అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమమే లక్ష్యంగా... ఇంటింటికి ప్రభుత్వం.

    శ్రీ సత్య సాయి జిల్లా (ప్రజా అమరావతి);

 



  సురక్షకు  నీరాజనం


అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమమే లక్ష్యంగా... ఇంటింటికి ప్రభుత్వం



*ప్రజా సమస్యలు సంతృప్తి స్థాయిలో పరిష్కారమే లక్ష్యంగా.. జగనన్న సురక్ష* 


 *జగనన్న సురక్షతో ఇంటి వద్దనే 11 రకాల  ప్రభుత్వ సేవలు పొందుతున్న జనం* 


 *11 రకాల సేవలకు ఎలాంటి సర్వీసు చార్జీలు లేకుండా ఉచిత సర్టిఫికెట్లు జారీ*  


 *ఇప్పటివరకు జిల్లాలో 4,80,439 పైగా సేవలు పొందిన ప్రజలు* 

రాష్ట్రంలోని  మూడో స్థానం


జిల్లా కలెక్టర్   పి అరుణ్ బాబు


*పింఛన్ కావాలనో...'చేయూత' ఇవ్వాలనో..'భరోసా' కల్పించాలనో.. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు...అర్జీలు ఇవ్వాల్సిన పని కూడా తప్పింది.. ఇంటి వద్దకే వలంటీర్ వచ్చి సమస్య తెలుసుకుంటున్నారు. దరఖాస్తు పూర్తి చేసి, సచివాలయాల్లో అందజేసి, ప్రభుత్వ పథకాలకు అర్హత ఉంటే లబ్ధిదారుగా చేరుస్తున్నారు. అంతేకాకుండా పైసా ఖర్చు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్నికి  శ్రీ సత్య సాయి జిల్లా జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. కుల ధ్రువీకరణ పత్రం అందుకున్న విద్యార్థి.. రేషన్ కార్డు తీసుకున్న ఇంటి పెద్ద.. ఇల్లు మంజూరు పత్రాన్ని పొందిన మహిళ.. పంట నష్ట పరిహారానికి అర్హత సాధించిన రైతు.. వాహన మిత్ర పథకంలో లబ్ధిదారునిగా చేరిన డ్రైవరు.. ఇలా ఒకరేమిటి.. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ సేవలు ఉచితంగా అందడంతో హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడికీ వెళ్లకుండా.. ఎవరి సిఫార్సులు లేకుండా.. పైసా ఖర్చు లేకుండా అవసరమైన పత్రాలు అందించేందుకు, అర్హత ఉండి ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండేవారిని లబ్ధిదారులుకు అన్ని అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 544 సచివాలయాల పరిధిలో గ్రామ సభలు నిర్వహించారు. మొత్తం 4,88,94 మందికి వివిధ సేవలను అందజేశారు.


*సర్వీసు చార్జీలు లేకుండా అందించే సేవ‌లు*


1) ఆదాయ ధ్రువీకరణ పత్రం

2) డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌

3) ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు)

4) మరణ ధ్రువీకరణ పత్రం

5) మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌

6) కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన

7) ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు

8) ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌

9) కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)

10) వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో అయితే 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు)

11) ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు.


సమిష్టి కృషితో విజయవంతం

జిల్లా కలెక్టర్


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా పౌరసేవలన్నీ వేగవంతంగా అందిస్తున్నాం. శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తోంది. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టుతున్నాం. దే­శంలో ఎక్కడాలేని విధంగా వినూత్నంగా జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి స­మస్యలేమైనా ఉంటే తెలుసుకుని పరిష్కారం  చూపించడం జరిగింది,జిల్లాలోని32మండలాలలోని 544  గ్రామ వార్డ్ సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష క్యాంపులు  నిర్వహించారు.  38 కమిటీలు పనిచేసే జూన్ 24వ తేదీన ప్రారంభమైన సురక్ష కార్యక్రమం జూలై 31న పూర్తయింది , అధికారులు, వాలంటీర్లు    ఇళ్లను సర్వే చేశారు. ఇందులో 4.88 లక్షల మందికి  సర్టిఫికెట్లు అందజేశారు. దీంతో శ్రీ సత్యసాయి జిల్లా 98.16 శాతంతో రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని దక్కించుకుంది

