టీడీపీ వచ్చిన తరువాత కరెంట్ చార్జీలు తగ్గిస్తాం.



అమలాపురం  (ప్రజా అమరావతి);


*భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా అమలాపురంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో*


రోడ్ షోలో చంద్రబాబు నాయుడు  మాట్లాడుతూ 


మూడు రోజులుగా కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నా.

అమలాపురం అభివృద్ది జరిగింది అంటే బాలయోగి హయాంలోనే.

యానాం ఎదుర్లంక బ్రిడ్జి, రైల్వే లైన్లు, ప్రభుత్వ భవనాలు అన్నీ బాలయోగి ఉన్నప్పుడే వచ్చాయి

పచ్చటి కోనసీమలో వైసీపీ నేడు రాజకీయ చిచ్చు పెట్టింది. 

కోనసీమలో అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారు. చివరికి ఇక్కడ ఇంటర్ నెట్ సేవలు కూడా నిలిపివేశారు. అలాంటి పరిస్థితి కారణం అయ్యింది ఈ ప్రభుత్వం

ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దళిత మంత్రికి సిఎం దగ్గర కనీస మర్యాద లేదు. 

దళితుడైన బాలయోగిని మనం లోక్ సభ స్పీకర్ ను చేశాం.

నాలుగేళ్లుగా రాష్ట్రంలో జగన్ చీకటి పాలన. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఉంటే నేను ఒక్క విమర్శ చేయను. కానీ అలా లేదు.

అందరి జీవితాలు నాశనం చేశారు. నిత్యవసర వస్తువలు ధరలతో మహిళలు ఇల్లు  గడపలేకపోతున్నారు.

కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచారు. మన హయాంలో కరెంట్ చార్జీలుపెంచలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత కరెంట్ చార్జీలు తగ్గిస్తాం.

కరెంట్ సరఫరా కూడా సక్రమంగా ఉండడం లేదు. 200 వచ్చే కరెంట్ బిల్లు 1000 అయ్యింది. వెయ్యి వచ్చే బిల్లు నాలుగు వేలు 5 వేలు అయ్యింది. దీనికి కారణం ఎవరు.

ఒక అవినీతి ముఖ్యమంత్రి వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. టీడీపీ వచ్చిన తరువాత కరెంట్ చార్జీలు తగ్గిస్తాం. 


జగన్ అమలాపురం వచ్చి చూడాలి. ప్రభుత్వ పనితీరుపై స్పందన తెలుస్తుంది.

మద్య నిషేదం అని చెప్పిన జగన్....అధికారంలోకి వచ్చి రేట్లు పెంచాడు.

మగవారిని తాగించి ఇంటి ఆదాయం అంతా లాగేస్తున్నాడు

మద్యం పేరులో ప్రజల రక్తం తాగే జలగ జగన్ మోహన్ రెడ్డి

మద్యం షాపుల్లో ఎందుకు గూగుల్ పే ద్వారా చెల్లింపులు తీసుకోవడం లేదు. 

అమ్మకాలు చేసిన డబ్బు అంతా ఎక్కడికి పోతుంది.

ఈ సైకో సిఎంకు మీ బలహీనత అర్థం అయ్యింది. అందుకే దోచుకుంటున్నాడు.

ఇంటిపన్ను పెంచాడు...కొత్తగా చెత్త పన్ను తెచ్చాడు. నాడుమనం సిమెంట్ రోడ్లు వేశా...వీధి దీపాలు పెట్టాం. ఇప్పుడు కనీసం రోడ్ల గోతుల రిపేర్లు కూడా చేయడం లేదు

వ్యవస్థలను నాశనం చేసిన జగన్...5 ఏళ్ల నుంచి రోడ్లు కూడా వేయలేకపోతున్నాడు

బుద్ది లేని ఈ సిఎం ప్రజలకు దెబ్బతిన్న రోడ్ల ద్వారా నరకాన్ని చూపిస్తున్నాడు

సాగు నీటి కాలువల్లో పూడిక లు తీయలేదు...లాకులకు గ్రీజ్ రాయలేదు....చివరి భూములకు నీరు కూడా రావడం లేదు

ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేయడం వల్లనే ఈ దుస్థితి

రాష్ట్రం శాశ్వితం ....ఈ ముఖ్యమంత్రి శాశ్వితం కాదు.

