రాష్ట్ర సచివాలయంలో మణిపాల్ ఆసుపత్రి ఉచిత వైద్య శిభిరం.

 *రాష్ట్ర సచివాలయంలో మణిపాల్ ఆసుపత్రి ఉచిత వైద్య శిభిరం*అమరావతి, ఆగస్టు 24 (ప్రజా అమరావతి):  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వెలగపూడి  రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు ఉచిత వైద్య శిభిరాన్ని గురువారం నిర్వహించారు. ఈ వైద్య శిభిరంలో కార్డీయాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్, క్యాన్సర్ వైద్య పరీక్షలతో పాటు , ECG, 2D ECHO, PFT PAPSMEAR, MAMMOGRAM, FIBRO SCAN వంటి పరీక్షలను నిర్వహించడం జరిగింది. దాదాపు 750 మంది ఉద్యోగులు ఈ వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ వైద్య శిభిరంలో  Dr. Venu Gopal Reddy, orthopaedic, Dr. Priyanka, General physician, Dr. Shiva kotes, Cardiology, మరియు మణిపాల్ హాస్పిటల్ సిబ్బంది తమ తమ సేవలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటరియేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్  వెంకట రామిరెడ్డి తోపాటు అసోషియేషన్ ప్రతినిధులు పలువురు ఈ శిభిరంలో పాల్గొన్నారు.

                                                                         

Comments