రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*ఏ.పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్మికుల (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో రాష్ట్ర సి.డి.ఎం.ఏ. కార్యాలయం ఎదుట ధర్నా*


*పెద్ద ఎత్తున పాల్గొన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ కార్మికులు*


*మున్సిపల్ రంగంలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని సియం జగన్ మాట నిలుపు కోవాలి*


*ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు*


రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఔవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్మినెంట్ చేసి మాట నిలుపుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాల


ని కోరుతూమంగళవారంవడ్డేశ్వరంలోని రాష్ట్ర సి.డి.ఎం.ఏ.కార్యాలయం ఎదుట (ఏఐటీయూసీ) ఏ.పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అసుల రంగనాయుకులు అధ్యక్షత జరిగిన ధర్నా కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పోరుమామిళ్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని నమ్మబలికి మోసం చేశారన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదని అన్నారు.

పర్మినెంట్ కార్మికులకు చెల్లించాల్సిన సరెండర్ లీవుల ఎన్ క్యాష్ మెంట్ సత్వరం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ధరలకనుగుణంగా 26 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు.పబ్లిక్ హెల్త్ విభాగాల్లో గల డ్రైవర్లకు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకు, పార్కు కూలీలకు హెల్త్ అలవెన్సులు ఇవ్వాలని టైంస్కేల్స్ వారినిక్రమబద్ధీకరించాలని అన్నారు.కరోనా విపత్తులో పనిచేసిన కార్మికులను యధావిధిగా కొనసాగించాలనిఆగస్టు,2023నాటికితెరుస్తామన్న జిపిఎఫ్ ఖాతాలు తెరవాలని అన్నారు.ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల్లో విధిగా పి.ఎఫ్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కరోనాతో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించాల్సిన ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఏ.పి.జి.ఎల్.ఐ బాండ్ల సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమచేయాలి. రెన్యూవల్స్ జరిపించాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు, ఉద్యోగులకు అమ్మఒడి, విద్యాదీవెన, వితంతు పెన్షన్ వంటిసౌకర్యాలు కల్పించాలని

అన్నారు.మున్సిపల్ పర్మినెంట్ & ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మున్సిపల్ కాలనీలు నిర్మించాలని క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500/- రూ. కనీస వేతనం ఇవ్వాలని క్లీనర్లను ఏర్పాటు చేయాలని పండుగ,జాతీయ శెలవు దినాలను పూర్తిగా ఇవ్వాలని అన్నారు.మరణించిన, రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలోవారి

కుటంబసభ్యులకు తిరిగి పనులు కల్పించాలని అన్నారు.రాజకీయ జోక్యాలు ఆపాలని స్కూల్ స్వీపర్లకు,టాయిలెట్ వర్కర్స్క, నగరదీపికలకు కనీస వేతనాలు అమలు చేయంచాలని పర్మినెంట్ కార్మికుల సెలక్షన్ గ్రేడ్స్ జరపాలని

డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను  సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటి దాస్,ఉపాధ్యక్షులు కోటమాల్యాద్రి,ఏపీ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గండికోట దుర్గారావు,

ఏఐటీయూసీ జిల్లా నాయుకులు అన్నవరపుప్రభాకర్, నందం బ్రహ్మేశ్వరరావు,హనుమంతరావు,చిన్నిసత్యనారాయణ,రామచంద్రయ్య,జాన్డిప్యూటీ జనరల్ సెక్రటరీ బందెల రవికుమార్, కార్యనిర్వహక కార్యదర్శికే.మల్లేశ్వరరావు,

కోశాధికారి తాడికొండ వాసు,

రాష్ట్ర సమితి సభ్యులు వర్రీ,సురేష్ కుమార్, తారక రామారావు, మున్సిపల్ వర్కర్స్ కార్మికులు పాల్గొన్నారు.

Comments