట్టుకుంటాం.

వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. 6 నెలల్లో ఇంటికి పోతుంది.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image