పరాజయ భయంతోనే జగన్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

 


ప్రజలకోసం నేను, రాష్ట్రంకోసం ప్రజలు పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది. ఒక్క ఛాన్స్ అని నమ్మి అర్హతలేని వాడిని అందలం ఎక్కిస్తే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ప్రజలు అర్థం చేసుకోవాలి.


ఎన్నికలు వచ్చేవరకు ఆగొద్దు. భయానికి, బాధలకు వెరవకుండా హక్కులకోసం రాష్ట్రం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. 

• చేతులు ముడుచుకొని కూర్చుంటే జరిగే మనరాష్ట్రం ఎక్కడా కనిపించదు.

• ముఖ్యమంత్రి లక్షలకోట్ల భక్షకుడు...అవినీతి అర్భకుడు...పక్షపాతక రూపకుడు... ముఖ్యకంత్రీ మహామూర్ఖుడు.. ముచ్చి ముదనష్టకుడు.. జగమెరిగిన జగన్నాటకుడు..దేశానికి పట్టిన దరిద్ర జాతకుడు.. రాష్ట్రానికి రావణ పాలకుడు..  జనధన, మాన, ప్రాణ చోరకుడు.

• ఈ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు.. ప్రజలంటే పడదు. ఎవరినీ ఇష్టడపడడు. ముదనష్టపు మూర్ఖత్వంతో, ప్రజలకు ఎంగిలి చెయ్యి విసురుతూ వారిని  దోచుకుంటున్నాడు.

• తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి, చంద్రబాబుని 16 రోజులైనా జైల్లోపెట్టాలన్న దురుద్దేశంతోనే తప్పుడు ఆధారాలతో స్కామ్ సృష్టించారు

దుర్మార్గుల దుష్ట రాజకీయాలు పెచ్చుమీరినప్పుడు, నీతిపరులు కష్టాల పాలైనప్పు డు ప్రజలు ఆగ్రహించకపోతే, భవిష్యత్ పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని, చంద్రబాబునాయుడి అరెస్ట్ కు పాల్పడని ఈ దుష్టప్రభుత్వం, మరిన్ని అరెస్ట్ లకు సిద్ధ మవుతోందని, ఏంజరిగినా..ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ప్రజాక్షేత్రంలోకి దిగడానికి సిద్ధమయ్యాయని, ప్రజలకోసం నేను..రాష్ట్రంకోసం ప్రజలు పోరాడటానికి సిద్ధంకావాల్సిన తరుణం ఆసన్నమైందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు , హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తేల్చిచెప్పారు. 


మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 


పరాజయ భయంతోనే జగన్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.చంద్రబాబునాయుడు ప్రజా నాయకుడు. ఆయనకు ప్రజలు, రాష్ట్రంతప్ప  మరో ధ్యాస ఉండదు. కేవలం కక్షసాధింపు తోనే చంద్రబాబుని అరెస్ట్ చేశారు.  చట్టాలను అతిక్రమించి, అవినీతి జరగని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలుకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టాయని అసత్యప్రచారం చేసి అభూత కల్పనలు సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో తనకు పరాజయం తప్పదన్న భయంతోనే జగన్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి, చంద్రబాబుని 16 రోజులైనా జైల్లో పెట్టాలన్న దురుద్దేశంతోనే తప్పుడు ఆధారాలతో ఫేక్ స్కామ్ సృష్టించారు. యువత భవితకోసం చేపట్టిన గొప్పప్రాజెక్ట్ ను ప్రభుత్వం తన కుట్రరాజకీయాలతో నీరుగార్చే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.


స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే, ప్రాజెక్ట్ అమలు, నిర్వహణ బాధ్యత లతో పాటు నిధులు విడుదలచేసిన అధికారుల్ని ఎందుకు విచారించలేదు?


