స్త్రీ పురుషులకు సమంగా వారికి అన్ని హక్కులు ఉన్నాయి.
రాజమహేంద్రవరం,  (ప్రజా అమరావతి);

మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి క్వారీ మార్కెట్ సమీపంలో “ట్రాన్స్ జెండర్ల హక్కులు మరియు సమస్యల” గురించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయమూర్తి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు భారత రాజ్యాంగం ద్వారా మరియు గౌరవ సుప్రీం కోర్టు వారి ఆదేశాల ద్వారా వారికి అందించబడిన హక్కుల గురించి వివరించారు. వారి పట్ల ఎవ్వరూ వివక్ష చూపరాదన్నారు. స్త్రీ పురుషులకు సమంగా వారికి అన్ని హక్కులు ఉన్నాయ


ని తెలిపారు. వారి హక్కులను వినియోగించుకుని అభివృద్ధి సాధించాలన్నారు. వారి స్వయం ఉపాధి కోసం అందుబాటులో ఉన్న సబ్సిడీల గురించి వివరించారు. ఈ విషయంలో వారికి ఎలాంటి సహకారం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలిపారు.


 ఈ కార్యక్రమంలో దిశా పోలీస్ స్టేషన్ డీ.ఎస్.పి. కె. తిరుమల రావు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు స్త్రీ పురుషులతో సమానంగా అన్ని రంగాలలో అభ్యున్నతి సాధించాలన్నారు.  అనంతరం ట్రాన్స్ జెండర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత హెల్ప్ లైన్ నంబర్ 1091 పోస్టర్ ను ఆవిష్కరించారు. ట్రాన్స్ జెండర్లు ఈ హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవాలని న్యాయమూర్తి అన్నారు.Comments