అమెరికా చదువులకు గురుకుల విద్యార్ధులు,


అమరావతి (ప్రజా అమరావతి);


అమెరికా చదువులకు గురుకుల విద్యార్ధులు,


దేశవ్యాప్తంగా 30 మందికి అవకాశం, ఐదుగురు ఏపీ విద్యార్ధులకు చోటు, ఎంపికైన ఐదుగురు కూడా సాంఘీక సంక్షేమ గురుకులాలకు చెందిన విద్యార్ధులే.


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్సిట్యూషన్స్‌ సొసైటీకి చెందిన విద్యార్ధులువిద్యార్ధుల కుటుంబ నేపధ్యం, విద్యా వివరాలు ఒక్కొక్కరినీ అడిగి తెలుసుకున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


యూఎస్‌ఏలో చదువులు పూర్తయి వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా వారిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించిన సీఎం, గత ఏడాది అమెరికా వెళ్ళి కోర్సు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ఇద్దరు విద్యార్ధులు కూడా సీఎంని కలిసిన వారిలో ఉన్నారు. వారితో కూడా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం.


ఒక్కో విద్యార్ధికి ప్రోత్సాహకంగా రూ. లక్ష ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం, శాంసంగ్‌ ట్యాబ్‌ అందజేత.


సీఎంను కలిసిన విద్యార్ధులు...డి.నవీన, ఎస్‌.జ్ఙానేశ్వరరావు, రోడా ఇవాంజిల్, బి.హాసిని, సీహెచ్‌.ఆకాంక్ష, కె.అక్ష, సి.తేజ.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఏపీఎస్‌డబ్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి ఆర్‌.పావనమూర్తి, ఏపీఎస్‌డబ్యూఆర్‌ఈఐఎస్‌ పశ్చిమగోదావరి డీసీవో ఎన్‌.సంజీవరావు.

Comments