ఈనెల 13న "ఆయుష్మాన్ భవ" కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర పతి.*ఈనెల 13న  "ఆయుష్మాన్ భవ" కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర పతి


*

*వీసీలో పాల్గొన్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి*

అమరావతి (ప్రజా అమరావతి): ఈనెల 13న గౌరవ రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సందర్భంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ మంగళవారం నాడు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖా మంత్రులతో ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుండి ఏపీ  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, ఎన్ హెచ్ ఎం  ఎస్పీఎం డాక్టర్ వెంకట రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం వివిధ ఆరోగ్య సంరక్షణ పథకాల గురించి సంతృప్త స్థాయిలో  సేవల్ని అందించేందుకు గాను "ఆయుష్మాన్ భవ" కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వరకు నిర్వహించనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో, అన్ని హెల్త్ ఫెసిలీటీల్లో ప్రారంభ వేడుకలు జరుగుతాయి.

Comments