స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కార్యకలాపాలు 2013లో గుజరాత్ లో ప్రారంభమ య్యాయి. అక్కడ ఎలా అమలైందో పరిశీలించాకే విభజనానంతర ఏపీలో 2015 లో దాని అమలుకు టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అయినా, మరే విషయమైనా ముఖ్యమంత్రి కేవలం పాలసీ మేకర్ మాత్రమే. కార్యాచర ణ మొత్తం నిర్వహించేది అధికారులే. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను టీడీపీ ప్రభుత్వం లో తెరపైకి తెచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న అజయ్ కల్లం రెడ్డి అయితే,  ప్రాజెక్ట్ ఒప్పందంపై సంతకాలు పెట్టి, నిధులు విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో నిజంగా అవినీతి జరిగితే ఆనాడు ప్రాజెక్ట్ అమల్లో కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరు అధికారుల్ని ఇంతవరకు జగన్ ప్రభుత్వం, సీఐడీ  ఎందుకు విచారించలేదు? దీన్నిబట్టే అర్థమవుతోంది ఈ ప్రభుత్వం పెట్టింది తప్పుడు కేసు అని. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమల్లో భాగంగా డిజైన్ టెక్,  సీమెన్స్ సంస్థలు యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి ముందు కొస్తే, నాటి టీడీపీ ప్రభుత్వం నాలుగుదశల్లో రూ.330కోట్లు విడుదల చేయడం జరిగింది. జీఎస్టీ ఇతర చెల్లింపులు కలిపి మరో రూ.40 కోట్లు.. మొత్తం రూ.370 కోట్లు ప్రాజెక్ట్ అమలు కోసం ఖర్చుపెట్టడం జరిగింది. ప్రాజెక్ట్ ను  సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రంలో పేరేన్నికగన్న విద్యాసంస్థల్లో 40 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన పరికరాలు ఏర్పాటు చేశారు. వాటిని సమర్థవంతంగా వినియోగించుకొని 2,13,000 మంది యువతకు శిక్షణ అందించడం జరిగింది. వారిలో 70వేల మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించారు.ఇదంతా చాలా సక్రమంగా, ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా జరిగింది. ఈ ప్రాజెక్ట్ అమల్లో భాగస్వామి అయిన డిజైన్ టెక్ సంస్థ బ్రహ్మండంగా పనిచేసిందని వైసీపీ ప్రభుత్వం కితాబుకూడా ఇచ్చింది. నిజంగా తప్పు జరిగితే బాగుందని ఎలా చెప్పారు?

 

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో  తొలుత వేసిన ఛార్జ్ షీట్లో చంద్రబాబు పేరు ఎందుకు లేదు? చంద్రబాబు అరెస్ట్ కుట్ర ప్రకారం జరిగిన కక్షపూరిత వ్యవహారమే.


అంతా సజావుగా, సక్రమంగా జరిగిన దానిలో ఏదో జరిగినట్టు ప్రజల్ని నమ్మించ డానికే, వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ప్రాజెక్ట్ లో భాగస్వాములైన సంస్థల్ని, వ్యక్తుల్ని విచారణ పేరుతో వేధించింది. భయపెట్టి బలవంతంగా వారితో తప్పుడు ప్రకటనలు చేయించింది. చివరకు ఆయా సంస్థల బ్యాంకుఖాతాలు కూడా సీజ్ చేసింది. దానిపై సంస్థ యాజమాన్యాలు న్యాయస్థానాన్నిఆశ్రయించడంతో హైకోర్టు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టడమే కాక, బ్యాంక్ ఖాతాలు విడిపించింది.   నిజంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమల్లో చంద్రబాబు తప్పుచేస్తే మొదట్లోనే ఛార్జ్ షీట్ లో ఆయన పేరు ఎందుకు లేదు? ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెట్టి, ఎంతమందిని విచారించారో అందరికీ గతంలోనే హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. జగన్ ప్రభుత్వం కక్షతో పెట్టిన కేసు మొత్తం పూర్తిగా ముగిసిపోయింది.  అంతా అయిపోయిన దాన్ని తిరగదోడి, ఎక్కడో రాయలసీమలో ప్రజల్లో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి, అర్థరాత్రి హడావుడి చేసి, ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం ఏమిటి? అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా ప్రభుత్వ కుట్రలో, పథకం ప్రకారం జరిగిన కక్షపూరిత వ్యవహారమేనని స్పష్టంగా అర్థమవుతోంది.. 

                                                                                                                                                                                                        కుట్రరాజకీయాలు.. కక్షలు.. దోపిడీ తప్ప నాలుగేళ్లలో ఏం చేశారు?.

                                                                                                                                                                                                      ఈ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు.. ప్రజలంటే మొదటినుంచీ పడదు. ఎవరినీ ఇష్టడపడడు. ముదనష్టపు మూతి వేసుకొని, ప్రజలకు ఎంగిలి మెతుకులు వేస్తూ, వారినుంచి ఎంత దోచుకుంటున్నాడో చూస్తున్నాం. అభివృద్ధి చేయడం తెలియదు.. ప్రజలకు ఏంచేయాలో ఎలా చేయాలో అర్థం కాదు. కేవలం కుట్రలు, కక్షలు..దోపిడీ తప్ప నాలుగేళ్లలో చేసిందేమీ లేదు. ఏ నియోజకవర్గంలో అయినా చంద్రబాబు, టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడైనా ఏమైనా చేశారా వీళ్లు? ఆఖరికి రోడ్లు కూడా వేయలే దు. కనీసం ప్రజలకు తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక అవసరాలు కూడా అందించలే దు.  మూడు రాజధానులు అన్నారు.. నవరత్నాల పేరుచెప్పి, ఏదో చేస్తున్నట్టు వారిని మాయమాటలతో నమ్మించి రాష్ట్రాన్ని 10 లక్షలకోట్ల అప్పుల్లో ముంచారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కట్టాల్సింది ప్రజలే. ఎన్ని సంవత్సరాలైన ఈ ప్రభుత్వ రుణభారం ప్రజలే మోయాలి. 

