సీమలో ప్రాజెక్టులు తెచ్చింది టీడీపీనే:.

*సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన*


*ఓర్వకల్ ఎయిర్ పోర్టు వద్ద పార్టీ అధినేతకు ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు, కార్యకర్తలు*


*నందికొట్కూరులో రోడ్ షో, సభ బహిరంగసభలో పాల్గొన్న టీడీపీ అధినేత*


*నారా చంద్రబాబునాయుడు ప్రసంగం:-*

కర్నూలు (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో వైసీపీ హాయాంలో సాగునీటి రంగానికి తీవ్ర నష్టం జరిగింది. వైసిపి ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్ల ఇరిగేషన్ రంగం రివర్స్ అయ్యింది. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై టీడీపీ యుద్దభేరి ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పరిశీలన చేపడతాను. ప్రజలను చైతన్య వంతులను చేస్తాను. నందికొట్కూరు టూ పాతపట్నం యుద్ధభేరి యాత్రకు శ్రీకారం చుట్టాను. ఇక్కడ బయలుదేరి 2,500 కిలోమీటర్లు తిరిగి, ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకువస్తాను.

సీమకు నీటిసమస్య లేకుండా చేసే కల్పతరువు ముచ్చుమర్రి ప్రాజెక్ట్. దాన్ని పూర్తిచేసి జాతికి అంకితంచేశాను.

సీమలో ప్రాజెక్టులు తెచ్చింది టీడీపీనే:


-

రాయలసీమకు తాగు, సాగునీరు అందించే గేట్ వే బనకచర్ల. ఒకప్పుడు రాయలసీమలో నీటికోసం ఆందోళనలు జరిగాయి. 1983లో ఎన్టీఆర్ వచ్చాకే సీమ దశమారింది.  ఎస్.ఆర్.బీ.సీ తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనుడు ఎన్టీఆర్. తెలుగుగంగ ప్రాజెక్ట్ నిర్మాణానికి ముగ్గురు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని ఎన్టీఆర్ ఒప్పించారు. కాలువల ద్వారానే నీరువెళ్లాలి.. దారిపొడవునా మా రైతులకు నీరు అందాలని చెప్పి తెలుగుగంగద్వారా చెన్నైకి కృష్ణా జలాలు తరలించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. ఇక్కడి హంద్రీనదిపై నిర్మితమైన ప్రాజెక్ట్ నుంచి చిత్తూరు జిల్లాలోని నీవా నదికి నీళ్లు అందించడంకోసం కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందించేలా చేపట్టిన ప్రాజెక్ట్ హంద్రీనీవా. గాలేరు నగరి ఇక్కడే ప్రారంభమైంది. గాలేరు నుంచి నగరి వరకు నీళ్లివ్వాలని ఆలోచనచేసిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులు ప్రారంభించింది తెలుగుదేశంపార్టీ.. సీమకు నీళ్లిచ్చింది తెలుగుదేశంపార్టీ..ఎన్టీఆర్.

సీమకు నీళ్లు లేకుండా చేసింది జగన్ రెడ్డే:-

తెలుగుగంగ, హంద్రీనీవా, ముచ్చుమర్రి, ఎస్.ఆర్.బీ.సీ ప్రాజెక్టుల్ని ప్రారంభించింది తెలుగుదేశమే. రాఘవేంద్ర, సిద్ధాపురం, గుండ్రేవుల, వేదవతి, వెలుగోడు, బనకచర్లపనులు ప్రారంభిస్తే, ఇతను వాటిని నాశనం చేశాడు.  సీమలోని ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా చేసిన చరిత్రహీనుడు ఈ ముఖ్యమంత్రి. నేను వచ్చాక సీమలోని నీటి ఎద్దడిసమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాను. ఏటా సముద్రం పాలవుతున్న 3టీఎంసీల గోదావరి నీటిని సీమకు తరలించాలని సంకల్పించాను. ఒక్క అవకాశమివ్వండి అని ఒకవ్యక్తి వచ్చాడు.. అదే అతనికి చివరి అవకాశం. ముద్దులుపెట్టిన వాడు..ఇప్పుడు మిమ్మల్ని పిడిగుద్దులు గుద్దుతున్నాడు. రాష్ట్రానికి అన్యాయం చేశాడు... రాయలసీమకు తీరని ద్రోహం చేశాడు. 

ప్రాజెక్టుల పూర్తికి ఖర్చు ఎందుకు పెట్టలేదు?