రాష్ట్రంలో ఇసుక మాఫియా తయారయ్యింది. ఇసుకాసురులు తయారు అయ్యారు

ఇసుక కొండలు తయారు చేశారు. అక్రమ తవ్వకాలతో ఇసుక ద్వారా కోట్లు కొల్లగొడుతున్నారు.

దేవుడు ఇచ్చిన ఇసుకను కూడా ఈ దుర్మార్గులు దోచుకుంటున్నారు. 40 లక్షల మంది ఉపాధి పోగొట్టారు

ప్రజా ప్రతినిధులుగా గెలిచింది....సేవ చేయడానికా...గుండు కొట్టించడానికా?

కలియుగ దైవం దగ్గర పులులు వస్తే భక్తులకు కర్రలు ఇస్తారట. చేతిలో కర్రచూసి పులిపారిపోతుంది అని చెపుతున్నారు.

పులిని తరమడం కాదు...ఇంటికొక కర్రపెట్టుకుని ఈ వైసీపీ వాళ్లను తరమాలి

పరిపాలన అంటే దోచుకోవడం కాదు...సేవ చేయడం

పేద వాడికి పెత్తందారుకి పోటీ అని అంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ప్రజలను పేదలను చేసి కథలు చెపుతున్నాడు

జగన్ 98 శాతం హామీలు నెరవేర్చాను అంటున్నాడు...కానీ 10 నుంచ 14 శాతం హామీలు కూడా నెరవేరలేదు

పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే గోదావరి జిల్లాల్లో మూడు పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్లం.

దేశంలో ధనిక ముఖ్యమంత్రి ఈ జగన్. మళ్లీ పేదలకు న్యాయం చేస్తాను అంటాడు.

నేను నాడు 200 పెన్షన్ ను 2000 చేశాను. జగన్ 3 వేలు ఇస్తాను అన్నాడు...ఇప్పటికీ 3 వేలు చేయలేదు

జగన్ పెన్షన్ పెంచకపోవడం వల్ల ఒక్కో పెన్షన్ దారుడికి 30 వేలు నష్టం.

అన్న క్యాంటీన్ పెడితే దాన్ని జగన్ మూసేశాడు. 450 రూపాయిలతో అన్న క్యాంటీన్ తో నెల అంతా గడిచిపోయేది.

జగన్ పట్టా దారు పాసుపుస్తకాలపై తన బొమ్మ వేస్తాడు అంట. ఇది మీ అబ్బ సొమ్మా....మన తాత ముత్తాల ఆస్తిపై జగన్ బొమ్మలు ఏంటి.

నిద్ర లేవగానే ఎన్టీర్ బొమ్మ చూస్తే స్ఫూర్తి వస్తుంది. జగన్ బొమ్మ చూస్తే ఏమి వస్తుంది.

జగన్ ఇప్పుడు నా ఎస్ సిలు, నా బిసిలు అంటున్నాడు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసే జగన్ మళ్లీ నా ఎస్ సిలు అంటున్నాడు

తల్లి చెల్లికి న్యాయం చేయని జగన్ ప్రజలకు న్యాయం చేస్తాడా

బాబాయిని చంపేసిన జగన్ మీ బిడ్డ కాదు....క్యాన్సర్ గడ్డ

క్యాన్సర్ గడ్డను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఏమారకుండా రాష్ట్రం నుంచి పంపించాలి.

జగన్ పాలనలో ఉద్యోగాలు లేవు. జాబ్ క్యాలెండర్ లేదు. మళ్లీ జాబు రావాలి అంటే బాబు రావాలి అంటున్నాడు. అదీ మన సత్తా. అదీ మన బ్రాండు

మన సైన్యం యువత...వారి భవిష్యత్ కు నాదీ గ్యారెంటీ

నాడు ప్రత్యేక హోదా కోసం జగన్ నంగి నంగి మాటలు చెప్పాడు 25 మంది ఎంపిలు వస్తే అందరికీ ఉద్యోగాలు అన్నాడు.