*,❇️శాఖల వారీగా అందించిన సేవలు:* 

1..రెవెన్యూ – 478210

2..ఆధార్ – 5328 

3. పౌర సరఫరాల శాఖ – 3579

4. గ్రామ/వార్డు సచివాలయాలు – 735

5. వైద్య ఆరోగ్య శాఖ – 78

6. వ్యవసాయ శాఖ  - 3

7. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపు శాఖ – 51 

8. రూరల్ డెవలప్మెంట్  - 37

9. కార్మిక శాఖ – 7 

10 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 61

*✳️ఎలాంటి సర్వీసు చార్జీలు లేకుండా అందిస్తున్న పౌర  సేవ‌లు* 


1. ఆదాయ ధ్రువీకరణ పత్రం

2. డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌

3  ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు)

4.మరణ ధ్రువీకరణ పత్రం

5.  మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌

6. కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన

7. ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు

8. ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌

9. కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)

10.  వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో అయితే 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు)


జిల్లాలోని32మండలాలలోని 544  గ్రామ వార్డ్ సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష క్యాంపులు  నిర్వహించారు.  38 కమిటీలు పనిచేసే జూన్ 24వ తేదీన ప్రారంభమైన సురక్ష కార్యక్రమం జూలై 31న పూర్తయింది , అధికారులు, వాలంటీర్లు    ఇళ్లను సర్వే చేశారు. ఇందులో 4.88 లక్షల మందికి  సర్టిఫికెట్లు అందజేశారు. దీంతో శ్రీ సత్యసాయి జిల్లా 98.16 శాతంతో రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని దక్కించుకుంది

లబ్ధిదారుల అభిప్రాయాలు


సర్టిఫికేట్ ఇంటికి  తెచ్చిచ్చారు


నాకు బర్త్ సర్టిఫికేట్ ,  కులం, ఆదాయం, అవసరమైంది, పదో తరగతి పూర్తి చేయడం జరిగింది ఇంటర్ అడ్మిషన్ లో నేను దరఖాస్తు చేసుకున్నాను, మా ఇంటికి రాజన్న ని వాలంటరీ వచ్చి నాకేం కావాలో మరి అడిగి తెలుసుకున్నారు కొన్ని జిరాక్స్ కాపీలు తీసుకున్నారు, రెండు రోజుల్లో నాకు కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్ తీసుకుని వచ్చి నా చేతికి ఇచ్చాడు, జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇంత మేలు జరుగుతుండటం నాకు చాలా ఆనందంగా ఉన్నది ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

కుమారి  శ్రీ మోషే శ్రీ,   ఆల్విన్ కాలనీ,పెనుగొండ, శ్రీ సత్య సాయి జిల్లా


  కొత్త రేషన్ కార్డు వచ్చింది


నా పేరు సుబ్బమ్మ, నేను  పుట్టపర్తి మండలంలోని, కర్ణాటక నాగి పల్లి నందు  నివసిస్తున్నాను. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. రైస్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు పొందడం లేదు.  జగనన్న సురక్ష కార్యక్రమంలో రైస్ కార్డు కోసం ధరఖాస్తు చేసుకోగా ధరఖాస్తును పరిశీలించిన అనంతరం అధికారులు రైస్ కార్డు మంజూరు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా లాంటి నిరుపేద ప్రజలకు అండగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి దన్యవాదాలు. 


అన్ని ఉచితంగానే

  రూపాయి ఖర్చు లేకుండానే నా కుటుంబానికి  ఆదాయం సర్టిఫికెట్,  బర్త్ సర్టిఫికెట్, రేషన్ కార్డు  ఉచితంగా లభించడం చాలా సంతోషం, ఒక సర్టిఫికెట్ కావాలంటే మీ సేవలో దరఖాస్తు చేసి  మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కొక్క  సర్టిఫిట్ కు కనీసం  200 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది జగనన్న సురక్షితతో సేవ సర్టిఫికెట్లు ఉచితంగా అందజేశారు

   షేక్ ఆరిఫ్ 

రెండవ సంవత్సరం బిఎస్సి, మంగళకర కళాశాల, పుట్టపర్తి



Comments