టీడీపీ ఇసుక మార్చ్ సక్సెస్.

 *టీడీపీ ఇసుక మార్చ్ సక్సెస్


*


*రాష్ట్ర వ్యాప్తంగా 67 క్వారీలను గుర్తించగా 44 ప్రధాన  క్వారీలలో  ‘ఇసుక సత్యాగ్రహం’ కార్యక్రమం*


*అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధాలతో అడ్డుకునేందుకు కుట్ర*


*ఇసుక అనుమతులు, తవ్వకాల లెక్క తేల్చాలని టీడీపీ నేతల పట్టు*


*రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇసుక సత్యాగ్రహం’ పేరుతో టీడీపీ శ్రేణుల నిరసనల హోరు*


*ఇసుక దొంగలను అరెస్టు చేసి.. ఉచిత ఇసుక విధానం తీసుకురావాలంటూ డిమాండ్*


*జగన్ రెడ్డి ఇసుక దోపిడీతో 123 వృత్తులు, వ్యాపారాలు రోడ్డున పడ్డాయి*


*40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నోట్లో జగన్ రెడ్డి మట్టి కొట్టాడు*

అమరావతి (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 48 గంటల గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. మూడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు రాష్ట్రంలోని ఇసుక ర్యాంపుల వద్ద ప్లకార్డులు పట్టుకుని అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కొండలను తలపించేలా ఉన్న ఇసుక గుట్ట(డంప్‌)లను పరిశీలించారు. ప్రకృతిని నాశనం చేస్తూ, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఇసుక తవ్వకాలు జరిపి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడాన్ని తప్పుబట్టారు. అక్రమ క్వారీలకు సంబంధించిన ఆధారాలను మీడియాకు వెల్లడించారు.టెండర్లు పిలవకుండా, కొత్త ఏజెన్సీ ఎంపిక చేయకుండా, NGT విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్, ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు ఇసుకను అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉచితంగా ఇసుక అందిస్తే విమర్శించిన జగన్ రెడ్డి, నేడు పందికొక్కులా ఇసుక మొత్తాన్ని బొక్కేస్తున్నాడని, పేదలకు ఇసుక అందని ద్రాక్షలా తయారు చేశాడంటూ మండిపడ్డారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రోడ్డెక్కకుండా పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని తప్పుబట్టారు.


*అరెస్టులు, గృహ నిర్బంధాలు*


ఆమదాలవలసలో కూన రవికుమార్, నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి, మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణ, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, పెనమలూరులో బోడె ప్రసాద్, పామర్రులో వర్ల కుమార్ రాజా, అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు,  కురుపాంలో తొయ్యక జగదీశ్వరి, వేమూరులో నక్కా ఆనందబాబు, గుంటూరు పశ్చిమలో కోవెలమూడి రవీంద్ర, కోవూరులో పోలవంరెడ్డి దినేష్ రెడ్డి, జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్య, నందిగామలో తంగిరాల సౌమ్య, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్‌లను కార్యక్రమానికి వెళ్తుండగా అడ్డుకున్నారు.


మైలవరంలో దేవినేని ఉమామహేశ్వరరావు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటిపుల్లారావు, తాడికొండలో తెనాలి శ్రావణ్ కుమార్, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, తిరువూరు శావల దేవధత్, కొవ్వూరులో గొర్రెల శ్రీధర్, కంఠమనేని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరిలను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. 


నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కావలి నియోజకవర్గంలో మాలేపాటి సుబ్బారాయుడు, నెల్లూరు సిటీలో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.