నేను సాగునీటిరంగానికి రూ.68వేలకోట్లు ఖర్చుపెడితే, ఈయన మొత్తం కలిపి పెట్టిన ఖర్చు రూ.22 వేలకోట్లు. రాయలసీమలో సాగునీటిరంగానికి నేను రూ.12,400 కోట్లు ఖర్చుపెడితే, రాయలసీమ ద్రోహి ఖర్చుపెట్టింది కేవలం రూ.2 వేలకోట్లు. దీనికి ఏం సమాధానం చెబుతాడు? సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి ప్రకటించడానికే వచ్చాను. బూతులు తిట్టడం, సైకోగా ప్రవర్తించడంకాకుండా అడిగిన వాటికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. సమాధానం చెప్పలేకపోతేక, ముక్కు సీమనేలకు రాసి ప్రజలకు బహిరంగక్షమాపణ చెప్పి ఇంటికిపోవాలని సవాల్ చేస్తున్నా. రూ.10 లక్షలకోట్ల అప్పులు తెచ్చి, సీమలోని ప్రాజెక్టులకు తూతూ మంత్రంగా రూ.2వేలకోట్లు ఖర్చు పెట్టాడు. ప్రజలసొమ్ము, అప్పులసొమ్ము అంతా అవినీతిపాలైంది. 

గుంతలు పూడ్చలేని వాడు మూడు రాజధానులు కడతాడా?

ఈ ప్రభుత్వం ఇంక ఉండేది 6నెలలు. తమ్ముళ్లకు ఉద్యోగాలతో న్యాయం జరిగిందా? రోడ్లపై గుంతలు పూడ్చలేడుగానీ, ఈ సిగ్గుమాలిన ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడా? సిగ్గుతో అందరం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చాడు.  కర్నూలుకు న్యాయరాజధాని తీసుకొచ్చాడా? నేనే ఇక్కడ రూ.90కోట్లతో విమానాశ్రయం కట్టించా. దానికి ఈ ముఖ్యమంత్రి మరలా రిబ్బన్ కట్ చేసి, తన పేరు పెట్టుకున్నాడు. స్టిక్కర్ ముఖ్యమంత్రి, పనికిమాలిన ముఖ్యమంత్రికి  ధైర్యముంటే నందికొట్కూరుకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలి. 

సీమకు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? 

నేను తీసుకొచ్చిన పదివేల ఎకరాల పారిశ్రామివాడ పూర్తయితే ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యోగాలు లభించేవి. ఈ ముఖ్యమంత్రి ఒక్క కంపెనీ తీసుకొచ్చి ఒక్క ఉద్యోతమైనా ఇచ్చాడా? ప్రపంచంలో అతిపెద్దదైన సోలార్ పార్క్ ఏర్పాటుచేస్తే, ఈ ముఖ్యమంత్రి లంచాల కోసం దాన్ని ఇప్పటివరకు ఆపేశాడు. జైన్ ఇరిగేషన్ ద్వారా రూ.365కోట్లతో ఆహారశుద్ధిపరిశ్రమ తీసుకొస్తే, వారుపారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. అయోవా విశ్వవిద్యాలయం సహకారంతో విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని నందికొట్కూరులో ప్రారంభించాను. అది పూర్తయితే ఈ ప్రాంతం దేశానికే విత్తన రాజధానిగా నిలిచేది. రామ్ కో సిమెంట్ పరిశ్రమ, ఉర్దూ యూనివర్శిటీ, జగన్నాథగుట్టపై ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చాం. కర్నూలు ఆసుపత్రిని అభివృద్ధిచేశాం. అలగనూరు రిజర్వాయర్ నుంచి నందికొట్కూరుకు తాగునీరు ఇవ్వడానికి రూ.110కోట్లు మంజూరు చేశాం. నాలుగున్నరేళ్లలో ఒక్క పని జరిగిందా? సాగునీటిప్రాజెక్టులు లేవు...పరిశ్రమలు లేవు... తాగునీరులేదు.  ఇక్కడి నాయకులు ఇళ్లపట్టాల పేరుతో పేదల భూములు రూ.5లక్షలకు కొని, రూ.60 లక్షలకు అమ్ముకున్నారు. 

