వెంకటాచలం చెరువు అక్రమ మట్టి తవ్వకాల్ని అరికట్టాలి....

 వెంకటాచలం చెరువు అక్రమ మట్టి తవ్వకాల్ని అరికట్టాలి....


.సర్వేపల్లి నియోజకవర్గం (ప్రజా అమరావతి);

        అంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,జిల్లా జనసేన పార్టీ వీర మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి,ఉపాధ్యక్షుడు బద్దిపూడి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు ...

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..

▫️వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సహజ వనరులన్నీ పెత్తందారులకు విల్లు రాయిచ్చినట్లుగా ఉంది.. జిల్లాలో ఇసుక,గ్రావెల్,మట్టి అక్రమ రవాణా పేట్రేగి పోయింది.

▫️ నిబంధనలకు నీళ్లు వదిలి అధికారుల నిర్లక్ష్యంతో కోట్ల రూపాయల సహజ సంపద పెత్తందారులు సొంతమవుతుంది.

▫️సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం చెరువు లో  బంగారం మించి మట్టి వ్యాపారం జరుగుతుంది.

 ▫️బంక కోసం అనుమతులు తెచ్చుకున్న గుత్తేదారులు కొంత జగనన్న కాలనీకి అని చెప్పుకున్నా వారు తవ్విన దానికి తరలిస్తున్న దానికి పొంతనే లేదు .

▫️ఏ ప్రాంతానికి సంబంధించిన ఏరియాలో ఆ ఏరియాలో మట్టి ఉండగా వెంకటాచలం చెరువు వద్ద దాదాపుగా కిలోమీటర్ల మేర 10 అడుగులు పైబడి తవ్వి నియోజకవర్గం దాటి అనేక ట్రక్కులు పోతున్నాయి.

▫️స్థానిక నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మట్టిని తవ్వి నేలనూ చదును చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారని,లక్షల విలువ చేసే సంపద ఉచితంగా తీసుకొని పోవడం నేరము.

▫️ ఒక 15 నుంచి20 నిమిషాల అక్కడ వేచి ఉంటే దాదాపుగా 20 నుంచి 30 ట్రక్కులు లోడింగ్ అన్లోడింగ్ జరుగుతూ ఉన్నాయి. 

▫️అధికారులు కూడా ఈ పెత్తందారుల  అడుగులకు మడుగులు అక్రమ రవాణాన్ని చూసి చూడనట్లే పోతున్నారని పిస్తుందివ

▫️ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా ఇంపార్టెంట్ నోట్ 2024లో ప్రభుత్వం మారబోతుంది మీరందరూ జవాబు చెప్పవలసి వస్తుంది.

▫️ రెవెన్యూ సిబ్బంది గాని మైనింగ్ డిపార్ట్మెంట్ గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గతంలో మా నాయకులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చూసి చూడనట్లు ఊరుకోవటం వలన అక్రమ రవాణా పేట్రేకిపోయింది.

▫️ఈ తవ్విన తవ్విన గుంతలకు  మీరు రేపు రానున్న రోజుల్లో కచ్చితంగా వీటికి లెక్క చెప్పాల్సి వస్తుంది .

▫️పేద మధ్య తరగతిలో వారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వైసిపి నాయకులు వారి కింద పెత్తందారులు మాత్రం అక్రమంగా దోచుకుంటూ లక్షల్లో మునిగిపోతున్నారు.

▫️అక్రమ తవ్వకాల వల్ల రేపేదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయ ప్రజల  క్షేమం మరిచి ప్రవర్తిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.

▫️ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి సహవాస సహజ సంపదలను కాపాడవలసింది.  


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ,వీర మహిళ కన్వీనర్ కోల విజయలక్ష్మి,జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్ బద్దిపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,హేమచంద్ర యాదవ్, సుమంత్,చిన్నరాజా,ప్రసన్న,కేశవ,ఖలీల్,వర్షన్, తదితరులు పాల్గొన్నారు...

Comments