న్యూరో క్రిటికల్ కేర్ చికిత్సల్లో విప్లవాత్మకం 'గోల్డెన్ అవర్'.*న్యూరో క్రిటికల్ కేర్ చికిత్సల్లో విప్లవాత్మకం 'గోల్డెన్ అవర్'**"గోల్డెన్ అవర్" బ్రోచర్లను ఆవిష్కరించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎం.టి. కృష్ణబాబు*


 *"గోల్డెన్ అవర్ ప్రోగ్రాంకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి  సహాయ సహకారాన్నందిస్తాం:కృష్ణబాబు*


*ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ సారథ్యంలో 'గోల్డెన్ అవర్'*


*తొలి గంటలో చికిత్సనందిస్తే మెరుగైన ఫలితాలు*


*'గోల్డెన్ అవర్'ను సద్వినియోగం చేసుకునేలా వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ లో ప్రత్యేక విభాగం*


*ఈనెల 13న గోల్డెన్ అవర్ గ్లోబల్ ప్రోగ్రాం*


మంగళగిరి,గుంటూరు జిల్లా, ఆగస్టు10 (ప్రజా అమరావతి): "పక్షవాతానికి గురైన వారికి చికిత్స అందించడంలోనూ, ప్రమాదాల్లో గాయపడినవారిని కాపాడటంలోనూ "గోల్డెన్ అవర్ " అత్యంత ముఖ్యమైనదని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎం.టి.కృష్ణ బాబు అన్నారు. తొలి గంట కాల వ్యవధిలో సరైన చికిత్స అందిస్తే కచ్చితంగా మెరుగైన ఫలితాల్ని సాధించొచ్చన్నారు. తొలి గంట వ్యవధిని సద్వినియోగం చేసుకునేలా సకల సదుపాయాలతో, అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో రూపుదిద్దుకున్న వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ వారి "గోల్డెన్ అవర్ న్యూరో క్రిటికల్ కేర్ చికిత్సల్లో విప్లవాత్మకం" అని కృష్ణబాబు అన్నారు. వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ చేపట్టిన 'గోల్డెన్ అవర్' ప్రోగ్రాం బ్రోచర్లను ఎపిఐఐసి టవర్స్ లోని తన ఛాంబర్ లో బుధవారం నాడు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి గంటలో చికిత్స అందించాల్సిన అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, గోల్డెన్ అవర్ చికిత్సల కోసం ప్రత్యేకంగా అత్యాధునిక చికిత్సా విభాగాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. న్యూరో సర్జరీ చికిత్సల్లో మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ పువ్వాడ రామకృష్ణ సారథ్యంలో ఆవిష్కృతమైన ఈ 'గోల్డెన్ అవర్' నూతన శకానికి నాంది పలుకుతుందన్నారు. 

మహోన్నత ఆశయంతో రూపుదిద్దుకున్న గోల్డెన్ అవర్ ప్రోగ్రాంకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని కృష్ణబాబు హామీ ఇచ్చారు.

 ఈనెల 13న జరిగే కార్యక్రమంలో, శ్రీలంక ఆహార భద్రత, వాణిజ్య శాఖ మంత్రి సతాశివన్ వియలందేరన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు తదితరులు 'గోల్డెన్ అవర్' ప్రోగ్రాం ను  ఆవిష్కరిస్తారని డాక్టర్ పువ్వాడ రామకృష్ణ తెలిపారు. వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ ద్వారా, న్యూరో సర్జరీ సేవలతో పాటు, హెడ్ ఇంజురీలు, మెదడు, వెన్నెముక సమస్యలు, చిన్నపిల్లలు, నవజాత శిశువుల్లో నాడీ సంబంధ వ్యాధులకు సమగ్ర చికిత్సలను అందిస్తామన్నారు. అన్ని రకాల న్యూరో సమస్యలకూ హెల్ప్ లైన్ నంబర్లు 9848122144, 9493661879లలో సంప్రదించవచ్చన్నారు.

వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ చైర్మన్, ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ గుంటూరు వరుణ్, ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, స్టేట్ ఐకాన్స్ ఫోరం అధ్యక్షుడు చైతన్య జంగా, డాక్టర్ విశ్వనాథ్, సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుComments