ఈ చేత్తో ఇచ్చి, ఆ చేత్తో లాక్కుంటున్నారు. అప్పులు చేస్తే తప్ప సంసారాలు గడవడంలేదు.



కొత్తపేట నియోజకవర్గ ఆలమూరు (ప్రజా అమరావతి);


*RTC బస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణం*


*భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, మహిళలతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్న చంద్రబాబు నాయుడు*


*ఆలమూరు నుంచి  రావులపాలెం వెళ్ళే దారిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణీకులతో మాజీ ముఖ్యమంత్రి మాటామంతీ* 


*ధరల పెరుగుదలతో ఈ ప్రభుత్వంలో బతకడం కష్టంగా మారిందని బాబుతో చెప్పుకొని వాపోయిన మహిళలు*


“ టీడీపీ ప్రభుత్వం రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్తు కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆలమూరు నుంచి  రావులపాలెం వెళ్ళే దారిలో ఆర్టీసీ బస్సులో చంద్రబాబు నాయుడు ప్రయాణిoచారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో ముచ్చటించారు.  

 *చంద్రబాబు నాయుడు :* ధరలు బాగా పెరిగాయి కుటుంబాలు ఎలా నెట్టుకొస్తున్నారమ్మా? 

 *ప్రయాణికురాలు* 

బస్సు ఛార్జీలు, కరెంట్ బిల్లులు, నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బందులు పడు తున్నాం.

 *చంద్రబాబు నాయుడు* 

ఈ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థికసాయం వల్ల మీకేమీ ఉపయోగం లేదా ? 

 *మరో ప్రయాణికురాలు* 

 ఈ చేత్తో ఇచ్చి, ఆ చేత్తో లాక్కుంటున్నారు. అప్పులు చేస్తే తప్ప సంసారాలు గడవడంలేదు.


• లారీలకు రోడ్ ట్యాక్స్ పెంచారని, కొత్తగా గ్రీన్ ట్యాక్స్ రూ.7,500లకు పెంచారని, గతంలో అది కేవలం రూ.200లే ఉండేదని చెప్పిన లారీ డ్రైవర్ / యజమాని. పూతరేకులు అమ్మి రోజుకి రూ.200లు సంపాదిస్తున్నానని చెప్పిన లారీ డ్రైవర్ భార్య. ఇద్దరూ సంపాదిస్తున్నా... ఐదురుగు సభ్యుల కుటుంబం గడవడం కష్టంగా ఉందన్న దంపతులు. 

• లారీలు, ఇతర వాహనాలపై ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ లు తగ్గిస్తేనే, తమక కు ఉపయోగం అన్న లారీ డ్రైవర్. ధరలు తగ్గాలని మహిళలు చెప్పారు. 

• కష్టపడేవారికి ఎలా న్యాయం చేయాలని.. వారి ఆదాయం ఎలా పెంచాల న్నదే తన ఆలోచన అన్న చంద్రబాబు. 

• వైసీపీవాళ్లకు తప్ప, ఇతరపార్టీలవాళ్లకు ఎలాంటి పథకాలు అందించడం లేదని చంద్రబాబుకి చెప్పిన పెంకిపాడు గ్రామ గృహిణి.  తన భర్త ఫోటోగ్రా ఫర్ అని, ఐదుగురు సభ్యులున్న కుటుంబం ఒక్కడి సంపాదనపైనే ఆధార పడిందని చెప్పిన మహిళ.  సామాజిక పింఛన్లు పెంచలేదని, విద్యుత్ బి ల్లులు భారీగా పెంచారని, గతంలో రూ.2వేలు వచ్చే బిల్లు ఇప్పుడు రూ.6 వేలు వస్తోందని వాపోయిన మహిళలు. 

• ఈ ప్రభుత్వం వల్ల ఎప్పుడూ చూడని కష్టాలు చూస్తున్నాం. ప్రభుత్వ విధానాలు అనేవి అన్నివర్గాల ప్రజలకు మంచిచేసేలా ఉండాలి. టీడీపీ ప్రభుత్వం రాగానే మీ  ఆదాయం పెంచేలా కొత్త విధానాలు అమలుచేస్తాన న్న టీడీపీ అధినేత.

Comments