రాష్ట్రంలో ఎక్కడైనా ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే ముందుగా గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకుని, వాటిని పరిశీలించి కేంద్ర ఆధీనంలో ఉండే స్టేట్ లెవల్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసైస్‌మెంట్ అథారిటీ (SIAA) ఏడాదికి మాత్రమే అనుమతిస్తుంది. ఆ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వంరాష్ట్రంలోని ఇసుక రీచుల్ని మూడు జోన్లుగా విభజించి జేపీ పవర్స్ అనే సంస్థకు గంపగుత్తగా కట్టబెట్టడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉచితంగా ఇసుక అందిస్తే జగన్ రెడ్డి ఇసుక మొత్తాన్ని గంపగుత్తగా చేతుల్లోకి తీసుకుని సామాన్యులు ఇసుక కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారన్నారు. జేపీ పవర్ వెంచర్స్ ఇసుక కాంట్రాక్టు 12.05.2023తో ముగిసింది. 06.06.2023న జీఎస్టీ నెంబర్‌ను సస్పెండ్ అయింది.అగ్రిమెంట్ ముగిసినా, జీఎస్టీ నెంబర్ సస్పెండైనా, అదే కంపెనీ పేరుతో, అదే జీఎస్టీ నెంబర్‌తో దొంగ వే బిల్లులు ఇచ్చి మరీ ఇసుక అమ్మకాలు ఎలా సాగుతున్నాయని ప్రశ్నించారు.ఈ దందా వెనుక సీఎం జగన్ రెడ్డి హస్తం ఉందన్నారు.  రీచుల్లో వే బిల్లులు, సీసీ కెమెరాలు లేకపోయినా అకారులు ఎందుకు చర్యలు తీసుకోవం లేదని నిలదీశారు.  రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులున్న 110 రీచుల్లో ఏడాదికి కేవలం 77 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు మాత్రమే అనుమతులున్నాయి. కానీ అనధికారికంగా సగటున ఏటా 15 కోట్ల క్యూబిక్ మీటర్ల చొప్పున ఇసుక తవ్వకాలు జరిపి నాలుగేళ్లలో 60 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేశారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లెక్క ప్రకారం చూసుకున్నా నాలుగేళ్లలో రూ.45,750 కోట్ల విలువైన ఇసుక అమ్మకాలు జరిగాయని, ఆ సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తీసుకున్న అనుమతులకు, జరిగిన తవ్వకాలకు ఏమాత్రమూ పొంతన లేకుండా పోయిందన్నారు. అడ్డగోలుగా జరుగుతున్న ఇసుక తవ్వకాలతో రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు జరిమానా కూడా విధించింది. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలోని అక్రమాలపై అసహనం వ్యక్తం చేసింది అయినా ప్రభుత్వ పెద్దలు ఎందుకు నోరెత్తడం లేదని నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 67  క్వారీలను గుర్తించగా 44 క్వారీలలో  ‘ఇసుక సత్యాగ్రహం’ విజయవంతంగా జరిగింది. మిగిలిన చోట్ల పోలీసులు అడ్డుకోవడంతో జరగలేదు.


పార్లమెంటు అధ్యక్షురాలు గుమ్మిడి సంధ్యారాణి, కూన రవికుమార్, పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు కొండ్రు మురళీ మోహన్, బండారు సత్యన్నారాయణమూర్తి, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, డోలా బాలవీరాంజనేయ స్వామి, శాసన మండలి మాజీ వైస్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగ్రాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, గుండ లక్ష్మీదేవి, కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలితకుమారి, గండి బాబ్జి, బండారు సత్యానందరావు, బోడే ప్రసాద్, శ్రీరాం రాజగోపాల్, పాశిం సునీల్ కుమార్, సుగుణమ్మ, ప్రభాకర్ చౌదరి, ఆర్.జితేందర్ గౌడ్, గౌరు చరితారెడ్డి,బి.సి.జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.ఎన్.రాజసింహులు, బత్యాల చెంగల్రాయుడు, పుత్తా నరసింహారెడ్డి, 2019 ఎంపీ అభ్యర్ధి గంటి హరీష్ మాధుర్, నియోజకవర్గ ఇంఛార్జిలు గౌతు శిరీష, కోరాడ రాజబాబు, బత్తుల తాతయ్య బాబు, పి.వి.జి కుమార్, మద్దిపాటి వెంకట్రాజు, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, హెలెన్, బొజ్జల సుధీర్ రెడ్డి, కలికిరి మురళీమోహన్, అమీర్ బాబు, జి.వి.ప్రవీణ్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, మన్నె సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image