చేనేత కార్మికులకు అండగా వుంటూ వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.


నెల్లూరు (ప్రజా అమరావతి);


చేనేత కార్మికులకు అండగా వుంటూ వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నద


ని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ పేర్కొన్నారు.


జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణలో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ ను జిల్లా కలెక్టర్ కలెక్టర్ యం. హరి నారాయణన్, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ యం.ఆదిలక్ష్మి,తో కలసి ప్రారంభించారు.  అనంతరం స్టాల్ లో ప్రదర్శించిన చేనేత వస్త్రాలను జిల్లా కలెక్టర్ తిలకించారు.  ఈ సందర్భంగా  బుచ్చిరెడ్డిపాలెం, నారాయణరెడ్డిపేటకు చెందిన చేనేత కార్మికులు కొలమల దయాకర్, సీతా నాగేశ్వరరావు, శ్రీరాములు లను జిల్లా కలెక్టర్ జ్ఞాపిక, శాలువలతో ఘనంగా  సన్మానించారు.


అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు దేశ వ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు.  ముఖ్యంగా దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మనదేశంలో ఉత్పత్తి అయిన వస్తువులనే  వినియోగించాలని జాతిపిత మహాత్మాగాంధీ  పిలుపునివ్వడం జరిగిందన్నారు.  వారి ఆశయాలను గుర్తించుకొంటూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత వృత్తిని  ప్రోత్సహిస్తూ చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమానికి  వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం పధకాన్ని ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం 24 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.  ప్రజలందరూ  చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, ప్రజలకు సూచించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు ఈరోజు ఎదో ఒక చేనేత వస్త్రాన్ని కోనుగోలు చేయాలని, ఈ విధంగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం వలన చేనేత రంగాన్ని ప్రోత్సహించిన వారౌతారని  జిల్లా కలెక్టర్ తెలిపారు.


తొలుత జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గాంధీ బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ ఆర్. కూర్మనాథ్ ప్రారంభించగా, ఈ ర్యాలీ  గాంధీ బొమ్మ నుండి కలెక్టరేట్ వరకు కొనసాగింది. 


ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి ఆనందకుమార్, నాబార్డు డిడిఎం రవిసింగ్,   చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


Comments