ఆర్టీసీ ఉద్యోగుల ప్రస్తుత ప్రమాద బీమా రూ.45 లక్షల నుండి రూ. కోటి పది లక్షలకు పెంపు

 ఆర్టీసీ ఉద్యోగుల ప్రస్తుత ప్రమాద బీమా రూ.45 లక్షల నుండి రూ.  కోటి పది లక్షలకు పెంపు 


 

ప్రమాద బీమా రూ. 30 లక్షల నుండి రూ. 85  లక్షలకు పెంపు 

రూపే డెబిట్ కార్డు లింకేజీ ద్వారా  రూ.10   లక్షల ప్రమాద బీమా సౌకర్యం

కొత్త రూపే కార్డు ద్వారా మరో రూ.10  లక్షల ప్రమాద బీమా సౌకర్యం

సహజ మరణానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం 

మొత్తంగా ఒక కోటి రూపాయల వరకు ప్రమాద బీమా  

ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న 

సంస్థ ఎం. డి.  శ్రీ సిహెచ్ . ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.

గౌరవ రవాణా శాఖా మంత్రి శ్రీ  పినిపె విశ్వరూప్ సమక్షంలో APSRTC - SBI ల ఒప్పందం ఖరారు 

*  హర్షం వ్యక్తం చేస్తున్న అసోసియేషన్లు మరియు ఉద్యోగులు  

విజయవాడ (ప్రజా అమరావతి);

ఈ రోజు అనగా తేదీ 21.09.2023 న ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఏ. పి. ఎస్. ఆర్. టి. సి. మరియు SBI ల మధ్య గౌరవ రవాణా శాఖా మంత్రి శ్రీ పినిపె విశ్వరూప్ గారి సమక్షంలో SBI కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అవగాహనా ఒప్పందం జరిగింది. 

ఏ. పి. ఎస్. ఆర్. టి. సి. ఉద్యోగులందరికీ SBI వారి కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద ప్రమాద బీమా మరియు ఇతర సదుపాయాలు గత 4 సంవత్సరాలుగా అమలులో ఉన్నాయి. 

ఉద్యోగులకు ఇంకా మెరుగైన సదుపాయాలు అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో SBI ఉన్నతాధికారులతో సంస్థ ఎం. డి. శ్రీ సి హెచ్ . ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. పలు విడతలు సంప్రదింపులు జరిపి ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన ప్రమాద బీమా పధకాన్ని రూపొందించారు. 

ఈ కార్యక్రమంలో, తొలుత సంస్థ ఎం. డి. శ్రీ సి హెచ్ ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు నిరంతరం కస్టపడుతూ జీవితాలని పణంగా పెట్టి ఉద్యోగాలు నిర్వహిస్తారని, అటువంటి వారికి ప్రమాద బీమా మొత్తం ఇలా పెరగడం శుభ పరిణామమని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కష్టాన్ని మంచి హృదయంతో అర్ధం చేసుకుని మెరుగైన బీమా పధకం అందుబాటులోకి తెచ్చిన బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ  ప్యాకేజ్ 03.09.2023 నుండి 02.09.2026 వరకు అంటే 3 సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని, ప్రమాదవ శాత్తూ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్ధికంగా ఎంతో వెసులుబాటు కలుగుతుందని, ఇప్పటివరకు రూ. 45 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా ఒక కోటి 10 లక్షలు అవుతుందని తెలియజేశారు.   

అనంతరం రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శ్రీ పినిపె విశ్వరూప్ గారు మాట్లాడుతూ  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసి వారి సంక్షేమానికి బాట  వేశారని,  ఆ కారణంగానే ఈ రోజున ఇన్ని ప్రయోజనాలు ఆర్టీసీ ఉద్యోగులు పొందగలుగుతున్నారని  శ్రీ విశ్వరూప్ తెలిపారు. అదేవిధంగా ఆయన రవాణా శాఖా మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మొదటగా ఆర్టీసీ ఉద్యోగులు ఇటీవల హయ్యర్ పెన్షన్ పొందడం జరిగిందని,  హయ్యర్ పెన్షన్ వలన రూ. 5 వేల నుండి రూ. 30 – 40 వేల వరకు ఉద్యోగులు పొందగలుగుతున్నారని,  ఇప్పుడు SBI ప్రమాద బీమామొత్తం పెంచడం రెండవ శుభ విషయమని పేర్కొన్నారు. SBI అధికారులు మరింత మెరుగ్గా ప్రమాద బీమా అందించేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు.

 కార్మికుల సంక్షేమం పట్ల ఎంతగానో కృషి చేస్తున్న ఎం. డి. గారికి  ప్రత్యేక  అభినందనలు తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి ఎంతో మేలు జరిగే ఇంత మంచి అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు ఏ. పి. ఎస్. ఆర్. టి. సి. అధికారులను,  SBI అధికారులను ఆయన ప్రశంసించారు. 

అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) శ్రీ కె. ఎస్. బ్రహ్మానంద రెడ్డి మరియు SBI అధికారులు శ్రీ ఓం నారాయణ శర్మ (జనరల్ మేనేజర్),   శ్రీ మనీష్ కుమార్ (DGM), శ్రీ దినేష్ గులాటి(DGM) మరియు శ్రీమతి సత్య స్వరూపిణి (AGM)లు, రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శ్రీ పినిపె విశ్వరూప్ గారు మరియు  ఎం. డి. శ్రీ సి హెచ్ ద్వారకా తిరుమల రావు,   ఐ. పి. ఎస్. ల సమక్షంలో పరస్పర అవగాహనా పత్రాలను మార్చుకోవడం జరిగింది. 

అనంతరం SBI జనరల్ మేనేజర్ శ్రీ ఓం నారాయణ శర్మ గారు మాట్లాడుతూ  దేశమంతటా ఎన్నో  ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు విస్తరించి SBI  సేవలు అందిస్తోందని, ఏ. పి. ఎస్. ఆర్. టి. సి. ఉద్యోగులకు కూడా  ఈ విధమైన మెరుగైన ప్రమాద బీమా సౌకర్యం వర్తింప చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.  

ఈ రోజు నుండి రూ.85  లక్షల ప్రమాద బీమా,  రెండు రూపే కార్డుల  లింకేజీ ద్వారా, రూ. 20  లక్షల అదనపు బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.  నెలకు రూ. 200  ప్రీమియంపై సాధారణ మరణాలకు రూ.5 లక్షలు బీమా లభిస్తుంది.  గతంలో 58 సంవత్సరాల వరకే ఇచ్చిన బీమా సౌకర్యం ఇప్పుడు 62 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.  చనిపోయిన ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కొరకు ఇప్పటివరకూ రూ.5 లక్షలుగా ఉన్న ఆర్ధిక రుణాన్ని ఇకపై రూ. 8 లక్షలకు (కుమార్తెకు రూ. 10 లక్షలు) పెంచారు.  అలాగే కుమారుడికి, ఇద్దరు కుమార్తెలకు వివాహ సందర్భంలో రూ. 2 లక్షలుగా ఉన్న ఆర్ధిక మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచారు. 

ఈ కార్యక్రమంలో ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా, సంస్థ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్ ) శ్రీ ఏ. కోటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) శ్రీ పి. కృష్ణ మోహన్, ఎఫ్. ఏ. & సి. ఏ. ఓ. శ్రీ రాఘవ రెడ్డి, ఛీఫ్ మేనేజర్ (పర్సనల్ ) తదితరులు పాల్గొన్నారు. 

Comments