యూపీహెచ్సీలో ఆయుష్మాన్ భవ హెల్త్ మేళా...

 *యూపీహెచ్సీలో ఆయుష్మాన్ భవ హెల్త్ మేళా...*


  

మంగళగిరి (ప్రజా అమరావతి );  గణపతి నగర్ లోని ఇందిరా నగర్ డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో శుక్రవారం ఆయుష్మాన్ భవ హెల్త్ మేళ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎన్యూహెచ్ఎం స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి హాజరై హెల్త్ మేళాను ప్రారంభించారు. హెల్త్ మేళాలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. టెలి కన్సల్టెషన్ ద్వారా ఆరోగ్య చికిత్స అందించడంతోపాటు అవగాహన కల్పించారు. రోగులకు ఆభా ఐడీలు చేయించి ఆయుష్మాన్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. రోగులకు యోగ, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ హెల్త్ మేళా జరుగుతుందన్నారు. మేళాలో ఆయుష్మాన్ భవ కార్డులను క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆయుష్మాన్ భవ కార్డు ద్వారా బిపిఎల్ పేషెంట్స్ ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం పొందవచ్చన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ద్వారా ప్రజలు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. యుపీహెచ్సీలు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Comments