సెప్టెంబర్ 25 లోపు ఓటర్ల జాబితాకి సంబంధించిన అన్ని మార్పులు, చేర్పులు చేసే విధంగా చర్యలు చేపట్టండి.

 సెప్టెంబర్ 25 లోపు ఓటర్ల జాబితాకి సంబంధించిన అన్ని మార్పులు, చేర్పులు చేసే విధంగా చర్యలు చేపట్టండి*

*రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా*


 

 పుట్టపర్తి, సెప్టెంబర్ 04 (ప్రజా అమరావతి):- సెప్టెంబర్ 25 లోపు ఓటర్ల జాబితాకి సంబంధించిన అన్ని  మార్పులు, చేర్పులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అదేశించారు.


సోమవారం  విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సెప్టెంబర్ 25 లోపు ఓటర్ల జాబితాకి సంబంధించిన అన్ని  మార్పులు, చేర్పులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అదేశించారు. పెండింగ్ లో ఉన్న ఇంటింటి సర్వే, జంక్ క్యారెక్టర్స్ ను సవరించి  పరిష్కరించే వాటికి సంబంధించి కొన్ని జిల్లాలో ఇంకా  పెండింగ్ లో ఉన్నాయని వాటిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 06.01.2022 నుండి 31.03.2023 వరకు ఓట్లను తొలగించిన వాటికి సంబంధించిన రీవెరిఫికేషన్ సెప్టెంబర్ 7 వ తేది నాటికి పూర్తి చేయాలని అన్నారు. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లకు సంబందించిన పనులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని అన్నారు. FLC వర్క్‌షాప్ సెప్టెంబర్ 15 వ తేదీన విజయవాడలో ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని, అందుకు గాను కలెక్టర్ ఒక సీనియర్ అధికారిని FLC సూపర్‌వైజర్‌గా  నియమించడంతో పాటు సంబంధిత  సమావేశానికి   కలెక్టర్లు, FLC సూపర్‌వైజర్‌లు తప్పకుండా హాజరు కావాలన్నారు. క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలను అప్‌లోడ్ చేయడంలో మరియు ప్రతివారం నిర్వహిస్తున్న  రాజకీయ పార్టీ ప్రతినిధుల  సమావేశాల మినిట్స్ అప్లోడ్ చేయడంలో పురోగతి సాధిస్తున్నారని తెలిపారు

  స్థానిక కలెక్టరేట్లోని  వీడియో కాన్ఫరెన్స్  హాలు నందు  జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్,  డిఆర్ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, ధర్మవరం ఆర్డీవో తిప్పే నాయక్, మడకశిర  నియోజకవర్గం  ఎన్నికల అధికారి చిన్నయ్య,  కలెక్టరేట్  ఎన్నికలు డిప్యూటీ తహల్దారులు,  మైనవుద్దీన్, భాస్కర్, పుట్టపర్తి తాసిల్దార్, పుట్టపర్తి ఎన్నికల  డిప్యూటీ తాసిల్దార్  తదితరులు పాల్గొన్నారు.

 

Comments