గిరిజనులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.....

 ఎన్టీఆర్ జిల్లా (ప్రజా అమరావతి);


          


గిరిజనులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.....గిరిజన సమాజానికి అన్యాయం జరిగితే ఎస్టీ కమిషన్ చూస్తూ ఊరుకోదు..


రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు 

వడిత్యా శంకర్ నాయక్


 రాష్ట్ర ఎస్టీ కమిషన్ కార్యాలయంలో శనివారం సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ను బాధితుడు మోట నవీన్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ మాట్లాడుతూ జూన్ 19న ఒంగోలులో గిరిజన బాలుడు మోట నవీన్ పై దాడి చేసి మూత్రం పోసిన సంఘటన రాష్ట్ర ఎస్టీ కమిషన్ దృష్టికి రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తక్షణమే ఎస్టీ కమిషన్ స్పందించిందన్నారు.  సంఘటనకు బాధ్యులైన 9 మందిని అరెస్టు చేయడం, విధులు పట్ల అలసత్వం వహించిన వివిధ స్థాయి పోలీస్ అధికారులను సస్పెండ్ చేయటం జరిగిందని వివరించారు.


 సంఘటన జరిగిన వెంటనే తక్షణమే స్పందించి తనకు న్యాయం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎస్టీ కమిషన్ కు  మోట నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.


కమిషన్ సభ్యులను కలిసిన వారిలో గిరిజన సంఘాల నాయకులు మోట శ్రీనివాస్, పేరం సత్యం, వేములపాటి మహేష్, ఇస్లావత్ హనుమత్ నాయక్ ఉన్నారు.Comments