రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటుంది.మచిలీపట్నం ఆగస్టు 7 (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటుంద


ని జిల్లా కలెక్టర్ పి.  రాజాబాబు పేర్కొన్నారు.సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో  జరిగిన స్పందన కార్యక్రమంలో వయోజన వృద్దులు, దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ 5 మంది అంధులకు నియామక పత్రాలు అందజేశారు.


వీరిలో పెంటపాటి ఈశ్వర కుమార్ను   పశుసంవర్ధక శాఖ విజయవాడలో ఆఫీస్ సబార్డినేటుగా,  బండారు ధనలక్ష్మిని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం విజయవాడలో ఆఫీస్ సభార్డినేటుగా, గొల్లమందల విజయమ్మ నూజివీడు మున్సిపల్ కార్యాలయంలో ఆఫీస్ సభార్డినేటుగా, పినిశెట్టి కృష్ణవేణిని నందిగామ ప్రభుత్వ  మహిళా పాలిటెక్నిక్ లో స్వీపర్గా ,మాతంగి కిషోర్ను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫిట్టర్ బెడ్ ఆపరేటర్ గా కేటాయిస్తూ  జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు.


ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ ఎం వెంకటేశ్వర్లు, దివ్యాంగుల శాఖ ఏడి కామరాజు, ఆర్ డి ఓ ఐ కిషోర్, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి శివ నారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.Comments