భారత ఏస్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


భారత ఏస్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.



సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన జ్యోతి సురేఖ.


ఇటీవల బెర్లిన్‌ లో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్, ప్యారిస్‌లో జరిగిన ఆర్చరీ వరల్డ్‌ కప్‌లో పలు పతకాలు సాధించిన జ్యోతి సురేఖను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, తాను సాధించిన పతకాలను సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కు చూపిన సురేఖ.


అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై సురేఖను ప్రశంసించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, తనకు డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సురేఖ.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న సీఎం, రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్న సీఎం.


ఈ సందర్భంగా సీఎంని కలిసిన సురేఖ తండ్రి వెన్నం సురేంద్ర కుమార్‌.

Comments