వారం రోజుల్లో నిర్దోషిగా చంద్రబాబు బయటకు వస్తారు.

 *చంద్రన్నకు మద్దతుగా కదంతొక్కిన రాజమండ్రి ప్రజలు*

*కొవ్వొత్తుల ర్యాలీకి భారీగా తరలివచ్చిన మహిళలు*

*సంక్షేమం, అభివృద్ధి చేయడమే చంద్రబాబు చేసిన నేరమా?*

*దేవాన్ష్ చదివినా రిమాండ్ రిపోర్టు తప్పని చెబుతాడు*

*వారం రోజుల్లో నిర్దోషిగా చంద్రబాబు బయటకు వస్తారు


*

*న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది*

*కుదేలైన రాష్ట్రానికి చంద్రబాబు అవసరం చాలా ఉంది*

*క్లిష్టసమయంలో అండగా నిలచిన ప్రజలకు ధన్యవాదాలు*

*క్యాండిల్ లైట్ ర్యాలీలో పాల్గొన్న భువనేశ్వరి, బ్రాహ్మణి*

రాజమండ్రి (ప్రజా అమరావతి): మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మహిళలు శనివారం సాయంత్రం భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరం తిలక్ రోడ్డులోని సాయిబాబా ఆలయం నుండి శ్యామలానగర్ రామాలయం జంక్షన్ వరకు నిర్వహించిన  ప్రదర్శనకు నగరం నలుమూలల నుంచి వేలాది మహిళలు స్వచ్చందంగా తరలివచ్చారు. నగరానికి చెందిన మహిళలు, ప్రముఖులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున హాజరై చంద్రబాబునాయుడుకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబునాయుడు తక్షణం విడుదల చేయాలంటూ నినాదాలతో నగర వీధులు హోరెత్తాయి. ర్యాలీ అనంతరం శ్యామలానగర్ రామాలయం వద్ద నారా బ్రాహ్మణి విలేకరులతో మాట్లాడుతూ…చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసిన రోజు భారతదేశ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఆయన 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన విజనరీ, భారతదేశానికి ఐటీని తెచ్చిన దార్శనికుడు, నీతి నిజాయితీగా రాష్ట్రప్రజల కోసం కష్టపడిన చంద్రబాబుగారి లాంటి సీనియర్ నాయకుడిని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అక్రమం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి పరిణామం చూసి ఓ యువతిగా నేను చాలా బాధపడుతున్నాను. చంద్రబాబు కుటుంబ సభ్యురాలిగా కాకుండా సాధారణ మహిళగా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా గర్హిస్తున్నాను. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడికే రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. చంద్రబాబు వంటి నాయకుడు లేకపోతే యువతీ యువకులకు నైపుణ్యం, ఉద్యోగాలు వచ్చేవా? అభివృద్ధి చేయడం, సంక్షేమం అందించడం, ఉద్యోగాలు ఇవ్వడమే చంద్రబాబు చేసిన నేరమా? నేడు రాష్ట్రంలో యువతీ, యువకులకు ఎలాంటి శిక్షణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు. 

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర యువతకు గంజాయి, లిక్కర్ ఇచ్చి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టడంపై రాష్ట్రంలో పెల్లుబుకుతున్న ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయి. చంద్రబాబుకు జరిగిన అన్యాయంపై మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారు, ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబుకు అండగా నిలబడుతున్నారు. జాతీయస్థాయి నాయకులు, వివిధ రాష్ట్రాల నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించి మద్దతుగా నిలుస్తున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. విజయవాడ బెంజ్ సర్కిల్, గుంటూరు, నేడు రాజమండ్రిలో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన మహిళలను పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టారు. రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.

మేం ఎప్పుడూ ఒంటరి వాళ్లం కాదు.. రాష్ట్రప్రజలు, తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులు మాకు అండగా ఉన్నారు. చంద్రబాబులాంటి వ్యక్తిని  అరెస్టు చేస్తారని, మేం ఇలా రోడ్డుపైకి వచ్చి పోరాడాల్సి వస్తుందని ఊహించలేదు. చంద్రబాబు జైల్లో, లోకేష్ ఢిల్లీలో, మేం రాజమండ్రిలో, మా కుమారుడు దేవాన్ష్ హైదరాబాద్ లో ఉండాల్సిన పరిస్థితులు కల్పించారు. చంద్రబాబు ఐటీని తెచ్చి, రాష్ట్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?. చంద్రబాబు పర్యటనలకు రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన స్పందన వస్తోంది. దీన్ని ఓర్చుకోలేక మాపై కక్ష సాధిస్తున్నారు. మరో 6నెలల్లో ఎన్నికలు రాబోతున్నందున ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత తట్టుకోలేక చంద్రబాబును నిరాధార ఆరోపణలు చేసి అరెస్టు చేశారు. లోకేష్ యువగళం పాదయాత్రకు యువత పెద్దఎత్తున స్పందన రావడం కూడా ప్రభుత్వ కక్షసాధింపునకు ఒక కారణం.

చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ ను దేవాన్ష్ చదివినా చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని చెబుతాడు. లోకేష్ ను కూడా నేడో రేపో అరెస్టు చేయాలని చూస్తున్నారు. తప్పుచేయని మేం ఎవరికీ భయపడం. మా వెనుక 5కోట్లమంది ఆంద్రప్రదేశ్ ప్రజలు, బలమైన టీడీపీ కుటుంబం ఉంది. మాలో పోరాట స్ఫూర్తి ఉంది. మాకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది. వచ్చే వారంలో చంద్రబాబు నిర్ధోషిగా బయటకు వస్తారని నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు బయటకు రావాలి, ఏపీకి న్యాయం జరగాలి. దీనికోసం మా పోరాటం కొనసాగుతుంది. చంద్రబాబునాయుడు కియా, జోహో వంటి అనేక పరిశ్రమలు, కంపెనీలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. చంద్రబాబు తప్పు చేయలేదని యావత్ దేశం నమ్ముతోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా తెలుగుప్రజలు రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం శ్యామలాపురం రామాలయం జంక్షన్ వద్దనున్న సీతారాములవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీని ముగించారు. కార్యక్రమంలో మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గన్ని కృష్ణ, ఆదిరెడ్డి వాసు,  ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image