ఏటి మొగ-ఎదురు మొండి బ్రిడ్జి మంజూరు.

 

 నాగాయలంక, ఆగస్టు 23 (ప్రజా అమరావతి);


*రు.143 కోట్లతో ఏటి మొగ-ఎదురు మొండి బ్రిడ్జి మంజూరు*



జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు బుధవారం ఎదురు మొండి దీవుల్లో పర్యటించారు. ఈ పర్యటనలో నాచుగుంట గ్రామంలో కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ లంక గ్రామాల్లో ప్రజల సమస్యలు శాసనసభ్యులు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఈరోజు ఎదురు మొండి దీవుల్లో లంక గ్రామాల పర్యటనకు ఎమ్మెల్యేతో కలిసి వచ్చినట్లు తెలిపారు. లంక గ్రామాల సమస్యల పరిష్కారానికి ఏమేం చర్యలు తీసుకోవాలో తీసుకుంటామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్ ప్రతిపాదనలపై చర్చించి  అధికారులకు దిశ నిర్దేశం చేసినట్టు తెలిపారు.


ఎదురు మొండిలో 143 కోట్ల రూపాయలతో బ్రిడ్జి మంజూర యిందన్నారు. త్వరలో టెండర్లు దశ దాటి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. గొల్లమంద రోడ్డు రివర్ బండ్ దెబ్బతిందని అన్నారు. ఇంతకుముందు ఏఐబి కింద 2కోట్లు మంజూరు కాగా, ప్రస్తుతం అది 7 కోట్లకు అంచనా పెరిగిందని, అదనపునిధులు మంజూరు కోసం ప్రయత్నిస్తామన్నారు.

నాచుగుంట ఫారెస్ట్ సంబంధ సమస్య పరిష్కారానికి కన్సల్టెంట్ ను పెట్టి సర్వే చేయించి, అనుమతులు త్వరగా వచ్చేలా చూస్తామన్నారు.

నాచుగుంటలో ప్రధాన రహదారి అభివృద్ధి, పంటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. లంక గ్రామాలకు లింక్ ఏర్పరిచి, వారికి అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.


అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ ఎదురు మొండి దీవి గ్రామాల సమస్యలు ప్రజల కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు జిల్లా కలెక్టర్ ఒక రోజంతా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారన్నారు శివారు నియోజకవర్గమైన అవనిగడ్డ ప్రాంతంలో వర్షాలు వస్తే డ్రైన్లు మునిగి పొలాల ముంపు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. ఎదురు మొండి దీవుల ప్రజల సమస్యల పరిష్కారానికి, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.


పాత్రికేయుల సమావేశంలో దివి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కదవకొల్లు నరసింహారావు, జడ్పిటిసి మోకా బుచ్చిబాబు, డివిజనల్ ఫారెస్ట్ అధికారి (అభయారణ్యం) ఎస్ రవిశంకర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments