ఉమ్మడి కృష్ణా వ్యాప్తంగా నారా లోకేష్ వెంట రెట్టించిన ఉత్సాహంతో నడిచిన వెనిగండ్ల.

 *ఉమ్మడి కృష్ణా వ్యాప్తంగా నారా లోకేష్ వెంట రెట్టించిన ఉత్సాహంతో నడిచిన వెనిగండ్ల*


 *- గన్నవరంలోనూ యువగళం పాదయాత్రకు జన నీరాజనం*

 *- అడుగడుగునా భారీ గజమాలలతో టీడీపీ శ్రేణుల ఘనసత్కారం* 


గుడివాడ, ఆగస్ట్ 23 (ప్రజా అమరావతి): ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా జరిగిన యువగళం పాదయాత్రలో  నారా లోకేష్ వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము రెట్టించిన ఉత్సాహంతో నడిచి టీడీపీ శ్రేణులను మరింత ఉత్సాహపర్చారు. ఈ నెల 19వ తేదీన ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడలోకి ప్రవేశించిన 

యువగళం కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. బుధవారం గన్నవరం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్ర ప్రారంభం నుండే జాతరను తలపించింది. గన్నవరం నియోజకవర్గంలోని యువత, రైతులు, మహిళలు నారా లోకేష్ కు నీరాజనాలందించారు. అడుగడుగునా భారీ గజమాలలతో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలుకుతున్నాయి. దారి పొడవునా జన ప్రవాహం కదం తొక్కింది. ప్రజలకు అభివాదం చేస్తూ వారి నుండి వినతులను స్వీకరిస్తూ పాదయాత్రను నారా లోకేష్ కొనసాగిస్తున్నారు. మహిళలు హారతులతో ఘనస్వాగతం పలుకుతున్నారు. ఇదిలా ఉండగా గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో నారా లోకేష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, వైవీబీ రాజేంద్రప్రసాద్, గన్నవరం టీడీపీ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు, ఇతర ముఖ్యనేతలతో కలిసి వెనిగండ్ల పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వెనిగండ్ల మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో యువగళం పాదయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతంగా సాగిందన్నారు. గన్నవరం నియోజకవర్గంలోనూ ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. పెద్దఎత్తున మహిళలు, యువకులు, వృద్ధులు నారా లోకేష్ కు సంఘీభావం తెలుపుతున్నారన్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ నారా లోకేష్  ముందుకు సాగుతున్నారన్నారు. నారా లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు యువకులు పోటీ పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని, పెండింగ్ పోస్టులను భర్తీ చేస్తామని, అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ను ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, ఉపకులాల వారీగా నిధులను మంజూరు చేస్తామని చెప్పారన్నారు. చంద్రబాబు హయాంలో కృష్ణాజిల్లాకు 17వేల మందికి ఉద్యోగాలను కల్పించే హెచ్ సీఎల్ ను తీసుకువచ్చారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుండెల్లో పెట్టుకుంటానని నారా లోకేష్ చెప్పి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారని వెనిగండ్ల చెప్పారు.

Comments