 

ఏం జరిగినా..ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు అగ్నిశిఖలా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వస్తారు.


తెలుగుదేశం ఎన్టీఆర్ గుండెధైర్యం నుంచి, తెలుగువారి ఆత్మాభిమానం కోసం పుట్టిన పార్టీ, ఇలాంటి వాటికి పార్టీ కార్యకర్తలు వెరవరు. చంద్రబాబు నాయుడు పులుకడిగిన ముత్యంలా బయటకు వస్తారు. అగ్నిశిఖలా రెట్టింపు తేజంతో త్వరలోనే ప్రజల్లోకి వస్తారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు రాణిస్తున్నారు అంటే, దానికి కారణం చంద్రబాబు ముందుచూపే. ఆయన ఆలోచనలతో యువత భవితను, ఉమ్మడి రాష్ట్రా న్ని బంగారు మయం చేశారు. ఎన్టీ.రామారావు గారి వల్ల తెలుగువారి ఉనికి ప్రపంచానికి తెలిస్తే, చంద్రబాబునాయుడి పనితీరు, ఆలోచనతో ఖండఖండాల్లో నేడు తెలుగువారు గర్వంతా తలెత్తుకొని జీవించేస్థితికి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన అభివృద్ధికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. హైదరబాద్ నగర రూపురేఖలు మార్చి, దాన్ని గ్లోబల్ నగరం గా మార్చింది ఆయనే.

 

ముఖ్యమంత్రి లక్షలకోట్ల భక్షకుడు..అవినీతి అర్భకుడు...జన ధన, మాన, ప్రాణ చోదకుడు.


ఏపీ ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న కుట్రలపై స్పందించాలి. భయానికి, బాధలకు వెరవకుండా హక్కులకోసం రాష్ట్రం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది.  చేతులు ముడుచుకొని కూర్చుంటే జరిగే నష్టంతో మనరాష్ట్రం ఎక్కడా కనిపించదు. ముఖ్యమంత్రి లక్షలకోట్ల భక్షకుడు...అవినీతి అర్భకుడు...పక్షపాతక రూపకుడు... ముఖ్యకంత్రీ మహామూర్ఖుడు.. ముచ్చి ముదనష్టకుడు.. జగమెరిగిన జగన్నాట కుడు..దేశానికి పట్టిన దరిద్ర జాతకుడు.. రాష్ట్రానికి రావణ పాలకుడు..  జనధన, మాన, ప్రాణ చోరకుడు .జగన్ రెడ్డికి ఉన్న లక్షణాలు ఇలా వర్ణిస్తే చాలానే ఉన్నాయి. గార్దబానికి కస్తూరి తిలకం దిద్దినట్టు...బంగారం లాంటి రాష్ట్రాన్ని సీఎం జగన్ కు  అప్పగించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. రాజధాని లేదు.. పోలవరం లేదు..ఉద్యోగాలు లేవు... సాగునీటి ప్రాజెక్టులు లేవు... విద్యుత్ లేదు.. ఎటుచూసినా అప్పులు.. జనానికి తిప్పలు... ఇదీ చివరకు మిగిలింది.  ప్రజలు నాలుగేళ్లలో అనుభవించింది చాలు. మున్ముందు పీల్చేగాలిపై కూడా జగన్ పన్నులు వేస్తాడు. ఎన్నికలు వచ్చేవరకు ఎదురు చూడటం కాదు... ప్రజలు రోడ్డెక్కాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు పాల్పడిన ఈ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి. చంద్రబాబే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పాల్పడుతున్న చర్యలకు చింతించి, బాధపడి హఠాన్మరణం పాలైన ప్రతివ్యక్తి కుటుంబాన్ని త్వరలో పరామర్శిస్తాను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజాసంఘాలు, మేథావులు, దేశ విదేశాల్లోని తెలుగు వారు స్పందించాలి. ప్రజల కోసం నేను వస్తున్నాను...ఇకనుంచి తెలుగువాడి సత్తా, పౌరుషం ఏంటో ఈ దుర్మార్గులకు చూపిద్దాం.” అని బాలకృష్ణ పిలుపునిచ్చారు.


విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ.షరీఫ్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ ఎమ్మెల్సీ లు పరుచూరి అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ, నందిగామ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తంగిరాల సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image