నాణ్యత లేని మద్యంలో ప్రజల ప్రాణాలను హరిస్తున్న జగన్

తెలంగాణ మద్యం అమ్ముతున్నారు. ఇక్కడ ఒక మహానాయకుడు ఉన్నాడు.. విర్రవీగుతున్నాడు. గట్టిగా అరవడం, రౌడీయిజం చేయకుండా సేవచేసి ప్రజల మనసులు గెలవండి. ఈ వైసీపీ నాయకుల్ని మురికి కాలువలో ముంచితే అప్పుడైనా బుద్ధి వస్తుందేమో? బటన్ నొక్కుడు కంటే బటన్ బొక్కుడు ఎక్కువైంది. పైన 10రూపాయలకు బటన్ నొక్కుతాడు.. 90 రూపాయలు కాజేస్తాడు. అన్నింట్లో అవినీతే. మీరు తాగే మద్యం అసలు మద్యమేనా? నాశిరకం మద్యం ధరలు పెంచి  ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు.  మద్యంపై వచ్చే ఆదాయమంతా తాడేపల్లి కొంపకు పోతోంది.  నాణ్యతలేని మద్యంతో మీ ప్రాణాలు తీస్తున్నాడు. మద్యం దరలు పెంచి జగన్ దోచుకుంటున్నాడు.  మద్యం ధరల దోపిడి నుంచి నియంత్రిస్తా.. నాణ్యత లేని మధ్యాన్ని లేకుండా చేయడంతో పాటు మద్యం ధరలు తగ్గిస్తాను. ఇక్కడుండే మీకు  ఇసుక దొరకదు.. ఇక్కడి ఇసుక హైదరాబాద్, బెంగుళూరుకు పోతోంది. ఇసుకదందా.. మద్యం దందా.. ఖనిజాల దోపిడీ...విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఈ సొమ్మంతా ఎటుపోతోంది? 

టీడీపీ అధికారంలోకి వస్తే పెరిగిన ధరలను తగ్గిస్తాం:-

రాష్ట్రంలో సోలార్, పవన, పంప్డ్ విద్యుత్ ఉత్పత్తిచేస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన పనిలేదు. మనకున్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే, భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశమవుతుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నూతన విద్యుత్ పాలసీ తీసుకొచ్చి, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం. మంచి మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తాం. మహానాడులో సూపర్ సిక్స్ ప్రకటించాను. మహిళలు, రైతులు, యువత భవితకు అనేక పథకాలు ప్రకటించాను. నా కష్టమంతా ప్రజలకోసమే. వారి సంతోషమే నా సంతోషం. యువగళం సూపర్ హిట్టయ్యింది. యువతలో చైతన్యం వచ్చింది. 

నేనెప్పుడూ సింహాన్నే:-

ఈ సైకో ముఖ్యమంత్రి నన్ను ఒకమాటన్నాడు.  నేను ఎప్పుడూ సింహాన్నే. సింహంగానే బతుకుతా. నా వయస్సుని తప్పుపట్టాడు. ఈ ముఖ్యమంత్రి నాతో పోటీపడి పనిచేయగలడా? రాత్రి మొత్రం పనిచేసినా తెల్లారి  మరలా ఉత్సాహంగా పనిచేస్తాను. 20ఏళ్ల తర్వాత జరగబోయేది ముందే ఆలోచించి, దానికి అనుగుణంగా ప్రణాళికలు వేస్తాను. ప్రతి ఎకరాకు నీరు, ప్రతి తమ్ముడికి ఉద్యోగం, ప్రతిమహిళ కళ్లల్లో సంతోషం. ఇవన్నీ చేస్తాను. తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ -1 గా ఉండటానికి పనిచేస్తాను. తెలుగువాడు తలసరి ఆదాయార్జనలో ముందున్నాడు. ఫ్రస్టేషన్ తో శాపనార్థాలు పెడితే భయపడను. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 2 వేల కోట్లు ఖర్చుపెట్టిన మీరు రాయలసీమ ద్రోహం..కాదా? నీరే మన భవిష్యత్ అని తెలుసుకోండి. విద్యుత్ వస్తుంది.. పరిశ్రమలు వస్తాయి.. పంటలు పండుతాయి.  2019లో ఈ సైకో రాకపోతే, ఏపీ తెలంగాణను మించిపోయేది. అక్కడి వారు ఎవరూ సైకోల్లా విధ్వంసంచేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే, మా పిల్లలు గర్వపడేలా పరిశ్రమలు తీసుకొస్తాను. పోలవరం పూర్తిచేస్తాను

Comments