దిశ SOS ఎఫెక్ట్...*దిశ SOS ఎఫెక్ట్...


*


నెల్లూరు.   (ప్రజా అమరావతి );జిల్లా బుచ్చిరెడ్డి పాలెం కు చెందిన ఓ వివాహిత తన భర్త నుండి ప్రాణహాని ఉందని దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. తన భర్త దుబారగా తిరుగుతూ, డబ్బులు కావాలని తనను శారీరకంగా హింసిస్తున్నట్లు మహిళ వాపోయింది. కేవలం ఆరు నిముషాల వ్యవధిలో బాధిత మహిళ ఇంటికి దిశ పోలీసులు చేరుకొని కాపాడటం జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

బుచ్చిరెడ్డిపాలెంలో నివాసం ఉండే నజీర్ కు భార్య, కుమారుడు ఉన్నారు. గత కొన్ని రోజులుగా డబ్బులు కావాలని నజీర్ తన భార్యను  వేధింపులకు గురి చేస్తున్నాడు. బుధవారం నాడు భార్యతో గొడవ పడుతూ ఆవేశంగా ఇనుప రాడ్ తో దాడి చేసి గాయపరిచాడు. తీవ్ర భయాందోళనకు గురైన మహిళ దిశ SOS కు కాల్ చేసి సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు నజీర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధిత మహిళ, కుటుంబసభ్యుల సూచన మేరకు నజీర్ కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మరొకసారి భార్యా, కుమారుడిని కొట్టడం, ఇబ్బందులకు గురిచేయడం లాంటివి చేయనని కులపెద్దలు, పోలీసుల సమక్షంలో భర్త నజీర్ ఒప్పుకోవడం జరిగింది. దిశ SOS కు కాల్ చేసిన నిముషాల వ్యవధిలోనే తనను రక్షించి, సమస్యను పరిష్కరించిన పోలీసులకు బాధిత మహిళ కృతజ్ఞతలు తెలిపింది.

Comments