మరి ప్రత్యేక హోదా తెచ్చాడా...విభజన హామీల కోసం ప్రయత్నం చేశాడా

డిల్లీలో ఒక్క సారి అయినా వైసీపీఎంపిలు రాష్ట్రం గురించి మాట్లాడారా

ఇవన్నీ ప్రశ్నిస్తే మనపై కేసులు పెడుతున్నాడు. చివరికి నా పై కూడా హత్యాయత్నం కేసు పెట్టారు

అమలాపురంలో ఒక్క అభివృద్ది పని జరిగిందా....ఈ ప్రాంతంలో ఏ కొబ్బరి రైతు అయినా అనందంగా ఉన్నాడా

జామకాయ 10 రూపాయలు...కానీ కొబ్బరి కాయ 4 రూపాయాలకు కొంటున్నారు. ఇలా అయితే రైతు ఎలా బతుకుతాడు.

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొబ్బరి రైతాంగాన్ని ఆదుకుంటా. 

ఆక్వా రైతులు ఇప్పుడు వెంటిలేటర్ ఉన్నారు. జగన్ యూనిట్ విద్యుత్ 1.50 రూపాయలకు ఇస్తాను అన్నాడు. కానీ ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అని ఆ హామీని ఎగ్గొట్టాడు. యూనిట్ 4.50 రూపాయాలు చేశాడు. రొయ్యల ఫీడ్ ధరలు పెరిగాయి. మార్కెట్ సెస్ పెరిగింది. నీటి పన్ను కూడా పెంచి ఆక్వాను నాశనం చేశాడు.

తెలుగు దేశం వచ్చిన తరవాత మళ్లీ ఆక్వా రైతులను ఆదుకుంటాం. జగన్ కు ఎక్స్ పైరీ డేట్ వచ్చింది. ఆక్వా కు టీడీపీ న్యాయం చేస్తుంది

కాటన్ నీళ్లు ఇచ్చాడు అని కాటన్ దొరను ఆదరిస్తారు. మంచి చేస్తే ఆరాధిస్తారు. చెడు చేస్తే ప్రజలు తోలు తీస్తారు. రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర లేదు. చివరికి గోనె సంచులు కూడా ఇవ్వలేదు

మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతును రాజును చేస్తా.

మహిళల కష్టాల కోసం మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించాను. ఉచిత బస్సు ప్రయాణం, మూడు సిలిండర్లు ఉచితం గా ఇస్తా. ఆబిబిడ్డ, తల్లికి వందనం పథకాలు అమలు చేస్తా. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. రైతుకు అన్నదాత పథకం కింద 20 వేలు ఇస్తా. ప్రతి ఇంటికి మంచినీరు ఉచితం గా అందిస్తా. బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తా. పి 4 విధానం ద్వారా పేదరికం నిర్మూలిస్తా

ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కూడా జగన్ అన్యాయం చేశాడు.  పోలీసులకు కూడా టీడీపీ వచ్చిన తరువాత న్యాయం చేస్తా

ప్రభుత్వ ఉద్యోగులకు నాడు న్యాయం చేశా....మన ప్రభుత్వ వచ్చిన తరవాత ప్రభుత్వ ఉద్యోగులను ఆదుకుంటా

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాపులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ

కాపుల్లో పేదరికం ఉంది. అందుకే వారి కోసం కాపు కార్పొరేషన్ పెట్టాను.

కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేసిన పార్టీ టీడీపీ

బిసిలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేయాలి అని చూశాను.

అమలాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే , అతని అనుచరలు అక్రమాలకు పాల్పడుతున్నారు. పేదలకు భూముల విషయంలో అక్రమాలు చేశారు.

ఇక్కడ లే అవుట్ వేయాలి అన్నా....బిల్డింగ్ కట్టాలి అన్నా జె ట్యాక్స్ కట్టాల్సిందే

ఇలాంటి అక్రమాలు ఒక ట్రెండ్ అయ్యింది. టిడ్కో ఇళ్లుకు కూడా డబ్బులు తీసుకుని ఇచ్చారు. ఇలాంటి అక్రమాలకు ఈ వైసీపీ నేతలు తెరతీశారు.

చేనేత పరిశ్రమకు నాడు మనం న్యాయం చేశాం. మళ్లీ చేనేత పరిశ్రమను ఆదుకునేది టీడీపీనే.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image