నూరు శాతం అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ది-జిల్లా కలెక్టర్.*నూరు శాతం అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ది-జిల్లా కలెక్టర్*మచిలీపట్నం, ఆగస్టు 24 (ప్రజా అమరావతి);


నూరు శాతం అర్హులందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చడమే నవరత్నాలు- ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు.


జిల్లా కలెక్టర్  కలెక్టరేట్ లో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుండి వర్చువల్ గా ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి "నవరత్నాలు-ద్వైవార్షిక మంజూరు కార్యక్రమం " విసీలో పాల్గొని, అనంతరం జిల్లాలో వివిధ పథకాల కింద 4272 మంది లబ్ధిదారులకు రు.6.68 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పంపిణి గావించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ తో మొబైల్ నెంబరు లేదా ఆధార్ తో బ్యాంకు ఖాతా అనుసంధానం కాకపోవడం, ఏదేని సకాలంలో ధ్రువపత్రం సమర్పించకపోవడం తదితర కారణాలతో ప్రభుత్వ పథకాల లబ్ధి అందని వారిని మరల పరిశీలించి అర్హత మేరకు ఏడాదికి రెండుసార్లు లబ్ధి చేకూర్చడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం 4272 మంది లబ్ధిదారులకు 6.68 కోట్లు వివిధ పథకాల కింద ఆర్థిక సాయం పంపిణీ చేసినట్లు తెలిపారు


జగనన్న అమ్మఒడి క్రింద 395 మంది లబ్ధిదారులకు 59.25 లక్షలు,  జగనన్న చేదోడు క్రింద 1125 మంది లబ్ధిదారులకు1.12 కోట్లు,  ఈ బీసీ నేస్తం క్రింద 251 మంది లబ్ధిదారులకు 37.65 లక్షలు,  నేతన్న నేస్తం పథకం కింద 15 మంది లబ్ధిదారులకు 3.60 లక్షలు,  మత్స్యకార భరోసా క్రింద 36 మంది లబ్ధిదారులకు 3.60 లక్షలు,  జగనన్న విద్యా దీవెన క్రింద 862 మంది విద్యార్థుల 631 మంది తల్లులకు 1.51కోట్లు, జగనన్న వసతి దీవెన కింద 604 మంది విద్యార్థుల 582 మంది తల్లులకు 55.84 లక్షలు, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ పంట రుణాలు 479 మంది రైతులకు 69.47 లక్షలు,  వైయస్సార్ ఆసరా క్రింద 80 గ్రూపులలో 758 మంది సభ్యులకు 1.74 కోట్లు కలిపి మొత్తం 4272 మంది లబ్ధిదారులకు 6.68 కోట్లు పంపిణీ గావించినట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జన్ను రాఘవరావు, డి ఎల్ డి వో సుబ్బారావు, డి ఆర్ డి ఎ     పి డి  పిఎస్ఆర్ ప్రసాద్, డీఈవో తహెరా సుల్తానా, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, మత్స్య శాఖ జేడి ఎన్ శ్రీనివాసరావు, ఈడి  బీసీ కార్పొరేషన్ ఏ శ్రీనివాసరావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి తదితరులు పాల్గొన్నారు.


Comments